Petrol price: రాముడి ఇండియాలో రూ.93, సీతాదేవి నేపాల్‌లో 53.. ఇక లంకలో; పెట్రోల్ ధరపై పేలుతున్న సెటైర్ – bjp mp subramanian swamy tweet on petrol price goes viral

0
21


రాముడి ఇండియాలో పెట్రోల్ ధర రూ.93. సీతాదేవి నేపాల్‌లో రూ.53. రావ‌ణుడి లంక‌లో రూ.51. దేశంలో పెరుగుతున్న పెట్రోల్ ధరలపై వేసిన సెటైర్ ఇది. ఇది సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ స్థాయిలో విమర్శలు కురిపించింది బీజేపీ పార్టీకి చెందిన ఎంపీయే కావడం మరో విశేషం. ఆయనే సుబ్రమణ్య స్వామి. ప్రతిపక్షమైనా, సొంత పక్షమైనా.. ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడే ఆయ‌న.. పెరుగుతున్న పెట్రోల్ ధ‌ర‌లపై చేసిన ఈ ట్వీట్ సోషల్ మీడియాను షేక్ చేస్తోంది.

పెట్రోల్ ధరలు పెరుగవు.. క్లారిటీ ఇచ్చిన ఆర్థిక మంత్రి
గత కొన్ని రోజులుగా పెట్రోల్‌, డీజిల్‌ ధరలు పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది. ఈ ధరల ప్రభావం అటు కూరగాయలు, నిత్యావసరాలపైనా పడుతోంది. పెట్రోల్, డీజిల్‌తో పాటు ఎల్పీజీ ధరలు కూడా కొండెక్కాయి. ఇది సామాన్యుడికి మరింత భారంగా మారింది. ఇంధన ధరలు తగ్గించడానికి కేంద్రంలోని బీజేపీ సర్కార్ ఏవైనా చర్యలు చేపడుతుందని ఆశించినా.. అలా జరగలేదు. పెట్రోల్ ధర అతి త్వరలో రూ.100కు చేరనుంది. దీంతో సామాన్యుడిలో నైరాశ్యం నెలకొంది.

దేశ రాజధాని ఢిల్లీలో లీటర్ పెట్రోల్ ధర రూ. 86.30గా ఉంది. ఇక డీజిల్ ధర రూ.76.48గా ఉంది. ఆర్థిక రాజధాని ముంబైలో లీటర్ పెట్రోల్ ధర రూ.92.86 ఉండగా, డీజిల్ ధర రూ.83.30కు చేరింది. ఇక హైదరాబాద్‌లో లీటర్ పెట్రోల్ ధర రూ.89.77గా, లీటర్ డీజిల్ ధర రూ.83.46 గా ఉంది. విజయవాడలో లీటర్ పెట్రోల్ ధర రూ.92.69గా, డీజిల్ ధర రూ.85.85గా ఉంది.

Also Read:

కరోనాకు 162 మంది డాక్లర్లు, 107 మంది నర్సుల మృతి

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here