PM Modi: నేడు ఎనిమిది కొత్త రైళ్లు ప్రారంభం.. అత్యాధునికి రైలు బోగీలను ట్విట్టర్ ద్వారా షేర్ చేసిన ప్రధాని – pm modi to flag off 8 trains for better connectivity to statue of unity

0
14


గుజరాత్‌లోని కెవాడియాకు దేశంలోని ఇతర ప్రాంతాలను అనుసంధానం చేసే ఎనిమిది రైళ్లను ప్రధాని నరేంద్ర మోదీ ఆదివారం ఉదయం 11.00 గంటలకు ప్రారంభించనున్నారు. కెవాడియాలో సర్దార్ పటేల్ ఐక్యతా విగ్రహాన్ని ఏర్పాటుచేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో అహ్మదాబాద్ నుంచి కెవాడియా మధ్య నడిచే జన శతాబ్ది ఎక్స్ ప్రెస్ రైలుకు నేటి నుంచి అత్యాధునిక విస్టా డోమ్ కోచ్ లను జోడించనున్నారు. వీటికి సంబంధించిన ఫోటోలను ప్రధాని నరేంద్ర మోదీ తన ట్విట్టర్ ఖాతా ద్వారా పంచుకున్నారు.

ఈ కోచ్‌లు ప్రయాణికులకు కొత్త అనుభూతిని మిగుల్చుతాయని ఈ సందర్భంగా మోదీ వ్యాఖ్యానించారు. త్వరలోనే మరిన్ని రైళ్లకు ఇవే తరహా కోచ్‌లను రైల్వే శాఖ అనుసంధానించనుందని తెలిపారు. ఈ కోచ్‌లు బయటి ప్రపంచాన్ని మరింతగా చూపిస్తాయి. పై భాగం అధిక శాతం పారదర్శకంగా అద్దాలతో ఉంటుంది. ఈ రైలు గుజరాత్‌లోని నర్మదా నదిపై నిర్మించిన స్టాచ్యూ ఆఫ్ యూనిటీ మీదుగా సాగుతుందని మోదీ గుర్తుచేశారు. ఈ రైల్లో ప్రజలు ఇకపై మరింత ఆనందంగా ప్రయాణిస్తూ, అత్యద్భుత సర్దార్ పటేల్ విగ్రహ సందర్శనకు వెళ్లవచ్చని అన్నారు.

విస్టాడోమ్ కోచ్‌లను అనుసంధానించిన రైళ్ల జాబితాను కూడా మోదీ ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. కెవాడియా – వారణాసి మహామన ఎక్స్‌ప్రెస్, దాదర్ – కెవాడియా ఎక్స్‌ప్రెస్, కెవాడియా – హజ్రత్ నిజాముద్దీన్ బై వీక్లీ ఎక్స్‌ప్రెస్, కెవాడియా – రేవా వీక్లీ ఎక్స్‌ప్రెస్, చెన్నై – కెవాడియా వీక్లీ ఎక్స్‌ప్రెస్, ప్రతాప్‌నగర్ – కెవాడియా మెమూ రైళ్లకు వీటిని అమర్చనున్నట్టు తెలిపారు.

ఈ కార్యక్రమంలో ప్రధాని మోదీతోపాటు గుజరాత్ ముఖ్యమంత్రి విజయ్ రూపానీ, రైల్వే మంత్రి పియూష్ గోయల్ పాల్గొననున్నారు. కెవాడియాతో అనుసంధానం చేసే రైళ్లతోపాటు దబోయ్-చందోడ్, చందోడ్-కెవాడియా మార్గంలో నిర్మించిన బ్రాడ్‌గేజ్ రైల్వే మార్గాన్ని ప్రారంభించనున్నారు. దేశంలోనే గ్రీన్ బిల్డింగ్ సర్టిఫికెట్ పొందిన తొలి రైల్వే స్టేషన్‌గా కెవాడియా నిలిచింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here