ప్రధానాంశాలు:
- ధైర్యం చేసిన ఇమాన్యూయేల్
- రోజా పర్మిషన్ తీసుకొని వర్షకు లవ్ ప్రపోజ్
- వర్ష రియాక్షన్ చూస్తే..
హైపర్ ఆది టీమ్ మెంబర్‌గా జబర్దస్త్ షోలోకి ఎంట్రీ ఇచ్చిన ఈ వర్ష.. ఆ తర్వాత కెవ్వు కార్తీక్ సహా ఎంతో మంది లీడర్లతో పనిచేసింది. ఈ క్రమంలో ఇమాన్యూయేల్‌తో ఆమెకు జోడీ కుదిరింది. అతనితో లవ్ ట్రాక్ నడుపుతున్నట్లు కలరింగ్ ఇస్తుడటంతో మంచి క్రేజ్ దక్కింది. దీంతో ప్రతి ఎపిసోడ్లో రొమాంటిక్ యాంగిల్ హైలైట్ చేస్తూ తమ ప్రేమ వ్యవహారంపై జనాల్లో కుతూహలం పెంచేస్తున్నారు. పైగా వీళ్ళిద్దరిదీ బ్లాక్ అండ్ వైట్ కాంబినేషన్ కావడంతో ఈ లవ్ ట్రాక్‌పై జనాల్లో ఇంట్రెస్ట్ నెలకొంది.
స్కిట్లో భాగంగా చేస్తున్నారా? లేక నిజంగానే లవ్ ట్రాక్ నడిపిస్తున్నారా అనే అనుమానాలు పెంచేస్తోంది ఇమాన్యూయేల్- వర్ష జోడీ. పబ్లిక్ గానే ముద్దులు, హగ్గులతో గత కొన్ని రోజులుగా రచ్చ చేస్తున్న ఈ ఇద్దరూ తాజాగా విడుదల చేసిన ప్రోమోలో మరోసారి స్పెషల్ అట్రాక్షన్ అయ్యారు. మరో వారం రోజుల్లో లవర్స్ డే (ప్రేమికుల రోజు) వస్తోంది కదా. అందుకే జబర్ధస్త్ వేదికపై రొమాంటిక్ స్కిట్ చేసి యూత్‌ని తెగ అట్రాక్ట్ చేసేశారు.
‘మేడం.. వాలంటైన్స్ డే వస్తుంది కదా. మీరు పర్మీషన్ ఇస్తే వర్షకు ఓ సర్ప్రైజ్ ఇస్తా’ అంటూ జబర్దస్త్ జడ్జ్ రోజా పర్మిషన్ తీసుకున్న ఇమాన్యూయేల్.. వర్షను నేరుగా వేదికపైకి తీసుకొచ్చి అందరి ముందే వాలెంటైన్స్ డే విషెస్ చెప్పేశాడు. లవర్స్ ఫేవరేట్ అయిన యాంగిల్ మోకాళ్లపై కూర్చొని హార్ట్ షేప్‌లో ఉన్న బెలూన్‌తో పాటు గులాబీ పువ్వు ఇచ్చి ప్రపోజ్ చేశాడు. ఆ గులాబీ తీసుకున్న వర్ష సిగ్గుమొగ్గలేస్తూ నవ్వేసింది. దీంతో ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.