ప్రధానాంశాలు:
- షర్మిల కొత్త పార్టీపై పవన్ కళ్యాణ్ స్పందన
- ఢిల్లీలో పవన్ కళ్యాణ్ ప్రెస్ మీట్
- తప్పేం ఉందంటూ ఆసక్తికరమైన వ్యాఖ్యలు
ఈ తరుణంలో షర్మిల కొత్త పార్టీని స్వాగతించే వాళ్లు కొందరైతే.. ఈమె ఎవరు వదిలిన బాణం అంటూ చర్చోపచర్చలు మొదలయ్యాయి. ఈ తరుణంలో జనసేన అధినేత, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ స్పందిస్తూ ఆసక్తికరమైన కామెంట్స్ చేశారు.
ప్రస్తుతం ఢిల్లీలో ఉన్న పవన్ కళ్యాణ్.. కేంద్ర పెద్దలతో వరుస భేటీలు అవుతున్నారు. దేవాలయాలపై దాడులు, వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రయివేటీకరణ అంశంపై బీజేపీ పెద్దలతో ప్రస్తావించినట్టు తెలిపారు పవన్ కళ్యాణ్.
ఈ సందర్భంగా షర్మిల కొత్త పార్టీపై పవన్ కళ్యాణ్ స్పందనను విలేకరులు కోరగా.. ‘ఆమె పార్టీ ఇంకా ఫామ్ చేయలేదు కదా.. చేయబోతున్నారు.. పార్టీని స్థాపించి వారి విధివిధాలను తెలియజేసినప్పుడు.. వారు రాజకీయాల్లోకి వచ్చినప్పుడు మాట్లాడితే బాగుంటుంది. ప్రతి ఒక్కరూ రాజకీయాల్లోకి వచ్చే హక్కు, అవకాశం ఉంది.. ఎవరైనా రావచ్చు. పార్టీ పెట్టొచ్చు.. ఎవరైనా రావాలనే కోరుకుంటాం.. అందులో తప్పేం లేదు’ అంటూ షర్మిల కొత్త పార్టీ ఏర్పాటుపై తన అభిప్రాయాన్ని తెలియజేశారు పవర్ స్టార్.