RRR: స్పెషల్ సర్‌ప్రైజ్ రెడీ! ఎన్టీఆర్, రామ్ చరణ్‌లతో పాటు చిరంజీవి టచ్ ఇవ్వబోతున్న రాజమౌళి

0
28



భారీ అంచనాల నడుమ ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందుతోంది రాజమౌళి తెరకెక్కిస్తున్న మూవీ. డీవీవీ దానయ్య సమర్పణలో రాబోతున్న ఈ పాన్ ఇండియా మూవీలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, యంగ్ టైగర్ హీరోలుగా నటిస్తున్నారు. ఎప్పుడైతే ఈ మూవీ అనౌన్స్ చేశారో అప్పటినుంచి ఈ సినిమాపై బోలెడన్ని ఆశలు పెట్టుకున్నారు మెగా, నందమూరి ఫ్యాన్స్. ఇప్పటిదాకా రాజమౌళి రిలీజ్ చేసిన RRR అప్‌డేట్స్ సినిమాపై మరింత హైప్ తీసుకొచ్చాయి. ఈ క్రమంలో ఈ నెలలోనే మరో బిగ్ సర్‌ప్రైజ్ ఇవ్వడానికి రెడీ అయ్యారట జక్కన్న.

ఇప్పటికే RRR నుంచి రెండు వీడియోలను విడుదల చేశారు రాజమౌళి. `భీమ్ ఫర్ రామరాజు`, `రామరాజు ఫర్ భీమ్` పేరుతో బయటకొచ్చిన ప్రత్యేక వీడియోలు సోషల్ మీడియాను షేక్ చేస్తూ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఈ చిత్రంలో స్వాతంత్ర్య సమరయోధులు అల్లూరి సీతారామరాజుగా రామ్ చరణ్ నటిస్తుండగా.. కొమురం భీం రోల్ ఎన్టీఆర్ పోషిస్తున్నారు. కాబట్టి రిపబ్లిక్ డే కానుకగా ఎన్టీఆర్, రామ్ చరణ్ ఇద్దరిపై కట్ చేసిన మరో వీడియో వదలాలని రాజమౌళి సన్నాహాలు చేస్తున్నారట.

ఈ వీడియో RRRకి సంబంధించి స్పెషల్ ప్రోమో అని తెలుస్తుండటం ఆసక్తి రేకెత్తిస్తోంది. ఎన్టీఆర్, రామ్ చరణ్ ఇద్దరినీ కలిపి చూపించబోయే ఈ వీడియోకు వాయిస్ ఓవర్ అందిస్తారని, ఇది జక్కన్న ఇవ్వబోయే రిపబ్లిక్ డే స్పెషల్ సర్‌ప్రైజ్ అని అంటున్నారు. ఈ టాక్ బయటకు రావడంతో మెగా, నందమూరి అభిమానుల చూపు రిపబ్లిక్ డేపై పడింది. ఆ క్షణం ఎప్పుడెప్పుడు వస్తుందా అని అందరిలో ఆతృత మొదలైంది. సో.. చూడాలి మరి దీనిపై రాజమౌళి నుంచి అఫీషియల్ ప్రకటన ఎప్పుడొస్తుందనేది!.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here