Rashmika Mandanna: రష్మిక మందన టాప్ టక్కర్ సాంగ్.. కొత్త అవతారం, క్రేజీ స్టెప్పులతో ఫిదా చేసిన కన్నడ భామ – rashmika mandanna’s top tucker video song released

0
20


ప్రధానాంశాలు:

  • వరుస సినిమాలతో రష్మిక మందన హవా
  • టాప్ టక్కర్ వీడియో ఆల్బమ్‌తో ప్రేక్షకుల ముందుకు
  • క్రేజీ స్టెప్పులతో ఫిదా చేసిన బ్యూటీ

కన్నడ భామ రష్మిక మందన యమ జోష్‌లో ఉంది. టాలీవుడ్‌లో సత్తా చాటుతూ బాలీవుడ్ అవకాశాలు కూడా చేజిక్కించుకుంటూ మంచి ఫామ్‌లో ఉన్న ఈ ముద్దుగుమ్మ.. ఓ ఓ వీడియో ఆల్బమ్‌ చేసింది. ‘టాప్ టక్కర్’ పేరుతో ఈ వీడియో ఆల్బమ్ రూపొందించి రిలీజ్ చేశారు. ఈ పాటలో సరికొత్త అవతారంలో కనిపించడమే గాక క్రేజీ స్టెప్పులతో తన అభిమానులను ఫిదా చేస్తోంది రష్మిక.

రీసెంట్‌గా ఈ ఆల్బమ్‌కు సంబంధించిన టీజర్‌ రిలీజ్ చేయగా సూపర్ రెస్పాన్స్ వచ్చింది. ఇక తాజాగా విడుదలైన ఈ వీడియోలో ఓ వైపు గ్లామర్ ఒలకబోస్తూనే మరోవైపు తనదైన హావభావాలతో ఆకట్టుకుంది రష్మిక మందన. బీ టౌన్ ఆడియన్స్ అట్రాక్ట్ అయ్యేలా అత్యంత కలర్‌ఫుల్‌గా రూపొందించిన ఈ పాటను ఉచానా అమిత్ బాద్‌షా, యువన్ శంకర్ రాజా, జోనితా గాంధీ ఆలపించారు. ఉచానా అమిత్ బాద్‌షానే పాట కూడా రాయడం విశేషం.
RRR ఫినిష్ కాగానే రామ్ చరణ్ ప్రాజెక్ట్ ఇదే! ఎగిరి గంతేస్తున్న మెగా ఫ్యాన్స్.. నేషనల్ వైడ్ ట్రెండ్
సిద్ధార్థ్ మల్హోత్ర హీరోగా రూపొందుతున్న `మిషన్ మజ్ను` సినిమాతో బాలీవుడ్ ఎంట్రీ ఇవ్వబోతున్న రష్మికకు ఈ సాంగ్ బాగా ప్లస్ అయిందనే చెప్పుకోవచ్చు. ఆ మూవీ విడుదలకు ముందే ఇలా బీ టౌన్ ప్రేక్షకులను సైతం బుట్టలో వేసుకుంది ఈ కన్నడ బ్యూటీ. ఇకపోతే టాలీవుడ్‌లో వరుస విజయాలందుకుంటున్న ఈ భామ.. ప్రస్తుతం అల్లు అర్జున్ సరసన ‘పుష్ప’ సినిమాలో నటిస్తోంది. సుకుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాలో పల్లెటూరు పిల్లగా అలరించనుందట రష్మిక.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here