
పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కాగా ఉభయ సభలను ఉద్దేశించి రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ ప్రసంగిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన సాగు చట్టాలను వ్యతిరేకిస్తూ రైతులు ఆందోళనలు చేస్తోన్న నేపథ్యంలో రాష్ట్రపతి ప్రసంగాన్ని 18 ప్రతిపక్ష పార్టీలు బహిష్కరించాయి. గణతంత్ర దినోత్సవం రోజున జరిగిన హింసాత్మక ఘటనలు బాధకలిగించాయని పేర్కొన్నారు. భావవ్యక్తీకరణ స్వేచ్ఛను ఇచ్చిన రాజ్యాంగ చట్టాలు.. నిబంధనలు పాటించాలని చెబుతున్నాయని ఉద్ఘాటించారు. ఆత్మ నిర్భర్ భారత్లో ఎంఎస్ఎంఈల పాత్ర ఎంతో కీలకమైంది.. రూ.20 వేల కోట్ల ప్రత్యేక నిధి, ఫండ్ ఆఫ్ ఫండ్ ద్వారా ఎంఎస్ఎంఈలకు మేలు జరిగిందన్నారు.
దేశంలో ప్రతి ఇంటికి రక్షిత మంచినీరు అందజేసే కార్యక్రమం వేగంగా సాగుతోందని అన్నారు. ‘దేశ రైతుల ప్రయోజనాల కోసమే కొత్త సాగు చట్టాలను తీసుకొచ్చాం.. నూతన సాగు చట్టాలు రైతుల హక్కులకు భంగం కలిగించబోవని అన్నారు. సాగు చట్టాలతో రైతులకు కొత్త అవకాశాలు.. హక్కులు లభిస్తాయి.. వ్యవసాయ మౌలిక వసతుల అభివృద్ధికి లక్షల కోట్లు ఖర్చు చేస్తున్నాం.. బాపూజీ కలలు గన్న స్వరాజ్యం సాధించడం మా ప్రభుత్వ ప్రధాన ధ్వేయం.. దేశంలోని 24 వేల ఆస్పత్రుల్లో ఆయుష్మాన్ భారత్ సేవలను ఎక్కడ నుంచైనా పొందొచ్చు.. జన ఔషధి కార్యక్రమంలో భాగంగా పేదలకు నాణ్యమైన మందులను తక్కువ ధరకే అందజేస్తున్నాం’ అని రాష్ట్రపతి తన ప్రసంగంలో పేర్కొన్నారు.
అంతకు ముందు పార్లమెంటు ప్రాంగణంలో ప్రధాని మోదీ మాట్లాడుతూ.. దేశానికి సంబంధించి ఈ దశాబ్దం చాలా కీలకమైందని, భారత స్వాతంత్య్ర సమరయోధుల కలలను నెరవేర్చేందుకు ఇది మంచి అవకాశమని చెప్పారు. ప్రజల ఆకాంక్షలు నెరవేర్చే విషయాలపైనే చర్చలు జరగాలన్నారు. దేశ చరిత్రలో గత ఏడాది తొలిసారిగా నిర్మలా సీతారామన్ నాలుగైదు మినీ బడ్జెట్లను వివిధ ప్యాకేజీల రూపంలో సమర్పించాల్సి వచ్చిందని చెప్పారు.
Like this:
Like Loading...