Priyanka Chopra: ప్రియాంక చోప్రాను టార్గెట్ చేసిన పోర్న్ స్టార్.. అవమానిస్తూ ట్వీట్ – mia khalifa targets priyanka chopra over silence on farmers protests

0
31


ప్రధానాంశాలు:

  • ‘మిసెస్ జోనస్’ అంటూ పరోక్షంగా ప్రియాంకను టార్గెట్ చేసిన మియా
  • రైతు ఉద్యమంపై ఎందుకు సైలెంట్‌గా ఉన్నావంటూ ప్రశ్న
  • పోర్న్ స్టార్‌పై విరుచుకుపడుతున్న ప్రియాంక అభిమానులు

పోర్న్ మూవీస్ ద్వారా పాపులారిటీ సంపాదించిన లెబనీస్-అమెరికన్ అడల్ట్ స్టార్ మియా ఖలీఫా ప్రియాంక చోప్రాను టార్గెట్ చేస్తూ, ఆమెను అవమాన పరుస్తూ ట్వీట్ చేసింది. ‘మిసెస్ జోనస్’ అని ప్రియాంక చోప్రా జోనస్‌ను పరోక్షంగా ప్రస్తావిస్తూ ఒక ప్రశ్నను సంధించింది. ఇండియాలో జరుగుతోన్న రైతు ఉద్యమం విషయంలో ప్రియాంక చోప్రా ఎందుకు మౌనం వహిస్తున్నారని మియా ప్రశ్నించింది. ఈ మేరకు సోమవారం ఒక ట్వీట్ చేసింది.

‘‘మిసెస్ జోనస్ ఏ క్షణంలోనైనా తన మౌనాన్ని వీడబోతున్నారా? నాకు చాలా ఆత్రుతగా ఉంది. బీరుట్ పేలుళ్ల సమయంలో షకీరా స్పందన కోసం నేను వేచి చూసినట్టే ఇప్పుడు అనిపిస్తోంది. నిశ్శబ్దం’’ అని మియా ఖలీఫా తన ట్వీట్‌లో పేర్కొంది. అంటే, లెబనాన్ రాజధాని బీరుట్‌లో భారీ పేలుళ్లు సంభవించినప్పుడు పాప్ స్టార్ షకీరా స్పందించలేదట. అలాగే, ఇప్పుడు రైతు ఉద్యమం జరుగుతున్నప్పుడు ప్రియాంక చోప్రా స్పందించలేదని మియా వాదన.
కానీ, ఈ అంశంపై ప్రియాంక చోప్రా స్పందించి చాలా రోజులే అయ్యింది. గతేడాది డిసెంబర్‌లో రైతు ఉద్యమంపై ప్రియాంక చోప్రా ట్వీట్ చేశారు. మన రైతులు భారత్‌కు ఆహారాన్ని అందించే సైనికులని.. వారి భయాలను తొలగించాల్సిన అవసరం ఉందని ప్రియాంక తన ట్వీట్‌లో పేర్కొన్నారు. వారి ఆశలు నెరవేరాలన్నారు. అభివృద్ధి చెందుతోన్న ఒక ప్రజాస్వామ్యంగా మనమంతా ఈ సంక్షోభాన్ని వీలైనంత త్వరగా పరిష్కరించేలా చూడాలని పిలుపునిచ్చారు.

పోర్న్ రాకెట్: నటి వెబ్‌సైట్‌లో వీడియోలు.. ‘ఆపరేషన్ దుర్యోధన’ ఐటమ్ గర్ల్ అరెస్ట్
కానీ, ప్రియాంక చోప్రా గత ట్వీట్‌ను పట్టించుకోని మియా ఖలీఫా ఆమెను అవమానపరుస్తూ ట్వీట్ చేసింది. దీంతో ప్రియాంక అభిమానులు సోషల్ మీడియా ద్వారా మియా ఖలీఫాపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఒకరిపై బుదర చల్లేముందు కాస్త రీసెర్చ్ చేయాలని.. గతంలో ఏం జరిగిందో తెలుసుకోవాలని గడ్డిపెడుతున్నారు. అయితే, రైతుల ఉద్యమంలో సెలబ్రిటీల మధ్య యుద్ధం చాలా రోజుల క్రితమే ప్రారంభమైంది. ప్రియాంక చోప్రా ట్వీట్ చేసిన వెంటనే నటి కంగనా రనౌత్ విమర్శించారు. బీజేపీ ప్రభుత్వంపై బురద చల్లేందుకు, రైతుల ఉద్యమాన్ని ప్రోత్సహించడానికి, ఇస్లామిస్టులను ప్రోత్సహించడానికి ప్రియాంక కంకణం కట్టుకుందని ఆరోపించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here