puducherry man fb post: రూ.5 కోట్ల ఇస్తే మోదీని చంపుతానంటూ ఫేస్‌బుక్‌లో పోస్ట్.. చివరికి అడ్డం తిరిగిన కథ! – puducherry man posts on facebook he is ready to assassinate pm modi for rs 5 crore

0
24


ప్రధానాంశాలు:

  • సంచలనం కోసం సోషల్ మీడియాలో వ్యాఖ్యలు.
  • వ్యక్తి మెడకు చుట్టుకున్న వివాదాస్పద పోస్ట్.
  • మోదీని చంపడానికి సిద్ధంగా ఉన్నట్టు ప్రకటన.

సోషల్ మీడియాలో వివాదాస్పద పోస్టులు పెట్టి పాపులారిటీ కోసం యువత పాకులాడుతోంది. ఈ క్రమంలో పలువురు చిక్కుల్లో పడి జైలుకు కూడా వెళ్తున్నారు. తాజాగా, ఓ యువకుడు సైతం అటువంటి పోస్ట్‌తోనే జైలపాలయ్యాడు. ఏకంగా ప్రధాని నరేంద్ర మోదీనే చంపడానికి సిద్ధంగా ఉన్నానంటూ చేసిన పోస్ట్.. అతడిని చిక్కుల్లో పడేసింది. మోదీని హత్యచేయడానికి సిద్ధంగా ఉన్నానంటూ ఫేస్‌బుక్‌లో పోస్ట్‌పెట్టి అడ్డంగా బుక్కయ్యాడు. ఈ పోస్ట్‌పై తీవ్రంగానే స్పందించిన పోలీసులు ఆ వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు.

పుదుచ్చేరిలోని అరియంకుప్పం ప్రాంతానికి చెందిన సత్యానందం (43) అనే వ్యక్తి ఫేస్‌బుక్‌లో ఓ పోస్టు పెట్టాడు. తనకు 5 కోట్ల రూపాయలు ఇస్తే ప్రధాని మోదీని చంపేందుకు సిద్ధంగా ఉన్నానని అందులో పేర్కొన్నాడు. ‘సత్య సత్య’ పేరుతో ఉన్న ఫేస్‌బుక్ అకౌంట్‌లో చేసిన పోస్ట్ వైరల్ అయ్యింది. దీనిపై తంగదురై అనే వ్యక్తి అరియంకుప్పం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ పోస్ట్ వివిధ వర్గాల ప్రజల మధ్య విద్వేషాలను రెచ్చగొట్టేదిగా ఉందని, అతడిపై చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరాడు.

తంగదురై ఫిర్యాదును సీరియస్‌గా తీసుకున్న పోలీసులు వెంటనే రంగంలోకి దిగారు. సత్యానందంపై వివిధ సెక్షన్ల కింద కేసు నమోదుచేశారు. దర్యాప్తు చేపట్టి ఈ పోస్ట్‌ను సత్యానందం పెట్టినట్టు గుర్తించారు. రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసే సత్యానందంగా గుర్తించిన పోలీసులు అతడిన అరెస్టు చేశారు. అనంతరం సత్యానందాన్ని గురువారం నాడు స్థానిక కోర్టులో హాజరుపరిచారు. కోర్టు ఆయనకు రిమాండ్ విధించింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here