Prabhas: Salaar: ప్రభాస్‌తో ప్రియాంక చోప్రా రొమాన్స్.. గ్లోబల్ బ్యూటీ కోసం ప్రశాంత్ నీల్ స్కెచ్ ఇదే! – salaar: prabhas will romance with priyanka chopra

0
34


ప్రధానాంశాలు:

  • ప్రభాస్‌తో ప్రశాంత్ నీల్ సినిమా
  • ‘సలార్’ టైటిల్ ఫిక్స్
  • రంగంలోకి ప్రియాంక చోప్రా

ప్రభాస్ హీరోగా రాబోతున్న పాన్ ఇండియా మూవీ ‘సలార్’పై ప్రత్యేక శ్రద్ధ పెట్టారు ఆ సినిమా డైరెక్టర్ ప్రశాంత్ నీల్. రెబల్ స్టార్‌తో తెరపంచుకునే నటీనటుల విషయమై కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఈ క్రమంలోనే ‘సలార్’ ఐటెం సాంగ్ కోసం ఏకంగా గ్లోబల్ బ్యూటీ ప్రియాంక చోప్రాను రంగంలోకి దించాలని ఆయన ప్లాన్ చేస్తున్నారట. ప్రభాస్- ప్రియాంక కాంబోలో ఐటెం సాంగ్ షూట్ చేసి ఈ జోడీ రొమాన్స్ దేశవిదేశాల్లోని ప్రేక్షకులకు చిరకాలం గుర్తుండేలా చేయాలని ఆయన స్కెచ్చేసినట్లు తెలుస్తోంది.

యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతున్న ఈ పాన్ ఇండియా సినిమాను హోంబలే ఫిల్మ్స్‌ బ్యానర్‌పై భారీ బడ్జెట్ కేటాయించి రూపొందిస్తున్నారు. చిత్రంలో ప్రభాస్ సరసన శృతి హాసన్‌ హీరోయిన్‌గా నటిస్తోంది. ఇటీవలే ఈ సినిమా రెగ్యులర్‌ షూటింగ్‌ ప్రారంభించారు. కొన్ని రోజులుగా తెలంగాణలోని గోదావరిఖని ఓపెన్ కాస్ట్ ఏరియాలో ఈ షూటింగ్ జరిపి తొలి షెడ్యూల్ ఫినిష్ చేశారు. ఇకపోతే ఇటీవలే కన్నడ నటుడు మధు గురుస్వామి సలార్ చిత్రంలో తాను కూడా భాగమవుతున్నానని ప్రకటించడం ప్రభాస్ అభిమానులను ఖుషీ చేసింది.
బూతు అవుతుందని తెలుసు.. అందుకే ‘ఎ’ సర్టిఫికెట్ ఇచ్చారు: FCUK నిర్మాత
సాహో మూవీ తర్వాత కాస్త గ్యాప్ వచ్చినా వరుస సినిమాలతో ప్రభాస్ బిజీ కావడం ఆయన అభిమానుల్లో ఉత్సాహం నింపుతోంది. రాధాకృష్ణ దర్శకత్వంలో ‘రాధేశ్యామ్’ షూటింగ్ చివరి దశకు చేరుకోవడంతో నాగ్ అశ్విన్‌తో మూవీ, అలాగే `ఆదిపురుష్` సినిమాలను లైన్‌లో పెట్టేశారు ప్రభాస్. దీంతోపాటు ‘సలార్’ మూవీ షూటింగ్‌లో పాల్గొంటున్నారు. ఏదేమైనా ప్రభాస్‌తో గ్లోబల్ బ్యూటీ రొమాన్స్ అంటే మాత్రం ఇక థియేటర్స్ హోరెత్తిపోవాల్సిందే. చూడాలి మరి ‘సలార్’ యూనిట్ స్కెచ్ ఏ మేర సక్సెస్ అవుతుందనేది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here