ప్రధానాంశాలు:
- రామ్ పోతినేని తదుపరి సినిమా ఫిక్స్
- లింగుస్వామి దర్శకత్వంలో మూవీ
- రామ్ కెరీర్లో 19వ సినిమా
రామ్ తదుపరి సినిమాను లింగుస్వామి డైరెక్ట్ చేయబోతున్నట్లుగా గత కొన్ని రోజులుగా వార్తలు వస్తున్న నేపథ్యంలో దాన్నే నిజం చేస్తూ అధికారిక ప్రకటన వచ్చేసింది. డైరెక్టర్ లింగుస్వామి స్వయంగా సోషల్ మీడియా ద్వారా ఈ విషయాన్ని తెలిపారు. శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ బ్యానర్‌పై శ్రీనివాస చిత్తూరి ఈ సినిమాను నిర్మించబోతున్నారని.. తెలుగు, తమిళ భాషల్లో ప్యారలల్‌గా ఈ సినిమాను రూపొందించనున్నామని ఆయన పేర్కొన్నారు.
హీరో రామ్ కెరీర్లో 19వ సినిమాగా ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రానుంది. రామ్ ఎనర్జీని మరో స్థాయిలో ప్రెజెంట్ చేయాలని ఓ మాస్ కథను సిద్ధం చేశారట లింగుస్వామి. అంతేకాదు రామ్‌ని డిఫరెంట్ షేడ్‌లో చూపించాలని ఆయన ప్లాన్ చేస్తున్నారట. ఆయన వినిపించిన కథను రామ్ వెంటనే ఓకే చేశారని తెలిసింది. ఈ సినిమాకు సంబంధించిన ఇతర వివరాలు అతి త్వరలో ప్రకటించనున్నారు.