Priyanka Chopra: పెళ్లికి ముందే ఆ కండీషన్.. దానికోసమే ప్రతి నెల కలిసేవాళ్ళం.. డేటింగ్ సీక్రెట్ చెప్పేసిన ప్రియాంక – priyanka chopra open comments on her dating with nick jonas

0
25


ప్రధానాంశాలు:

  • తనకంటే పదేళ్లు చిన్నవాడైన నిక్‌ని పెళ్లాడిన ప్రియాంక
  • డేటింగ్ అనుభవాలు పంచుకుంటూ ఓపెన్
  • ఆ కండీషన్ పెట్టుకున్నామంటూ అన్నీ చెప్పేసిన గ్లోబల్ బ్యూటీ

గ్లోబల్ బ్యూటీ ప్రియాంక చోప్రా గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలా! బాలీవుడ్ స్టార్ హీరోయిన్ అయిన ఆమె హాలీవుడ్‌లో సైతం మెప్పించి గ్లోబల్ స్టార్‌గా కీర్తి గడిస్తోంది. ఇక అమ్మడి ప్రేమ వ్యవహారం, భర్త నిక్ జోనాస్‌తో రొమాంటిక్ ముచ్చట్లంటే అబ్బబ్బో బోలెడన్ని ఉంటాయి లెండి. కాగా నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ తమ లవ్ సీక్రెట్స్ మెల్లమెల్లగా రివీల్ చేస్తున్న ప్రియాంక చోప్రా.. తాజాగా జరిగిన ఓ ఇంటర్వ్యూలో తాము డేటింగ్ చేస్తున్నప్పటి ఓ రహస్యం బయటపెట్టేసింది.

ఇండియన్ సినిమాల్లో సత్తా చాటుతూనే హాలీవుడ్‌లోకి సైతం ప్రవేశించింది ప్రియాంక చోప్రా. ఆ సమయంలోనే అమెరికాకు చెందిన పాప్ సింగర్ నిక్ జోనస్‌తో ప్రేమాయణం నడిపించింది. తన కంటే వయసులో పదేళ్లు చిన్నవాడైన అతనితో రహస్యంగా డేటింగ్ చేసింది. అలా కొంతకాలం ఎంజాయ్ చేశాక అతని జీవిత భాగస్వామిగా మారింది. పెళ్లయ్యాక కూడా కెరీర్ పరంగా దూసుకెళ్తున్న ఈ బ్యూటీ.. ఇటీవలే ‘ది వైట్‌ టైగర్‌’ సినిమాతో సక్సెస్ అందుకుంది. ఈ క్రమంలోనే ఓ ప్రముఖ మ్యాగజైన్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో నిక్ జోనాస్‌తో పెళ్లికి ముందు పెట్టుకున్న ఒప్పందాలపై ఓపెన్ అయ్యింది.

Also Read: పాయల్ రాజ్‌పుత్ వెరీ హాట్ గురూ..! అరకొర దుస్తులతో వల వేస్తున్న బోల్డ్ బ్యూటీ
వివాహానికి ముందు కూడా నిక్‌ జోనస్‌తో చాలా ఎంజాయ్ చేశానని పేర్కొన్న ప్రియాంక.. ఆయనతో ఉన్న అనుభవాలను అందరితో పంచుకుంది. పెళ్లికి ముందు కూడా వృత్తిపరంగా బిజీగా ఉండే తాము ఓ ఒప్పందం కుదుర్చుకున్నామని, ఎంత బిజీ షెడ్యూల్‌లో అయినా సరే కనీసం మూడు వారాలకు ఒకసారి కలవాలని కండీషన్ పెట్టుకున్నామని చెప్పింది. ఆ కండీషన్ ఫాలో అవుతూ తమ మధ్య బంధాన్ని మరింత బలపర్చుకున్నామని పేర్కొంది. ఆ బంధం, సమన్వయం నేటికీ అలాగే కొనసాగుతోందని చెప్పుకొచ్చింది ప్రియాంక చోప్రా.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here