ప్రధానాంశాలు:
- నేడు చిరంజీవి- సురేఖ దంపతుల పెళ్లి రోజు
- సోషల్ మీడియాలో వెల్లువెత్తుతున్న శుభాకాంక్షలు
- రామ్ చరణ్ స్పెషల్ పోస్ట్
నేడు (ఫిబ్రవరి 20) మెగాస్టార్ చిరంజీవి- సురేఖ దంపతుల పెళ్లి రోజు. 1980 సంవత్సరం సరిగ్గా ఇదే రోజున వివాహ బంధంతో ఒక్కటయ్యారు చిరంజీవి- సురేఖ. వారి వివాహం జరిగి నేటితో 42 ఏళ్ళు పూర్తయింది. ఈ సందర్బంగా మెగా దంపతులకు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. పలువురు సినీ ప్రముఖులు , సన్నిహితులు, శ్రేయోభిలాషులు పెద్దఎత్తున శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఈ క్రమంలో చిరు దంపతుల పిక్ షేర్ చేసిన రామ్ చరణ్.. ‘నా పూర్తి బలం మీరే’ అంటూ వారిపై ఉన్న ప్రేమను వ్యక్తపరిచారు. చెర్రీ చేసిన ఈ ట్వీట్ చూసి చిరంజీవి దంపతులకు మ్యారేజ్ డే విషెస్ పెడుతూ కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్లు.
కెరీర్ పరంగా చూస్తే చిరంజీవి, రామ్ చరణ్ ఇద్దరూ ఫుల్ బిజీగా ఉన్నారు. ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘ఆచార్య’ సినిమా షూటింగ్లో పాల్గొంటున్నారు చిరంజీవి. కాజల్ అగర్వాల్ హీరోయిన్. ఈ చిత్రంలో రామ్ చరణ్ కూడా కీలకపాత్రలో కనిపించనుండటం విశేషం. ఈ షూటింగ్ పూర్తికాగానే `లూసిఫర్` రీమేక్ సెట్స్ మీదకు రానున్నారు చిరు. మరోవైపు RRR షూటింగ్ కంప్లీట్ చేసే పనిలో ఉన్నారు రామ్ చరణ్.