Ram charan: Acharya: చేతిలో చాయ్ గ్లాస్.. ఆచార్య సెట్స్‌పై హుషారుగా రామ్ చరణ్! ఫొటో వైరల్ – ram charan entered into chiranjeevi acharya sets

0
30


‘సైరా నరసింహా రెడ్డి’ తర్వాత మెగాస్టార్‌ చిరంజీవి చేస్తున్న తాజా సినిమా ‘ఆచార్య’. కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న పవర్‌ఫుల్‌ యాక్షన్‌ డ్రామాకు రామ్ చరణ్ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. చిత్రంలో హీరోయిన్‌గా కాజల్‌ అగర్వాల్‌ నటిస్తుండగా.. మణిశర్మ బాణీలు కడుతున్నారు. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ తెలుగు రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల్లో శరవేగంగా జరుగుతోంది. తాజాగా ఆచార్య సెట్స్‌పై రామ్ చరణ్, కొరటాల శివ దిగిన కొన్ని ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

ఈ ఫొటోల్లో డైరెక్టర్ కొరటాల శివ, నిర్మాత రామ్ చరణ్ టీ తాగుతూ హుషారుగా కనిపిస్తున్నారు. ఆర్ట్‌ డైరెక్టర్‌ సురేశ్‌ సెల్వరాజన్‌ వేసిన సెట్‌లో ప్రస్తుతం ఈ సినిమాకి సంబంధించిన కొన్ని కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. సురేశ్‌ క్రియేట్‌ చేసిన సెట్‌ ఎంతో బాగుందని రామ్ చరణ్ మెచ్చుకున్నారు. ఈ విషయాన్ని తెలుపుతూ ఆనందంతో రామ్ చరణ్‌తో దిగిన పిక్స్ తన ట్విట్టర్ ద్వారా పంచుకున్నారు ఆర్ట్‌ డైరెక్టర్‌ సురేశ్‌ సెల్వరాజన్.

Also Read: పెళ్లి కూతురైన ‘వదినమ్మ’ ఫేమ్ ప్రియాంక నాయుడు.. హల్దీ ఫంక్షన్‌లో నటి ఎమోషనల్!

మ్యాట్నీ ఎంటర్‌టైన్‌మెంట్స్‌, కొణిదెల ప్రొడెక్షన్‌ కంపెనీ సంయుక్తంగా తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో రామ్ చరణ్ కీలక పాత్ర పోషిస్తున్నారు. ఈ మూవీలో రామ్ చరణ్ రోల్ దాదాపు ముప్పై నిమిషాల పాటు ఉంటుందని, నక్సలైట్‌గా ఆయన ఓ విలక్షణమైన పాత్ర పోషించనున్నారని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో తాజా ఫొటోలు చూసి ఆ పాత్రలో నటించేందుకు చెర్రీ సెట్స్ పైకి చేరుకున్నారా? లేక ఆచార్య షూటింగ్ పర్యవేక్షణ కోసం అక్కడికి వచ్చారా? అని చర్చించుకుంటున్నారు జనం. ఇక ఇటీవలే పెళ్లి చేసుకున్న కాజల్ కూడా ఇప్పటికే షూటింగ్‌లో జాయిన్ అయిన సంగతి తెలిసిందే.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here