Pawan Kalyan BJP: Somu Veerraju: పవన్ సీఎం ఆశలు గల్లంతు.. సోము వీర్రాజు కీలక వ్యాఖ్యలు.. బీజేపీ ముఖ్యమంత్రిగా బీసీ! – andhra pradesh caste politics; somu veerraju tells bjp ap cm candidate will be from bc, then what about pawan kalyan

0
38


ప్రధానాంశాలు:

  • ఏపీ బీజేపీ ప్రెసిడెంట్ సోము వీర్రాజు కీలక వ్యాఖ్యలు
  • జగన్, చంద్రబాబులకు సవాల్
  • మరి పవన్ కళ్యాణ్ భవిష్యత్ ఏంటి?
  • బీసీ ముఖ్యమంత్రి అభ్యర్థి అయితే పవన్ కళ్యాణ్ కేవలం సపోర్టర్ మాత్రమేనా?

జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తనకు పదవులు ముఖ్యం కాదని.. ప్రజా శ్రేయస్సు కోసమే వివిధ పార్టీలతో మైత్రి అని గత కొంతకాలంగా గళం వినిపిస్తున్నా.. ఆయన అభిమానులు, జనసైనికులు పవన్ ముఖ్యమంత్రి కావాలనే కోరుకుంటారు.

జనసేన పార్టీ స్థాపించిన తరువాత గడిచిన రెండు ఎన్నికల్లో తొలిసారి పవన్ టీడీపీ మంత్రం జపించి ఆ పార్టీతో సపోర్ట్ చేయగా.. ఆ తరువాత ఎన్నికల్లో జనసేన కమ్యునిస్ట్ పార్టీలతో జతకలిసి పోటీలో నిలిచిన విషయం తెలిసిందే. అయితే సినిమాల్లో బ్లాక్ బస్టర్ హిట్లు కొట్టే పవన్ కళ్యాణ్ ప్రత్యక్ష ఎన్నికల్లో అట్టర్ ఫ్లాప్ అయ్యాడు. పోటీ చేసిన రెండు స్థానాల్లోనూ గెలవకపోగా.. కేవలం ఒకే ఒక ఎమ్మెల్యే సీటు మాత్రమే వచ్చింది. ఇప్పుడు గెలిచిన ఆ ఎమ్మెల్యే (రాపాక వరప్రసాద్-రాజోలు) జనసేనలో ఉన్నా లేనట్టే.

175 స్థానాలకు గానూ… 136 స్థానాల్లో పోటీ చేస్తే.. 120 చోట్ల డిపాజిట్లు గల్లంతు అయ్యాయి. గతంలో పీఆర్పీ గెలిచిన స్థానాల్లో కూడా డిపాజిట్లు దక్కించుకోలేకపోయింది జనసేన.

ఇదంతా జరిగిపోయి వ్యవహారం కాగా.. రానున్న 2024 ఎలక్షన్స్‌లో మాత్రం ఎలాగైనా పరువు నిలుపుకుని పట్టు సాధించడం కోసం వ్యూహాత్మక అడుగుతు వేస్తున్నారు పవన్ కళ్యాణ్. దీనిలో భాగంగానే పాచిపోయిన లడ్డూలంటూ బీజేపీని ఏకిపారేసిన ఆనాటి పవన్ కళ్యాణే.. మళ్లీ బీజేపీతో దోస్తీ కట్టారు.

ఇప్పుడు ఎక్కడ చూసినా బీజేపీ-జనసేన జెండాలు జంటగా కనిపిస్తుండటంతో ఏపీ రాజకీయాలు ఉత్కంఠగా మారాయి. దీనితో పాటు ఇటీవల పవన్ కళ్యాణ్ కాపు నాయకులతో ప్రత్యేక చర్చలు జరపడంతో జనసేనానికి కూడా కాపు ఓట్లు చీలిపోకుండా ‘కాపు’కాసేందుకు వ్యూహాత్మక అడుగులు వేస్తున్నట్టుగా చర్చపచర్చలు జరిగాయి.

