ప్రధానాంశాలు:
- అనుభవం నేర్పిన పాఠం అంటూ రేణు పోస్ట్
- ఫ్యామిలీ, ఫ్రెండ్స్ అంటూ సందేశం
- అప్పుడే జీవితం ప్రశాంతగా ఉంటుందట
జీవితం చాలా గొప్పదని, ఏ కష్టం వచ్చినా పోరాటం చేసి గెలవాలని చెప్పే రేణు దేశాయ్.. తాజా పోస్టులో వయసు, అనుభవంతో జీవితంలో కొన్ని పాఠాలు నేర్చుకున్నానంటూ రాసుకొచ్చింది. ఫ్యామిలీ అయినా, ఫ్రెండ్స్ అయినా, వర్క్ చేసే చోట అయినా గౌరవం, ప్రేమ ఇచ్చిపుచ్చుకోవాలని ఆమె తెలిపింది. సరైన రిలేషన్షిప్ కొనసాగించాలని ఇరువురిలో ఉండాలని, అలాగే ఒకరి బాధ, సంతోషం మరొకరు పంచుకోవాలని పేర్కొంది. మన వల్ల అవతలి వారు ఇబ్బంది పడకూడదని తెలిపిన రేణు.. ఎప్పుడైనా సరే తనను బాధపెట్టే వారి నుంచి నేను ప్రశాంతంగా దూరంగా వచ్చేస్తానని, అప్పుడే జీవితంలో ప్రశాంతత లభిస్తుందంటూ తన పోస్ట్‌లో పేర్కొంది.
ఇకపోతే మొన్నా మధ్యే ”డబ్బులు, కెరీర్, బాధగా ఉండే వ్యక్తిగత జీవితాలపై దృష్టి సారించే మనం.. జీవితంలోని చిన్న చిన్న సంతోషాలను పట్టించుకోము. మీ దృష్టిని చిన్నచిన్న ఆనందాలవైపు మళ్లించండి” అంటూ సందేశమిచ్చింది రేణు. దీంతో ఉన్నట్టుండి రేణు దేశాయ్ ఇలా జీవిత పాఠాలు చెప్పడం వెనుక అసలు కథేంటి? అనే అనుమానాలు జనాల్లో మొదలయ్యాయి.
పవన్ కళ్యాణ్‌తో డివోర్స్ తీసుకున్నాక తన పిల్లలిద్దరూ అకీరా, ఆద్యలతో కలిసి పూణేలో ఉంటున్న రేణు, రీసెంట్గా తిరిగి సినిమాల వైపు చూస్తోంది. ఇటీవలే ఓ వెబ్ సిరీస్ కంప్లీట్ చేసిన ఆమె.. రైతుల నేపథ్యంలో ఓ సినిమా రూపొందించబోతోంది. వచ్చే నెల ఈ మూవీ షూటింగ్ ప్రారంభం కానుందని సమాచారం. ఇదిలాఉంటే రేణు రెండో పెళ్లి గురించిన సస్పెన్స్ మాత్రం ఇంకా వీడకపోవడం విశేషం.