Ram charan: నాకు ఏడెనిమిది ఏళ్లు పట్టింది.. వైష్ణవ్ తొలి సినిమాతోనే అదరగొట్టాడు: రామ్ చరణ్ – ram charan praises vaisshnav tej performance in uppena movie

0
18


‘‘పంజా వైష్ణవ్.. చాలా అమాయకంగా కనిపిస్తాడు. కానీ.. కొన్ని మాటలు ఇక్కడ నేను చెప్పలేను. అయ్యప్ప మాలలో ఉన్నాను. ఈ అబ్బాయితో కాస్త జాగ్రత్తగా ఉండండి. సిగ్గుపడుతూ నవ్వుతున్నాడు కానీ.. లోపల ఒక అగ్నిపర్వతంలా ఉంటాడు. తేజూకి, నాకే లెక్చర్లు పీకే క్యాండిడేట్. కొంచెం ఒక కన్నేసి ఉంచండి మా వాడి మీద’’ అని అన్నారు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్. తామందరిలో అత్యంత సమతుల్యత గల ఆలోచనలు, మైండ్ సెట్ కలిగిన వ్యక్తి వైష్ణవ్ అని అన్నారు చరణ్. వైష్ణవ్ ఇంత సక్సెస్ అయ్యాడంటే తమకు ఆశ్చర్యంగా లేదన్నారు.

‘‘ఇలాంటి కుర్రాడు కచ్చితంగా సక్సెస్ అవుతాడనే నా గట్టి నమ్మకం. ఇలాంటి పర్ఫార్మెన్స్ ఇవ్వడానికి నాకు ఏడెనిమిది ఏళ్లు పట్టింది. అలాంటిది మొదటి సినిమాలో వీడు ఇచ్చాడంటే.. నిజంగా వాడిలో అగ్నిపర్వతం లాంటి ఆలోచన ఉంటే తప్ప ఇలాంటి పర్ఫార్మెన్స్ రాదు. వైష్ణవ్ యాక్టర్ అవ్వాలని అనుకున్నప్పుడు అతన్ని ప్రోత్సహించింది మా నాన్నగారు, కళ్యాణ్ బాబాయ్. చిరంజీవి గారికి చెప్పినప్పుడు ఆయన ప్రోత్సహించారు. కానీ, దాన్ని ముందుకు తీసుకెళ్లి ఈ అబ్బాయికి మొత్తం ట్రైనింగ్ ఇచ్చి, వేరే దేశాలకు పంపించి గురువులా నడిపించింది పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు. బహుశా వైష్ణవ్‌లో ఉన్న డెడికేషన్ చూసి ఆయన ప్రోత్సహించుంటారు. అలాంటి ఇద్దరు వ్యక్తులు నీ లైఫ్‌లో, మా లైఫ్‌లో ఉండటం చాలా అదృష్టం’’ అని రామ్ చరణ్ అన్నారు.

రామ్ చరణ్ తప్ప నాకు ఎవ్వరూ కనిపించట్లేదు.. మనసులో మాట బయటపెట్టిన బేబమ్మ
‘ఉప్పెన’ కథను చిరంజీవి నాలుగు సార్లు విన్నారని రామ్ చరణ్ గుర్తు చేశారు. బహుశా తన సినిమా కథను కూడా అన్ని సార్లు విన్నారో లేదో తనకు గుర్తులేదని చెప్పారు. ఈ సినిమాను అందరి కన్నా రెండు రోజుల ముందు చూసిన చిరంజీవి.. నిర్మాతలకు ఎంతో భరోసా ఇచ్చారని తెలిపారు. ఈ సినిమా ఇంత పెద్ద విజయం సాధించడానికి కారణం మెగా అభిమానులు, తెలుగు ప్రేక్షకులేనని అన్నారు. కరోనా పరిస్థితుల తర్వాత సినీ పరిశ్రమ మళ్లీ తేరుకుందంటే దానికి కారణం తెలుగు సినిమా ప్రేక్షకులేనని.. తెలుగు సినిమాకు మళ్లీ ప్రాణం పోశారని కొనియాడారు.

ఇక హీరోయిన్ కృతిశెట్టి గురించి మాట్లాడుతూ.. ‘‘మీ బేబమ్మ అదోలా యాక్టింగ్ చేసింది. కృతి నువ్వు ప్రతి ఒక్కరి హృదయాలను గెలుచుకున్నావు. మా కుర్రోళ్లంతా ఇంత రెచ్చిపోతున్నారంటే కొంత బేబమ్మ వల్ల అని అర్థమవుతోంది. ఈ మధ్య కాలంలో ఇంత గ్రాండ్ వెల్‌కమ్ ఒక హీరోయిన్‌కి నేను చూడలేదు. ఇది ఆమెకు ప్రారంభం మాత్రమే. ఇంకా ఎన్నో మెట్లు ఎక్కుతుంది. బహుశా భవిష్యత్తులో మైత్రీ ప్రొడ్యూసర్స్‌కే చాలా కష్టమవుతుందేమో ఆమె డేట్స్ దొరకడం’’ అని వెల్లడించారు.

తెలుగు సినిమాకి మళ్లీ ప్రాణం పోశారు: రామ్ చరణ్

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here