ప్రధానాంశాలు:
- జాన్ అబ్రహం, రకుల్ ప్రీత్ సింగ్ జంటగా ‘ఎటాక్’
- ధనీపూర్‌లో యాక్షన్ సీన్స్ షూటింగ్
- సెట్‌పై స్థానికుల రాళ్లదాడి
లక్ష్యరాజ్ దర్శకత్వంలో ‘ఎటాక్’ సినిమాను రూపొందిస్తున్నారు. చిత్రంలో జాన్ అబ్రహం, రకుల్ ప్రీత్ సింగ్ జంటగా నటిస్తున్నారు. స్వాతంత్ర్య దినోత్సవ కానుకగా ఆగస్టు 13వ తేదీన రిలీజ్ చేయడానికి రెడీ అయిన యూనిట్.. శరవేగంగా షూటింగ్ జరుపుతోంది. ఇందులో భాగంగా ధనీపూర్‌లో యాక్షన్ సన్నివేశాల చిత్రీకరణ జరుపుతున్నారు. యాక్షన్ సీన్లలో భాగంగా బాంబు బ్లాస్టులు షూట్ చేస్తున్న నేపథ్యంలో కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేయడం జరిగింది. ఎవ్వరికీ దెబ్బలు, గాయాలు తగలకూడదని పలు జాగ్రత్తలు తీసుకున్నారు.
అయితే షూటింగ్ చేస్తున్నారనే విషయం తెలిసి అక్కడికి పెద్దఎత్తున స్థానికులు తరలివచ్చారు. షూటింగ్ స్పాట్ వద్ద గేటు మూసేయడంతో సెట్ గోడ ఎక్కి షూటింగు చూడటానికి జనం ఎగబడ్డారు. దీంతో సెక్యూరిటీ సిబ్బంది వారిని అడ్డుకోవడంతో వాగ్వివాదం చోటుచేసుకుంది. ఈ క్రమంలో ప్రజలు రాళ్లదాడికి పాల్పడ్డారు. వెంటనే పోలీసులు వచ్చి ఇరువర్గాలను చెదరగొట్టడంతో పరిస్థితి సద్దు మణిగింది. ఈ ఘటనలో సెక్యూరిటీ సిబ్బంది గాయపడగా.. హీరో జాన్ అబ్రహం, హీరోయిన్ రకుల్‌కు ఎలాంటి గాయాలు కాలేదు.