richa chadda: ఇన్ని జరిగినా తప్పుగా మాట్లాడకపోవడం షకీలా గొప్పతనం.. శృంగార తార క్యారెక్టర్‌పై రిచా చద్దా కామెంట్స్ – bollywood actress richa chadda says about shakeela role

0
29


ఒకానొక సమయంలో శృంగార తారగా వెండితెరపై ఓ వెలుగు వెలిగింది షకీలా. చిన్న సినిమాలతో భారీ విజయాలందుకొని నిర్మాతలకు లాభాల పంట పండించిన ఘనత ఆమె సొంతం. అయితే షకీలా వ్యక్తిగత జీవితం మాత్రం అందుకు పూర్తిగా భిన్నం. నిజ జీవితంలో ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొంటూ నిలదొక్కుకుంది షకీలా. సొంత కుటుంబమే మోసం చేసినా ఆ బాధను దిగమింగుకుంటూ వెండితెరపై రసికప్రియులను మత్తెక్కించింది. ఈ క్రమంలో ఆమె జీవితం, పడిన కష్టాల ఆధారంగా ‘షకీలా’ బయోపిక్ రూపొందిస్తున్నారు. ఇందులో బాలీవుడ్ నటి రిచా చద్దా లీడ్ రోల్ పోషిస్తోంది.

షకీలా జీవితంలోని పలు కోణాలను ఆవిష్కరిస్తూ రూపొందిన ఈ మూవీ తెలుగు, తమిళ, హిందీ భాషల్లో ప్రేక్షకుల ముందుకు తెస్తున్నారు డైరెక్టర్ ఇంద్రజీత్‌ లంఖేష్. ఈ నెల 25న హిందీలో షకీలా బయోపిక్ రిలీజ్ చేసిన ఆయన 2021 జనవరి 1వ తేదీన ఆ సినిమాను తెలుగులో రిలీజ్ చేస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ‘షకీలా’ తెలుగు ట్రైలర్ సినిమాపై హైప్ క్రియేట్ చేసింది. ఈ నేపథ్యంలో తాజాగా ఈ మూవీలో ప్రధాన పాత్ర పోషించిన రిచా చద్దా.. షకీలా క్యారెక్టర్‌పై కీలక వ్యాఖ్యలు చేసింది.
చిన్నప్పుడు అల్లు అర్జున్..! సమంత ప్రశ్నలకు దండం పెట్టేసిన అల్లు అరవింద్.. టాప్ ట్రెండింగ్ వీడియో
కెమెరా ముందు షకీలా రోల్ పోషించడం ఛాలెంజింగ్‌గా అనిపించిందని పేర్కొన్న రిచా.. ఈ సినిమా గురించి పలు విషయాలు వెల్లడించింది. షకీలా పాత్రలో లీనం కావడం కోసం చాలా కష్టపడ్డానని, మళయాలంలో ఆమెకు స్టార్‌డమ్ తెచ్చిన సినిమాల లిస్ట్ తెప్పించుకొని అన్ని సినిమాలను చూసి అనుకరించానని చెప్పుకొచ్చింది. అలాగే ఆమె వ్యక్తిగత జీవితం, వ్యక్తిత్వం గురించి తెలుసుకున్నానని పేర్కొంది. కెరీర్ పరంగా, కుటుంబం పరంగా నిజ జీవితంలో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నప్పటికీ ఎవరి గురించి తప్పుగా మాట్లాడకపోవడం షకీలా మంచి గుణానికి నిదర్శనమంటూ కొనియాడింది రిచా చద్దా.

పాన్ ఇండియా సినిమాగా రూపొందిన ఈ ‘షకీలా’ బయోపిక్‌లో రిచా చద్దాతో పాటు పంకజ్‌ త్రిపాఠి, మలయాళ నటుడు రాజీవ్‌ పిళ్లై ముఖ్య పాత్రలు పోషించారు. షకీలా వ్యక్తిగత జీవితంలోని లోటుపాట్లు, ఆమె సక్సెస్ అన్నీ ఈ సినిమాలో చూపించనున్నారు. ‌

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here