Priyadarshi Mail Teaser: ‘మెయిల్’ టీజర్: ప్రియదర్శి కంప్యూటర్ ట్రైనింగ్.. నవ్వు ఆపుకోలేరు.. ఆ రోజులు గుర్తొస్తాయి! – aha next original mail a production of vyjayanthi movies to release sankranti 2021

0
58


తెలుగు ప్రేక్షకుల‌ను ఈ ఏడాది ఎంట‌ర్‌టైన్మెంట్‌తో అల‌రించిన అచ్చ తెలుగు ఓటీటీ ప్లాట్‌ఫాం ‘ఆహా’.. రానున్న కొత్త సంవత్సరం 2021కి సరికొత్తగా ఆహ్వానం పలుకుతుంది. అందులో భాగంగా వైజయంతీ మూవీస్ సంస్థలో భాగమైన స్వప్న సినిమా బ్యానర్‌పై ప్రియాంక ద‌త్, స్వప్న ద‌త్ నిర్మాత‌లుగా ఉద‌య్ గుర్రాల ద‌ర్శక‌త్వంలో రూపొందిన వెబ్ సిరీస్ ‘కంబాలపల్లి కథలు’లో మొదటి భాగంగా ‘మెయిల్‌’‌ను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తోంది. సంక్రాంతి సందర్భంగా జనవరి 13న ఈ వెబ్ సిరీస్ ఛాప్టర్ 1 ‘మెయిల్’ను విడుదల చేస్తోంది.

ఇంటర్నెట్ వచ్చిన కొత్తలో ప్రజలు దాని వాడకం తెలిసీ తెలియక ఎలా ప్రవర్తించారనే కథాంశంతో దర్శకుడు ఉదయ్ గుర్రాల హాస్య భరితంగా, మనసుకు హత్తుకునేలా ‘మెయిల్‌’ను తెర‌కెక్కించారని నిర్మాత స్వప్న దత్ తెలిపారు. బుధ‌వారం మెయిల్ టీజ‌ర్‌ను విడుద‌ల చేశారు. ప్రియ‌ద‌ర్శి ప్రధాన పాత్రలో న‌టించారు. ఈ టీజర్ చూసిన ప్రతి ఒక్కరూ ఆ పాత రోజుల్ని గుర్తుచేసుకోవడం ఖాయం. ఎందుకంటే ఇందులో ప్రియదర్శి కంప్యూటర్ ట్రైనర్. కానీ, కంప్యూటర్ భాగాలను సరిగా పలకడం కూడా రాదు.

రామ్ ‘రెడ్’ నుంచి ‘డించక్’ సాంగ్: మణిశర్మ మాస్ బీట్.. హెబ్బా హాట్
‘2005.. అప్పుడప్పుడే ఊర్లళ్ళో కంప్యూటర్ పరిచయమవుతున్న రోజులు..’ అని ఈ టీజర్‌ను మొదలుపెట్టారు. ‘కంప్యూటర్.. సముద్రం.. బోలెడుంటాయి. మూజ్, కీబర్డ్, ఊపీఎస్, మాంటర్’ అంటూ తనదైన శైలిలో కామెడీ పండించారు ప్రియదర్శి. ఇలాంటి ట్రైనర్ ఊళ్లో అందరికీ కంప్యూటర్ శిక్షణ అందించడం ఎంత హిలేరియస్‌గా ఉంటుందో చెప్పాల్సిన అవసరం లేదు. ఈ సిరీస్‌లో హ‌ర్షిత్ మాల్గి రెడ్డి, మ‌ణి అగెరుల‌, శ్రీ గౌరీ ప్రియారెడ్డి, శ్రీకాంత్ పల్లె, రవీందర్ బొమ్మకంటి, అనుషా నేత తదితరులు నటించారు. స్వీకార్ అగస్తి సంగీతం సమకూర్చారు. ఉదయ్ గుర్రాల, శ్యామ్ దుపాటి సినిమాటోగ్రఫి అందించారు.

‘మెయిల్’ టీజర్: ఊర్లళ్ళో కంప్యూటర్ పరిచయమవుతున్న రోజుల్లో..!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here