Puri Jagannadh 2020 Review: పూరి జగన్నాథ్ రివ్యూ: అన్నీ మూసుకుని కూర్చోవడం నేర్చుకున్నాం.. 2020 బెస్ట్ ఇయర్! – director puri jagannadh review on 2020 it was a best year

0
41


2020 అనగానే చాలా మంది మదిలో మెదిలే మాటలు దరిద్రం, చండాలం. ఇంత ఘోరమైన సంవత్సరాన్ని ఎప్పుడూ చూడలేదని జనాలు తిట్టుకుంటున్నారు. దీనికి కారణం ప్రపంచాన్ని గడగడలాడించిన కరోనా వైరస్. దీని వల్ల ప్రజలు ఎన్నో ఇబ్బందులు పడ్డారు. ఆర్థికంగా చితికిపోయారు. అందుకే, ఈ ఏడాది వెళ్లిపోతుంటే సంతోషంగా వీడ్కోలు చెప్పడం లేదు. పోనీ దరిద్రపుగొట్టు సంవత్సరం.. వచ్చే ఏడాది అయినా బాగుండాలి అని ఆశ పడుతున్నారు. కానీ, 2020 చెత్త సంవత్సరం కాదని.. ఇది గొప్ప సంవత్సరమని అంటున్నారు ప్రముఖ సినీ దర్శకుడు పూరి జగన్నాథ్.

2020 గొప్పతనాన్ని వివరిస్తూ పూరి జగన్నాథ్ ఒక పాడ్‌కాస్ట్‌ను విడుదల చేశారు. ‘‘అందరూ 2020ని తిట్టుకుంటున్నారు. కానీ మన లైఫ్‌లో బెస్ట్ ఇయర్ 2020’’ అని పాడ్‌కాస్ట్‌ను మొదలుపెట్టారు పూరి. ఈ 2020 మనకు చాలా నేర్పిందని, ఆరోగ్యం ఎంత ముఖ్యమో అర్థమైందని, రోగనిరోధక శక్తి చాలా అవసరమని తెలిసిందని, మంచి ఆహారం విలువ తెలిసిందని పూరి అన్నారు. ఈ ఏడాదే ప్రజలు పరిశుభ్రత నేర్చుకున్నారని అన్నారాయన. పుట్టిన తరవాత ఇన్ని సార్లు ఎప్పుడూ మనం చేతులు కడుక్కోలేదని తెలిపారు.

ప్రముఖ నటుడు నర్సింగ్ యాదవ్ కన్నుమూత
‘‘పల్లెటూళ్లలో చదవుకోని వాళ్లకు కూడా చాలా విషయాలు తెలిశాయి. వైరస్, మ్యుటేషన్, శానిటైజర్, క్వారంటైన్, యాంటీబాడీస్, ప్లాస్మా.. ఇలా ఎన్నో విషయాలు తెలిసిపోయాయి. మొదట్లో నెల రోజులు లాక్‌డౌన్ అంటే మనకు పిచ్చి లేచింది. ఖాళీగా ఇంట్లో కూర్చోవాలంటే మెంటల్ హెల్త్ చాలా అవసరం అని తెలుసుకున్నాం. మనలో ఓపిక పెరిగింది. ఆత్మనిర్భర్.. ఆ తరవాత మెల్లగా కామ్ అయ్యాం. అన్నీ మూసుకుని కూర్చోవడం నేర్చుకున్నాం. 8 నెలలు ఎలా గడిచిపోయాయే మనకే తెలియలేదు.

డబ్బు ఉన్నా లేకపోయినా ఎలా బతికామో మనకే తెలీదు. నిజమైన ఫ్రెండ్స్ ఎవరో ఇప్పుడే తెలిసింది. లైఫ్‌లో సేవింగ్స్ ఎంత అవసరమో తెలిసొచ్చింది. వర్క్ ఫ్రమ్ హోం నేర్చుకున్నాం. ఆడవాళ్లు బంగారం, కొత్త చీరలు లేకుండా బతకడం నేర్చుకున్నారు. అవసరమైనవి మాత్రమే కొంటున్నాం. అనవసరమైన షాపింగ్‌లు, చిరుతిండ్లు తగ్గాయి. నేచర్ చాలా పవర్‌ఫుల్ అని తెలిసింది. ఏ దేవుడు మనల్ని కాపాడలేడని తెలిసింది. ఎవరైనా చిన్న సహాయం చేస్తే దాని విలువ మనకు అర్థమైంది.

వీడియో: బిగ్ బాస్ కంటెస్టెంట్లకు నాగబాబు మెగా పార్టీ.. ఆకాశమే హద్దట!
రెండు నిమిషాలు ఊపిరి ఆగితే చాలు ప్రాణాలు పోతాయి.. చావు అనేది పెద్ద విషయం కాదు అనేది తెలిసింది. అనుక్షణం ఒళ్లు దగ్గర పెట్టుకుని బతికాం. జలుబు, జ్వరానికి కూడా మనం భయపడాల్సిన పరిస్థితి వచ్చేసింది. పసుపు, వెల్లుల్లి, తేనె కషాయం.. ఆవిరి పట్టడం లాంటివి మంచిదని తెలిసింది. ఆయుర్వేదం విలువ తెలిసింది. 2020 ఒక మహమ్మారి సంవత్సరం కాదు. ఇది మన కళ్లు తెరిపించిన ఏడాది. అందుకే 2020కి మనం గౌరవం ఇవ్వాలి. 2020 అనేది మన గురువు. ఏడాది పాటు ప్రపంచాన్ని స్తంభించి మనందరికీ పాఠం చెప్పింది’’ అంటూ పూరి తనదైన శైలిలో రివ్యూ ఇచ్చారు. ఇంకా పూరి ఏం చెప్పారో వినాలనుకుంటే కింది వీడియోను క్లిక్ చేయండి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here