pharmacy student kidnap case: మరో దిశ: నాడు లారీ డ్రైవర్లు, నేడు ఆటోడ్రైవర్లు.. ఆలస్యమైతే ఇంకెంత ఘోరం జరిగేదో! – ghatkesar: four accused identified in b pharmacy student kidnap case

0
61


దిశ ఘటన.. యావత్ దేశాన్ని దిగ్భ్రాంతికి గురిచేసిన హత్యోదంతం. శంషాబాద్ సమీపంలోని తొండుపల్లి టోల్ గేట్ సమీపంలో స్కూటీ పార్క్ చేసి వెళ్లిన వెటర్నరీ వైద్యురాలిని గమనించిన మృగాళ్లు.. మాటు వేసి, ఆమె తిరిగొచ్చేసరికి కపట నాటకానికి తెరతీసి కిడ్నాప్ చేసి అఘాయిత్యానికి ఒడిగట్టారు. ఆ తర్వాత అత్యంత దారుణంగా హత్య చేసి మృతదేహాన్ని 28 కి.మీ. దూరం తీసుకెళ్లి పెట్రోలు పోసి నిప్పంటించారు. ఆ ఘటన తలచుకుంటే ఆడపిల్లల తల్లిదండ్రులకు ఇప్పటికీ వెన్నులో వణుకు పుడుతుంది.

అలాంటి ఘటనే హైదరాబాద్ శివార్లలో మరొకటి చోటు చేసుకోబోయింది. పోలీసులు సకాలంలో స్పందించడంతో ఆ ఆడబిడ్డ ప్రాణాలు దక్కాయి. కానీ, అప్పటికే ఆమెపై అఘాయిత్యం జరిగింది. నాడు లారీ డ్రైవర్లు.. నేడు ఆటో డ్రైవర్లు. నాడు వెటర్నరీ వైద్యురాలు, నేడు ఫార్మసీ విద్యార్థిని. ఇక మిగిలిన దారుణమంతా ఇంచుమించు సేమ్.

నిందితులు తమ వెంట ఇనుప రాడ్లు, కర్రలను తెచ్చుకున్నారు. వారం రోజుల పాటు రెక్కీ నిర్వహించి ఆ అమ్మాయిని కిడ్నాప్ చేశారు. ముందస్తు ప్రణాళిక ప్రకారం.. తాము ఎంచుకున్న ప్రాంతానికి తీసుకెళ్లి అఘాయిత్యం చేశారు. ఆమె తీవ్రంగా ప్రతిఘటించడంతో రాడ్లతో కొట్టారు. దారుణం ఒడిగట్టిన తర్వాత ఆ అమ్మాయిని చంపేసేవారేమో. అదే సమయానికి పోలీసుల సైరన్ వినిపించడంతో అక్కడ నుంచి పారిపోయారు. అపస్మారక స్థితిలో ఉన్న యువతిని పోలీసులు వెంటనే హాస్పిటల్‌కు తరలించారు.

ఘట్కేసర్ సమీపంలోని జోడిమెట్లలో జరిగిన ఫార్మసీ స్టూడెంట్ కేసులో సంచలనాలు వెలుగులోకి వచ్చాయి. ఆ దారుణం అప్పటికప్పుడు జరిగింది కాదని, నిందితులు పక్కా ప్రణాళికతో యువతిపై దాడి చేశారని తెలుస్తోంది.

ఎక్కడికెళ్తోంది? ఎప్పుడు వస్తోంది?
బాధిత యువతి కొంపల్లిలో బీఫార్మసీ సెకండియర్ చదువుతోంది. రోజూ కాలేజీ నుంచి వచ్చే సరికి చీకటి పడుతుంది. యన్నంపేటకు చెందిన ప్రధాన నిందితుడు ఆ అమ్మాయిపై వారం రోజులుగా కన్నేశాడు. ఆమె తిరిగొచ్చే సమయానికి తన ఆటో తీసుకొని స్టేజీ వద్దకు వస్తున్నాడు. వారం రోజులుగా ఆమెను గమనిస్తున్నాడు. యువతికి ఎలాంటి అనుమానం రాకుండా మాట కలిపి సాన్నిహిత్యం పెంచుకునే ప్రయత్నం చేసినట్లు తెలుస్తోంది.

ప్రధాన నిందితుడైన యువకుడు మరో ముగ్గురు ఆటో డ్రైవర్లకు తన ప్లాన్ వివరించాడు. వారితో కలిసి ఆ యువతి కుటుంబం వివరాల గురించి ఆరా తీశాడు. ఆ యువతి ఎప్పుడు వస్తుంది? ఎక్కడికి వెళుతోంది? ఫ్యామిలీ బ్యాక్‌గ్రౌండ్ ఏంటి తదితర వివరాలు తెలుసుకున్నారు. నిందితులందరూ ఒకే గ్రామానికి చెందినవారు. అందరూ 25 ఏళ్ల నుంచి 30 ఏళ్ల మధ్య వయసు వారేనని తెలుస్తోంది.

