అటు.. తమిళనాడు ఘటనపైనా మోదీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. క్రాకర్స్ ఫ్యాక్టరీలో పేలుడు ఘటనలో 16 మంది మరణించిన అంశంపై స్పందించారు. మృతుల కుటుంబాలకు రూ.2 లక్షల చొప్పున పరిహారం ప్రకటించారు. గాయపడిన వారికి రూ.50 వేలు ప్రకటించారు.
ఎప్పటికప్పుడు తెలుసుకుంటున్నా: కిషన్ రెడ్డి
అరకు దుర్ఘటనపై హోం శాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి స్పందించారు. ప్రమాదానికి సంబంధించిన సమాచారాన్ని ఎప్పటికప్పుడు తెలుసుకుంటున్నట్లు వెల్లడించారు. ‘హైదరాబాద్కు చెందిన ప్రైవేట్ ట్రావెల్ బస్సు అరకు ఘాటు రోడ్డులో ప్రమాదానికి గురైన సంఘటన తీవ్ర దిగ్భ్రాంతిని కలిగించింది. ఈ విషయమై సంబంధిత అధికారులతో మాట్లాడి సహాయక చర్యల పరిస్థితి ఎప్పటికప్పుడు తెలుసుకుంటున్నాను. మృతుల కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను’ అని కిషన్ రెడ్డి పేర్కొన్నారు. ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేశారు.
విశాఖలో చోటు చేసుకున్న ప్రమాదంపై తెలుగు రాష్ట్రాల గవర్నర్లు తమిళిసై సౌందరరాజన్, బిశ్వభూషణ్ హరిచందన్, ముఖ్యమంత్రులు కేసీఆర్, వైఎస్ జగన్ సహా పలువురు ప్రముఖులు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.