ప్రధానాంశాలు:
- నెటిజన్లతో శ్రీ రెడ్డి చిట్ చాట్
- పవన్ కళ్యాణ్‌తో డ్యూయెట్ అంటూ బోల్డ్ కామెంట్స్
- సోషల్ మీడియాలో రచ్చ చేస్తున్న వీడియో
సినిమాలతో దక్కని గుర్తింపు తరచూ వివాదాల్లో నిలుస్తూ సంచలన వ్యాఖ్యలు చేయడం మూలంగా శ్రీ రెడ్డి దక్కించుకుంది. సినీ పెద్దలపై లైంగిక ఆరోపణలు చేస్తూ హైదరాబాద్ ఫిలిం ఛాంబర్ ఎదుట అర్ధనగ్న ప్రదర్శన చేసి అప్పట్లో దేశవ్యాప్తంగా చర్చల్లో నిలిచింది శ్రీ రెడ్డి. క్యాస్టింగ్ కౌచ్ ఉద్యమంతో ఆమె చేసిన రచ్చ అంతాఇంతా అని చెప్పలేం. ఇక ఆ తర్వాత చెన్నైలో మకాం వేసి సోషల్ మీడియా వేదికగా తనలో ఉన్న ఫ్రస్ట్రేషన్ అంతా బయటపెడుతూ బూతు పురాణాలు వినిపిస్తోంది ఈ సంచలన తార. ఏ చిన్న సందర్భం దొరికినా బోల్డ్ ముచ్చట్లతో ప్రతి ఒక్కరి చూపు తనపై పడేలా చేసుకుంటోంది.
ఈ మధ్యకాలంలో ఎక్కువగా తన బాడీ, ఎద భాగంపై ఫోకస్ పెడుతూ స్టార్ హీరోయిన్లతో పోల్చుకుంటున్న శ్రీ రెడ్డి.. తాజాగా అదే రిపీట్ చేస్తూ మరోసారి సంచలనం సృష్టించింది. బోల్డ్ లేడీ అంటూ నెటిజన్లు చేస్తున్న కామెంట్స్‌పై రియాక్ట్ అవుతూ.. కొన్ని సందర్భాల్లో బోల్డ్‌గా ఉంటా కానీ ఎప్పుడూ ఉండనని చెప్పింది. అలాగే ఇప్పుడైతే నా టీ షర్ట్ తీయలేనంటూ సెక్సీ కామెంట్ చేసి కాకరేపింది. ఇక పవన్ కళ్యాణ్- శ్రీ రెడ్డి కాంబో చూడాలని ఓ నెటిజన్ అడగడంతో మరింత రెచ్చిపోయింది శ్రీ రెడ్డి.
”రేయ్ కలలు కనండి కానీ.. మరీ ఇలాంటి దారుణమైన దెయ్యం కలలు కనకండి. నా నోట్లోంచి కాంట్రవర్సీ కామెంట్స్ రావాలనే కదా ఈ కామెంట్స్ చేస్తున్నారు. సరే.. ఫన్నీగా తీసుకుందాం. పవన్, నేను ఓ డ్యూయెట్ చేస్తే.. అప్పుడు పవన్ ఫ్యాన్స్ ఫీలింగ్స్..! శ్రీ.. యు ఆర్ సో బ్యూటిఫుల్. ఆగలేక పోతున్నాం.. బాల్స్ షేక్ ఆగం” అంటూ బోల్డ్ సైగలతో పిచ్చెక్కించింది శ్రీ రెడ్డి. దీంతో శ్రీ రెడ్డి షేర్ చేసిన ఈ చిట్ చాట్ వీడియో నెట్టింట రచ్చరచ్చ చేస్తోంది. ఇక ఈ వీడియోపై వచ్చే కామెంట్స్ అంటారా.. అబ్బో! మాటల్లో చెప్పలేని పదాలు బాబోయ్!!.