ఎప్పటిలాగే బుధవారం (ఫిబ్రవరి 10) ఆ అమ్మాయి కాలేజీ నుంచి తిరిగొచ్చేసరికి సాయంత్రం 6.15 గంటల సమయం అవుతోంది. ప్రధాన నిందితుడు ఆమెను ఆటోలో ఎక్కించుకున్నాడు. ఆటోలో అప్పటికే ఓ వృద్ధురాలు, చిన్నారి ఉన్నారు. కానీ, వాళ్లు తదుపరి స్టేజీలో దిగిపోయారు.

ఆ ఫోన్ చేసుండకపోతే..!
కొంత దూరం వెళ్లిన తర్వాత బాధితురాలిని ఆటో నుంచి దింపి ఓ వ్యాన్‌లో ఎక్కించాడు. అప్పటికే ఆ వ్యాన్‌లో ముగ్గురు యువకులు ఉన్నారు. ఆమె దిగాల్సిన స్టేజీ వచ్చినా వ్యాన్‌ను ఆపకుండా ముందుకు తీసుకెళ్లారు. యువతి మనసు కీడు శంకించింది. వెంటనే తన ఫోన్ తీసి తల్లికి కాల్ చేసింది. ప్రమాదంలో ఉన్నట్లు తెలిపింది. ఈలోగా నిందితులు ఆమె ఫోన్ లాగేసుకున్నారు.

యువతి తల్లిదండ్రులు వెంటనే కీసర పోలీసులను సంప్రదించారు. మల్కాజిగిరి డీసీపీ రక్షితా మూర్తికి ఆ కిడ్నాప్ సమాచారం అందడంతో కీసర, ఘట్కేసర్ పోలీసులను అప్రమత్తం చేశారు. నాలుగైదు పోలీసు బృందాలను ఏర్పాటు చేశారు. బాధితురాలి ఫోన్ సిగ్నళ్ల ఆధారంగా ఆమె ఘట్కేసర్‌కు సమీపంలోనే ఉన్నట్లు తెలుసుకున్నారు. ఆ ప్రాంతానికి చేరుకునేసరికి ఆమె ఫోన్ స్విచ్ఛాఫ్ అయింది.

యువతిని నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లిన నిందితులు ఆమెపై అఘాయిత్యం చేశారు. ఈలోగా రహదారి వెంట సైరన్ చేస్తూ పోలీసుల వాహనాలు దూసుకొచ్చాయి. తమను పోలీసులు వెంబడిస్తున్నట్లు గ్రహించిన నిందితులు యువతిని వివస్త్రగానే లాక్కొచ్చి తమ వాహనంలోకి ఎక్కించుకున్నారు. ఘట్కేసర్, మేడిపల్లి మార్గంలో ఓ నిర్మానుష్య ప్రాంతంలో వదిలేసి పారిపోయారు.

అపస్మారక స్థితిలో ఉన్న బాధితురాలిని వెంటనే స్థానిక ప్రైవేట్ హాస్పిటల్‌కు తరలించారు. సీసీ టీవీ ఫుటేజ్‌లను పరిశీలించి ఆటోను గుర్తించిన పోలీసులు అనంతరం నిందితుల వివరాలు సేకరించారు. సెల్ ఫోన్ సిగ్నల్స్ ఆధారంగా నలుగురిని నిందితులను గుర్తించి అరెస్టు చేసినట్లు తెలుస్తోంది. భువనగిరి SOT పోలీసులు వారిని విచారిస్తున్నట్లు సమాచారం.

మెరుగైన చికిత్స కోసం బాధితురాలిని గాంధీ ఆస్పత్రికి తరలించారు. యువతిపై అత్యాచారం జరిగిందని వైద్య పరీక్షల్లో తేలినట్లు సమాచారం. ఈ విషయాన్ని పోలీసులు ధ్రువీకరించాల్సి ఉంది. ప్రస్తుతం ఆమె ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని మల్కాజిగిరి డీసీపీ రక్షిత మూర్తి తెలిపారు. రాడ్డుతో కొట్టడం వల్ల బాధితురాలి కాలికి గాయమైనట్లు వెల్లడించారు. ప్రధాన నిందితుడిపై ఇప్పటికే రెండు కేసులు ఉన్నట్లు తెలుస్తోంది. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలను ప్రెస్‌మీట్‌లో వెల్లడించే అవకాశం ఉంది.

ఫార్మా విద్యార్థిని కేసు: పక్కా ప్లాన్.. వారం రోజులుగా ఫాలో అవుతూ!

ఘటనపై ఆగ్రహావేశాలు పెల్లుబుకుతున్నాయి. నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తూ స్థానికులు గురువారం ఘట్కేసర్ రహదారిపై బైఠాయించి నిరసన తెలిపారు. బాధితురాలు తన తల్లికి ఫోన్ చేయకపోయుంటే పరిస్థితి మరోలా ఉండేది. దిశను దారుణంగా హత్య చేసిన నిందితులు ఎన్‌కౌంటర్‌లో హతమైనా, నిర్భయ దోషులను ఉరితీసినా.. ఇలాంటి దురాలోచన చేసేవారికి భయం పుట్టకపోవడం ఇప్పుడు తల్లిదండ్రులను మరింత కలచివేస్తోంది.

Also Read:

పాపకు రూ.16 కోట్ల ఇంజెక్షన్.. చలించిన ప్రధాని

ఉత్తరాఖండ్ టన్నెల్: మూసుకుపోయిన దారులు.. ఇక ఇదే చివరి ఆశ!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here