అక్టోబర్ 8న RRR విడుదలవుతున్నట్టు అలిసన్ డూడీ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ పెట్టారని.. పొరపాటును గ్రహించి ఆమె వెంటనే ఆ పోస్టును డిలీట్ చేసేశారని సోషల్ మీడియాలో ప్రచారం జరిగింది. అయితే, ఈ తేదీ కూడా కరెక్ట్ కాదు. అక్టోబర్ నెల కరెక్టే కానీ తేదీ మాత్రం మారింది. అక్టోబర్ 13న RRR ప్రేక్షకుల ముందుకు వస్తుందని దర్శక నిర్మాతలు అధికారికంగా ప్రకటించారు. ఈ మేరకు సోమవారం మధ్యాహ్నం 2 గంటలకు రాజమౌళి ట్వీట్ చేశారు.
నిప్పు, నీరు అసాధారణ వేగాన్ని అక్టోబర్ 13న చూడండి అని రాజమౌళి పేర్కొన్నారు. అంతేకాదు, ఆసక్తికర పోస్టర్ కూడా వదిలారు. ఈ పోస్టర్లో రామ్ చరణ్ గుర్రంపై, ఎన్టీఆర్ బుల్లెట్ తరహా బైక్‌పై దూసుకెళ్తున్నారు. ఈ పోస్టర్ చూస్తుంటేనే సినిమా ఎప్పుడు చూసేయాలా అనే ఆసక్తి కలుగుతోంది. కానీ, అక్టోబర్ 13 వరకు ఆగాల్సిందే.
కాగా, ఈ చిత్రంలో బాలీవుడ్ స్టార్స్ ఆలియా భట్, అజయ్ దేవగణ్‌తో పాటు ఇంటర్నేషనల్ స్టార్స్ రే స్టీవెన్సన్, అలిసన్ డూడీ, ఒలీవియా మోరిస్ ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. అలాగే సౌత్ స్టార్ సముద్రఖని, శ్రియా శరణ్ కూడా కీలక పాత్రలు పోషిస్తున్నారు. యం.యం.కీరవాణి సంగీతం సమకూరుస్తోన్న ఈ చిత్రానికి కె.కె.సెంథిల్ కుమార్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. డీవీవీ ఎంటర్టైన్మెంట్ బ్యానర్‌పై డీవీవీ దానయ్య నిర్మిస్తున్నారు. తెలుగు, హిందీ భాషల్లో రూపొందుతోన్న ఈ చిత్రం తమిళం, కన్నడ, మలయాళం భాషల్లోకి అనువాదం కానుంది.