ప్రధానాంశాలు:
- నితిన్, కీర్తి సురేష్ జంటగా ‘రంగ్ దే’
- మార్చి 26న విడుదలవుతోన్న చిత్రం
- ‘రంగ్ దే’ ప్రచార సంబరాలు షురూ..!
షూటింగ్ పూర్తిచేసుకున్న విషయాన్ని చిత్ర నిర్మాణ సంస్థ సోషల్ మీడియా ద్వారా వెల్లడించింది. చిత్ర నిర్మాత సూర్యదేవర నాగవంశీ మాట్లాడుతూ ఈ ఏడాది మార్చి 26 నుంచి థియేటర్లలో ‘రంగ్ దే’ సంబరాలు షురూ అవుతాయని తెలిపారు. సకుటుంబ సమేతంగా చూడతగ్గ చిత్రంగా దర్శకుడు వెంకీ అట్లూరి ‘రంగ్ దే’ను తీర్చిదిద్దారని తెలిపారు. నితిన్, కీర్తి సురేష్ జంట వెండితెరపై కనువిందు చేయనుందన్నారు. ఇటీవల ‘రంగ్ దే’ సినిమా నుంచి విడుదలైన వీడియో, అలాగే ఒక పాటకు విశేష స్పందన వచ్చిన విషయం తెలిసిందే.
‘రంగ్ దే’కు ప్రముఖ సినిమాటోగ్రాఫర్ పి.సి.శ్రీరామ్ కెమెరా స్కిల్స్ మరో ప్రత్యేక ఆకర్షణ కానున్నాయి. అలాగే దేవిశ్రీ ప్రసాద్ సంగీతం మరో ఆకర్షణ. ఈ చిత్రంలో తారాగణం కూడా భారీగానే ఉంది. సీనియర్ నటుడు నరేష్, వినీత్, రోహిణి, కౌసల్య, బ్రహ్మాజీ, వెన్నెల కిషోర్, సత్యం రాజేష్, అభినవ్ గోమటం, సుహాస్, గాయత్రి రఘురామ్ తదితరులు నటించారు. కాగా, షూటింగ్ పూర్తిచేసుకున్న సందర్భంగా కీర్తి సురేష్ ట్వీట్ చేశారు. ‘రంగ్ దే’ టీమ్‌ను తాను చాలా మిస్ అవుతున్నానని పేర్కొన్నారు. ఒక జిఫ్ ఇమేజ్ను కూడా షేర్ చేశారు.