మొత్తంగా బీజేపీ మైత్రితో ఏపీలో పవన్ కళ్యాణ్ రాజకీయ శక్తిగా అవతరించబోతున్నాడని.. రానున్న ఎన్నికల్లో ఆయన ముఖ్యమంత్రి అభ్యర్థి అని ప్రచారం ఊపందుకున్న తరుణంలో ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు కీలక వ్యాఖ్యలు చేశారు. పవన్ ముఖ్యమంత్రి ఆశలపై నీళ్లు చల్లారు.

గురవారం నాడు మీడియా మాట్లాడిన ఆయన.. ఎవరినో సీఎం చేయడానికి బీజేపీ అధికారం కోరుకోవడం లేదన్నారు. ఈ సందర్భంగా బీసీలను ముఖ్యమంత్రి చేసే దమ్ము, ధైర్యం టీడీపీ, వైఎస్ఆర్‌సీపీలకు ఉన్నదా అంటూ ఛాలెంజ్ చేశారు.

‘బీజేపీ-జనసేన కలిసి పనిచేస్తున్న సందర్భంలో అనేకమంది మా పార్టీలో చేరడానికి అనేక మంది ముందుకు వస్తున్నారు. నేను పేర్లు చెప్పడానికి అవకాశం లేదు.. కొంతమంది ఎంపీలు, మాజీ ఎంపీలు, మాజీ మంత్రులు బీజేపీలో చేరబోతున్నారు. ఉత్తరాంధ్ర, రాయలసీమ, తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో కీలకనేతలు బీజేపీలో చేరడానికి టచ్‌లో ఉన్నారు.

చంద్రబాబు నాయుడు బీసీని ముఖ్యమంత్రి చేయగలడా.. జగన్ మోహన్ రెడ్డి బీసీని ముఖ్యమంత్రి చేయగలడా? బీసీని ముఖ్యమంత్రి చేయగలిగే దమ్ము బీజేపీకి మాత్రమే ఉంది. ఈదేశంలో ఒక బీసీని ముఖ్యమంత్రి చేసే దమ్ము ఒక్క బీజేపీకి మాత్రమే ఉందని ఛాలెంజ్ చేసి చెప్తున్నా. వ్యవస్థను సమూలంగా నడిపించాలనే ఆలోచన ఉన్న పార్టీ మాది. ఎవర్నో ముఖ్యమంత్రిని చేయాలని బీజేపీ అధికారం కోరుకోవడం లేదు. వ్యక్తుల కోసం కాదు.. ఆంధ్రరాష్ట్ర వాస్తవ అభివృద్ధి కోసం బీజేపీ తపిస్తోంది. ఆంధ్రప్రదేశ్ రూపురేఖల్ని మార్చాలని ఒక కల, స్వప్నంతో ముందుకు వెళ్తున్నాం.

నిన్న ఒకాయన (అచ్చెంనాయుడు) అంటున్నాడు.. నేనే ముఖ్యమంత్రి అవుతానని. ఎవరికి హోంమంత్రి అవుతావయ్యా? చంద్రబాబుకి వాళ్ల కొడుకు, కోడలు, భార్యకి హోం మంత్రి అవుతావా? నువ్ వాళ్ల హోంకి హోం మంత్రి అవుతావ్. చంద్రబాబు టైంలో కూడా హోం మంత్రి ఉన్నాడు. కనీసం డీఎస్పీని కూడా ట్రాన్స్ ఫర్ చేయించలేకపోయాడు అంటూ నిప్పులు చెరిగారు సోము వీర్రాజు.

అయితే అచ్చెం నాయుడుపై చేసిన వ్యాఖ్యల్ని పక్కనపెడితే.. సోము వీర్రాజు జపిస్తున్న బీసీ మంత్రంపై ఇప్పుడు పొలిటికల్ సర్కిల్‌లో హాట్ టాపిక్. ఒకవైపు కాపు వర్గానికి చెందిన పవన్ కళ్యాణ్ తన కులానికి సంబంధించిన కీలక నాయకుల్ని ప్రసన్నం చేసుకునే పనిలో ఉంటే.. ఖలేజా ఉన్న కాపు నేత పవన్‌ని కాకుండా.. బీసీ కాబోయే ముఖ్యమంత్రి అంటూ సోము వీర్రాజు కీలక వ్యాఖ్యలు చేయడం జనసైనికుల్లో గుబులు రేగుతోంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here