Raveena Tandon: యశ్ ఎంత ప్రతిభావంతుడో అంతే మంచివాడు: రవీనా టాండన్ ప్రశంసల వర్షం – yash gema of a person, kgf actress raveena tandon

0
31


కన్నడ రాక్ స్టార్ యశ్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో రూపొందిన భారీ చిత్రం ‘కె.జి.యఫ్: చాప్టర్ 2’. వీరిద్దరి కాంబినేషన్‌లో రెండేళ్ల క్రితం వచ్చిన బ్లాక్ బస్టర్ మూవీ ‘కె.జి.యఫ్: చాప్టర్ 1’కు ఇది సీక్వెల్. ఈ సినిమా కోసం దేశ వ్యాప్తంగా ఎంతో మంది ‘కె.జి.యఫ్’ ఫ్యాన్స్ ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. పాన్ ఇండియా స్థాయిలో రూపొందుతోన్న ఈ చిత్రంలో బాలీవుడ్ స్టార్ సంజయ్ దత్ విలన్‌గా నటించారు. బాలీవుడ్ నటి రవీనా టాండన్ ఒక కీలక పాత్ర పోషించారు. ఈ సినిమాలో నటించడం పట్ల ఆమె ఆనందం వ్యక్తం చేశారు. ఈ మేరకు మీడియాతో ముచ్చటించారు. ఆ విశేషాలు..

యశ్‌తో తొలిసారి పనిచేయడం ఎలాంటి అనుభూతినిచ్చింది?
అద్భుతమైన అనుభవం. యశ్ జెమ్‌ లాంటి వ్యక్తి. ఎంత ప్రతిభావంతుడో, అంతే మంచివాడు. అద్భుతమైన నటుడు. తనతో పనిచేసిన ప్రతి క్షణాన్ని ఆస్వాదించాను.

‘కె.జి.యఫ్: చాప్టర్ 2’లో మీ పాత్ర ఎలా ఉండబోతోంది?
చాలా వైవిధ్యమైన, ఆసక్తికరమైన పాత్రలో కనిపిస్తాను. అందుకే పాత్ర గురించి ఇప్పుడు ఎక్కువగా చెప్పలేను. నా పాత్ర పేరు రమికా సేన్‌. కాస్త కాంప్లెక్స్‌గా అనిపిస్తుంది. కానీ అంతే పవర్‌ఫుల్‌ క్యారెక్టర్‌. గ్రే షేడ్స్ కూడా కాస్త ఉంటాయి. నా పాత్ర నెక్స్ట్ సీన్‌లో ఎలా బిహేవ్‌ చేస్తుందో ఎవరూ ఊహించలేరు. అంత గ్రిప్పింగ్‌ స్క్రీన్‌ప్లే ఉంటుంది.

శ‌ర్వానంద్ ‘శ్రీ‌కారం’ నుంచి ‘సంక్రాంతి సందళ్లే’ పాట: ఆహ్లాదకరమైన బాణీ.. అందమైన సాహిత్యం
యశ్‌తో మీరు షేర్‌ చేసుకోబోయే స్క్రీన్‌ స్పేస్‌ని సిల్వర్‌ స్క్రీన్‌ మీద చూడటానికి మీ ఫ్యాన్స్ వెయిట్‌ చేస్తున్నారు. వాళ్ల నుంచి మీకు డైరక్ట్ మెసేజ్‌లు ఏమైనా అందాయా?
వాళ్లు అలా ఎదురుచూస్తున్నారన్న ఆలోచనే నాకు ఆనందాన్ని కలిగిస్తోంది. ఈ సినిమాలో నేను నటిస్తున్నానని చెప్పిన క్షణం నుంచి వాళ్ల ఎదురుచూపులు మొదలయ్యాయి. ‘కె.జి.యఫ్: చాప్టర్ 1’కి చాలా పెద్ద ఫ్యాన్‌ ఫాలోయింగ్‌ ఉంది. అందుకే సీక్వెల్‌ కోసం చాలా మంది చాలా ఆత్రుతతో ఎదురుచూస్తున్నారు. ఈ సినిమాలో నా ఫస్ట్ లుక్‌ చూస్తే అభిమానులకు పండగే. ఆన్‌స్క్రీన్‌లో రమికను చూడటానికి కచ్చితంగా అభిమానులు ఇష్టపడతారు. నా అభిమానుల మనస్సుల్లో నిలిచిపోయే పాత్ర అవుతుంది.

ఈ చిత్రంలో మీరు ఒళ్లు గగుర్పొడిచే యాక్షన్‌ సన్నివేశాలు చేసినట్టున్నారు?
కాస్త ఆగండి… (నవ్వుతూ)! ఇంకొన్నాళ్లు ఓపిక పడితే, స్క్రీన్‌ మీద చూద్దురుగానీ.

‘వకీల్ సాబ్’ టీజర్ డేట్ ఫిక్స్.. పండుగ తీసుకొస్తోన్న పవర్ స్టార్
ఈ సినిమాను మీరు ఒప్పుకున్న క్షణాలు గుర్తున్నాయా?
ప్రశాంత్‌ నీల్‌ వచ్చి స్టోరీ చెప్పగానే నాకు చాలా ఇంట్రస్టింగ్‌గా అనిపించింది. ప్రశాంత్‌ నీల్‌ నాకు ఈ కథ చెప్పేటప్పటికి నేను ఫస్ట్ పార్ట్ కూడా చూడలేదు. ఆ తర్వాతే నేను ఫస్ట్ పార్ట్ చూశాను. అసలు ఇంత అద్భుతంగా ఎలా తీశాడా? అని నేను విస్తుపోయాను. మైండ్‌ బ్లోయింగ్‌ సినిమా అనిపించింది. న్యూ ఏజ్‌ సినిమా అప్రోచ్‌ కనిపించింది ‘కె.జి.యఫ్: చాప్టర్ 1’లో. అలాగే అతను కథ చెప్పిన తీరు, కథ, పార్ట్ 2లో నా పాత్ర అన్నీ వరుసగా కళ్ల ముందు కదిలాయి. ఈ సినిమా వద్దు అనో, నేను చేయననో చెప్పడానికి నాకు ఒక్క కారణం కూడా కనిపించలేదు. పైగా ఎగ్జయిటింగ్‌గా అనిపించింది. అందుకే వెంటనే ఓకే చెప్పేశాను.

ప్రశాంత్‌ నీల్‌తోనూ, హోంబలే ఫిలింస్ సంస్థతోనూ మీ అసోసియేషన్‌ గురించి ఒక్క మాటలో చెబుతారా?
ప్రశాంత్‌ పనిచేసే తీరు చాలా పవర్‌ఫుల్‌గా ఉంటుంది. అసలు అలాంటి పనితనమే ఆయన్ని స్పెషల్‌గా ఉంచింది. చూడ్డానికి చాలా ప్రశాంతంగా ఉండే అతనిలో అలాంటి ఆలోచనల ప్రవాహం సాగుతూ ఉంటుందని ఎవరూ అనుకోరు. కానీ అతని కలలు, అతని ఆలోచనలు సామాన్యులకు ఊహాతీతంగా ఉంటాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here