ప్రధానాంశాలు:
- ప్రభాస్ హీరోగా మరో భారీ సినిమా
- ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ‘సలార్’
- విలన్‌గా ఫేమస్ కన్నడ స్టార్
తన తదుపరి ప్రాజెక్టు ‘సలార్’ అని, ఈ బిగ్గెస్ట్ సినిమాలో భాగం కానుండటం చాలా సంతోషంగా ఉందని పేర్కొంటూ సోషల్ మీడియాలో సందేశం పోస్ట్ చేశారు మధూ గురుస్వామి. ఈ సువర్ణ అవకాశాన్ని ఇచ్చిన ప్రశాంత్ నీల్, నిర్మాతలకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలుపుతున్నా అని ఆయన పేర్కొన్నారు. కన్నడ సినీ పరిశ్రమలో మధు నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలు చేసి మంచి గుర్తింపు పొందారు గురుస్వామి. ”వజ్రకాయ, భజరంగీ” సినిమాయూ ఆయనకు పాపులారిటీ తెచ్చిపెట్టాయి. ఈ చిత్రాల ద్వారా వచ్చిన గుర్తింపుతో కన్నడతో పాటు పలు దక్షిణాది సినిమాల్లో ఆయన నటించారు.
ఇక ‘సలార్’ విషయానికొస్తే.. హోంబలే ఫిల్మ్స్ బ్యానర్‌పై ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాలో ప్రభాస్ సరసన శృతి హాసన్ హీరోయిన్గా నటిస్తోంది. ఇటీవలే ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ రామగుండంలో ప్రారంభించారు. ప్రభాస్‌ను ఢీ కొట్టే పాత్రలో మధూ గురుస్వామి చేస్తే బావుంటుందని ప్రభాస్ ఫ్యాన్స్ ట్వీట్ చేస్తున్నారు. త్వరలోనే దీనిపై ‘సలార్’ టీం అధికారిక ప్రకటన చేయనుందట.