ప్రధానాంశాలు:
- ప్రభాస్‌కు తల్లిగా సీనియర్ నటి హేమమాలిని
- కౌశల్యగా కనిపించబోతున్న అలనాటి అందాల తార
- ఓం రౌత్ దర్శకత్వంలో రూపొందుతోన్న ‘ఆదిపురుష్’
రామాయణం నేపథ్యంతో రూపొందుతోన్న ‘ఆదిపురుష్’లో రాముడిగా ప్రభాస్ కనిపించనున్నారు. ప్రభాస్ రాముడు అయితే ఆయన తల్లి కౌశల్య పాత్రలో నటించేదెవరు అనేది ప్రశ్న? ఈ ప్రశ్నకు సమాధానం దొరికేసింది అంటున్నాయి బాలీవుడ్ వర్గాలు. అలనాటి అందాల తార, బాలీవుడ్ సీనియర్ నటి హేమమాలిని ప్రభాస్ తల్లిగా కనిపించబోతున్నారట. కౌశల్య పాత్ర కోసం దర్శక నిర్మాతలు హేమమాలిని సంప్రదించారట. ఆమె కూడా అంగీకారం తెలిపారని అంటున్నారు.

హేమమాలిని
భారీ పాన్ ఇండియా మూవీగా బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్ రూపొందిస్తోన్న సినిమా కాబట్టి కచ్చితంగా ఆయన ప్రముఖ నటీనటులనే తీసుకుంటారు. అందులో భాగంగానే కౌశల్య పాత్రకు హేమమాలినీని ఎంపిక చేసుకున్నారని టాక్. మిగిలిన నటీనటులు కూడా పాపులర్ యాక్టర్సే ఉంటారని టాక్. ఇప్పటికే మెయిన్ విలన్‌గా సైఫ్ అలీ ఖాన్‌ను తీసుకున్నారు. లంకేశుడిగా ఆయన కనిపించనున్నారు.
కాగా, ఈ సినిమాలో ప్రభాస్ సరసన నటించే హీరోయిన్ ఎవరు అనే విషయాన్ని దర్శక నిర్మాతలు ప్రకటించాల్సి ఉంది. అంటే, సీతగా ఎవరు నటిస్తారు అనేది ఆసక్తికరం. ఈ సినిమాను భూషణ్ కుమార్, క్రిషన్ కుమార్, రాజేష్ నాయర్, ఓం రౌత్, ప్రసాద్ సుతార్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. యం.యం.కీరవాణి సంగీతం సమకూరుస్తున్నారు. ఫలణి కార్తీక్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు.