ఇదిలా ఉంటే, రక్షిత ఇప్పుడు నిర్మాతగా మారారు. తన తమ్ముడు రానాను హీరోగా పరిచయం చేస్తున్నారు. ‘ఏక్ లవ్ యా’ అనే సినిమా ద్వారా రానా పరిచయం అవుతున్నారు. కన్నడలో శివరాజ్‌కుమార్, పునీత్ రాజ్‌కుమార్, దర్శన్, సుదీప్ వంటి స్టార్ హీరోలతో బ్లాక్ బస్టర్ సినిమాలను రూపొందించిన ప్రముఖ దర్శకుడు, రక్షిత భర్త జోగి ప్రేమ్.. ‘ఏక్ లవ్ యా’ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. కన్నడలో రక్షిత నిర్మిస్తోన్న ఈ సినిమాను తెలుగులో అనువాదం చేసి విడుదల చేయనున్నారు.

ఏక్ లవ్ యా మూవీ పోస్టర్
కేవలం తెలుగులో మాత్రమే కాకుండా తమిళం, కన్నడ, మలయాళంలో ఒకేసారి పరిచయం అవుతున్నారు రానా. హీరోగా పరిచయం కావడానికి ముందు ప్రముఖ యాక్టింగ్ స్కూల్ లీ స్ట్రాస్‌బర్గ్ స్కూల్లో రానా శిక్షణ పొందారు. అలాగే, కొన్ని కన్నడ సినిమాల్లో అప్రెంటీస్‌గా నటించడంతో పాటు డైరెక్షన్ డిపార్ట్మెంట్లో పనిచేశారు. ఈ సినిమా కోసం రానా ప్రత్యేకంగా డాన్స్, మార్షల్ ఆర్ట్స్‌లో శిక్షణ పొందారు.
ప్రస్తుతం సౌత్ హీరోలంతా బహుభాషా చిత్రాలకే మొగ్గు చూపుతున్నారు. అందుకే, తాను ఒకేసారి నాలుగు భాషల్లో పరిచయం కావాలని రానా నిర్ణయించుకున్నారు. ఈ సినిమా ద్వారా రీష్మ నానై హీరోయిన్గా పరిచయం అవుతున్నారు. అలాగే, రచితా రామ్ మరో హీరోయిన్. అర్జున్ జన్య సంగీతం సమకూరుస్తోన్న ఈ సినిమా నుంచి తొలి పాటను వాలంటైన్స్ డే సందర్భంగా రేపు విడుదల చేస్తున్నారు.