Prabhas: ఆదిపురుష్ క్రేజీ అప్‌డేట్.. ప్రభాస్‌తో స్క్రీన్ షేర్ చేసుకోనున్న సీనియర్ హీరోయిన్ – adipurush: senior heroine kajol will screen share with prabhas

0
48


యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్‌ ప్రస్తుతం వరుస పాన్ ఇండియా సినిమాలకు కమిటైన సంగతి తెలిసిందే. అన్నీ భారీ బడ్జెట్ సినిమాలే. బాహుబలి తర్వాత ప్రభాస్ రేంజ్ ఎక్కడికో వెళ్లిపోవడంతో కోట్లలో ఖర్చు పెట్టి ఆయనతో సినిమాలు చేసేందుకు ముందుకొస్తున్నారు దర్శకనిర్మాతలు. ఈ క్రమంలోనే ప్రభాస్ హీరోగా బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్ దర్శకత్వంలో రూపొందనున్న కొత్త సినిమా ‘ఆదిపురుష్’. తాజాగా ఈ మూవీకి సంబంధించిన క్రేజీ అప్‌డేట్ చక్కర్లు కొడుతోంది.

ఐదు భాషల్లో రూపొందనున్న ఈ చిత్రాన్ని టీ సిరీస్ బ్యానర్‌పై ఈ చిత్రాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా భూషణ్ కుమార్, కృష్ణ కుమార్, ప్రసాద్ సుతార్, రాజేష్ నాయర్‌లు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇందులో ప్రభాస్ రాముడిగా కనిపించనుండటం విశేషం. ఇక ఈ భారీ సినిమాలో ప్రభాస్‌తో తలపడబోయే స్టార్ సైఫ్ అలీఖాన్ అని ఇప్పటికే ప్రకటించింది చిత్రయూనిట్. సైఫ్ అలీ ఖాన్ రావణుడిగా కనిపించనున్నారు.
Acharya: చేతిలో చాయ్ గ్లాస్.. ఆచార్య సెట్స్‌పై హుషారుగా రామ్ చరణ్! ఫొటో వైరల్
కాగా ఈ మూవీలో మరో ముఖ్యపాత్ర కోసం బాలీవుడ్ సీనియర్ హీరోయిన్ కాజోల్‌ని తీసుకున్నారని తెలుస్తోంది. ఆమె సైఫ్ అలీ ఖాన్‌కు జోడీగా నటించే అవకాశాలు ఉన్నాయని కూడా ప్రచారం జరుగుతోంది. కాజోల్ రోల్ సినిమాకే మేజర్ అట్రాక్షన్ అవుతుందని బాలీవుడ్ వర్గాల మాట. ఈ విషయం తెలిసి ప్రభాస్ ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు. ఇక ఈ భారీ సినిమాలో ప్రభాస్ జోడీగా బ్యూటీ కృతి సనన్ నటించనుందని సమాచారం. అదేవిధంగా లక్ష్మణుడి పాత్ర కోసం మరో బాలీవుడ్ స్టార్ సన్నీ సింగ్‌ని ఫైనల్ చేశారని తెలుస్తోంది.

Kajol

ఎపిక్ పీరియాడికల్ యాక్షన్ డ్రామాగా రూపొందనున్న ఈ మూవీ ప్రభాస్ కెరీర్‌లో 22వ సినిమాగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాపై దేశవిదేశాల్లో ఉన్న ప్రభాస్ ఫ్యాన్స్ భారీ అంచనాలు పెట్టుకున్నారు. అతి త్వరలో ప్రభాస్ ఈ మూవీ సెట్స్ పైకి వెళ్లనున్నారట.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here