Pawan Kalyan: పవన్ కళ్యాణ్- క్రిష్ మూవీ మూవీ అప్‌డేట్.. బాలీవుడ్ యాక్టర్ అర్జున్‌ రాంపాల్‌ రోల్ ఇదే!! – pspk 27 latest update: arjun rampal role in pawan kalyan- krish movie

0
29


ప్రధానాంశాలు:

  • పవన్ కళ్యాణ్- క్రిష్ కాంబోలో భారీ సినిమా
  • పీరియాడికల్ డ్రామాగా ప్రేక్షకుల ముందుకు
  • బాలీవుడ్ యాక్టర్ అర్జున్‌ రాంపాల్‌ కీలకపాత్ర

గత రెండుళ్లుగా రాజకీయాల్లో బిజీ అయిన పవన్ కళ్యాణ్.. నిర్మాతలు, అభిమానుల కోరిక మేరకు తిరిగి కెమెరా ముందుకొచ్చిన సంగతి తెలిసిందే. ఇటీవలే ‘వకీల్ సాబ్’ షూటింగ్ కంప్లీట్ చేసిన ఆయన, ఏ మాత్రం విరామం తీసుకోకుండా తన తదుపరి సినిమా షూటింగ్స్ పూర్తి చేస్తున్నారు. ఓ వైపు ‘అయ్యప్పనుమ్ కోషియమ్’ సినిమా తెలుగు రీమేక్‌‌లో నటిస్తూనే, మరోవైపు డైరెక్టర్ క్రిష్ సినిమాను శరవేగంగా పూర్తి చేస్తున్నారు పవన్. బిజీ షెడ్యూల్‌లో కూడా డేట్స్ ఇవ్వడంతో డైరెక్టర్ క్రిష్ ఈ సినిమా షూటింగ్ వేగాన్ని పెంచేశారు.

పీరియాడికల్ డ్రామాగా రూపొందుతున్న ఈ మూవీ పవన్ కళ్యాణ్ కెరీర్‌లో 27వ సినిమాగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఏ.ఎం.రత్నం నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. చిత్రంలో బాలీవుడ్‌ నటుడు అర్జున్‌ రాంపాల్‌ ఆరో మొఘల్‌ చక్రవర్తి ఔరంగజేబు పాత్రలో కనిపించనుండటం విశేషం. ఫిబ్రవరి 19న హైదరాబాద్‌లో ఈ మూవీ షూటింగ్ ప్రారంభించిన 12 రోజుల పాటు పలు కీలక సన్నివేశాలను చిత్రీకరణ చేయబోతున్నారు. ఇందుకోసం ప్రత్యేకంగా చార్మినార్‌, మచిలీపట్నం పోర్ట్ సెట్లను వేశారు. ఇందులో పవన్ కళ్యాణ్- అర్జున్‌ రాంపాల్‌లపై కొన్ని సీన్స్ షూట్ చేయనున్నారట.
నాకు ఏడెనిమిది ఏళ్లు పట్టింది.. వైష్ణవ్ తొలి సినిమాతోనే అదరగొట్టాడు: రామ్ చరణ్
ఈ చిత్రంలో పవన్ కళ్యాణ్ సరసన ఇస్మార్ట్ బ్యూటీ నిధి అగర్వాల్ హీరోయిన్‌గా నటిస్తుండగా, అర్జున్‌ రాంపాల్ సోదరి పాత్రలో బాలీవుడ్‌ భామ జాక్విలీన్‌‌ ఫెర్నాండజ్ కనిపించనుందట. ఈ ఏడాది మే నెల వరకు షూటింగ్‌ మొత్తం పూర్తి చేసేలా పవన్ కళ్యాణ్- క్రిష్ ప్లాన్ చేసుకున్నట్లు టాక్. ఇకపోతే మొదట ఈ చిత్రానికి ‘విరూపాక్ష’ అనే టైటిల్ పెట్టారని వార్తలు వచ్చినప్పటికీ, రీసెంట్‌గా ‘హరి హర వీరమల్లు’ అనే టైటిల్ ఫిక్సయ్యారని తెలిసింది. త్వరలోనే దీనిపై అఫీషియల్ ప్రకటన రానుందట.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here