Prabhas: ప్రభాస్‌ని పరిచయం చేయాల్సింది నేనే.. కానీ ఆ ఒక్క కారణంగా! రాఘవేంద్ర రావు ఓపెన్ కామెంట్స్ – raghavendra rao comments on prabhas first film

0
18


ప్రధానాంశాలు:

  • పాన్ ఇండియా స్టార్‌గా వెలుగొందుతున్న ప్రభాస్
  • ఆయన తొలి సినిమా గురించి రాఘవేంద్ర రావు కామెంట్స్
  • ఆ ఒక్క కారణంగా చేయలేదంటూ ఓపెన్

రాఘవేంద్ర రావు.. ఆ నాటి నుంచి నేటితరం ప్రేక్షకుల వరకు సుపరిచితం ఈ దర్శకుడు. ఈయన గురించి ప్రత్యేకమైన వివరణే అవసరం లేదు. శాతాదిక చిత్రాల దర్శకుడిగా ఎన్నో సూపర్ డూపర్ హిట్ సినిమాలు తెరకెక్కించి టాలీవుడ్ దర్శకేంద్రుడుగా కీర్తించబడుతున్నారాయన. హీరోహీరోయిన్లను బట్టి సినిమా కథను మలిచేసి హిట్ సొంతం చేసుకోవడం ఆయనొక్కడికే చెల్లుతుందని చెప్పడంలో అతిశయోక్తిలేదు. మరి ఇలాంటి దర్శకుడితో ప్రభాస్ సినిమా అంటే ఎలా ఉంటుందో ఓ సారి ఊహించుకోండి.

ఇప్పటికైతే అది సాధ్యం కాలేదు కానీ ముందు ముందు మాత్రం పక్కాగా ఉంటుందనిపిస్తోంది. దానికి కారణం స్వయంగా ఓ ఇంటర్వ్యూలో ప్రభాస్ గురించిన ప్రస్తావనను రాఘవేంద్ర రావు తీసుకురావడమే. ఇటీవలే ఓ మీడియాతో మాట్లాడిన దర్శకేంద్రుడు.. చిత్రసీమకు ప్రభాస్‌ని తానే పరిచయం చేయాల్సింది కానీ ఆ సమయంలో బిజీ షెడ్యూల్ కారణంగా మిస్ అయిందని చెప్పుకొచ్చారు. ప్రభాస్‌ తండ్రి రాఘవేంద్రరావుకు సన్నిహితుడు కావడంతో తన కొడుకుతో సినిమా చేయమని అడిగారట. మీ డైరెక్షన్లో తొలి చిత్రం రావాలని కోరారట. కానీ అది సాధ్యపడలేదంటూ అప్పటి సంగతులు గుర్తు చేసుకున్నారు రాఘవేంద్ర రావు.
భర్తతో హనీమూన్ ట్రిప్ ఎంజాయ్ చేస్తున్న సింగర్ సునీత.. లవ్లీ పిక్ షేర్ చేస్తూ ప్రేమపై సందేశం
ఎలాగైతేనేం మొత్తానికి జయంత్ సి. పరాన్జీ దర్శకత్వంలో ‘ఈశ్వర్’ సినిమాతో 2002 సంవత్సరంలో ప్రేక్షకులకు పరిచయమైన ప్రభాస్ అంచెలంచెలుగా ఎదిగి ప్రస్తుతం పాన్ ఇండియా స్టార్ అయ్యారు. మరోవైపు కొన్నేళ్లపాటు కాస్త విరామం తీసుకున్న రాఘవేంద్ర రావు కొత్త కథల వేట ప్రారంభించారు. దీంతో అప్పుడు కాకపోయినా ఇప్పుడైనా ప్రభాస్- రాఘవేంద్ర రావు కాంబో సెట్టయితే ఎంత బాగుండో అంటున్నారు ఇరువురి ఫ్యాన్స్. సో చూడాలి మరి.. భవిష్యత్తులో అయినా ఈ దిగ్గజ కాంబోలో సినిమా వస్తుందా? అనేది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here