‘అవును, ఆయన (లాడెన్) నవాజ్ షరీఫ్‌కు ఓ విషయంలో అండగా నిలిచారు. లాడెన్ తరచూ షరీఫ్‌కు ఆర్థిక సాయం చేసేవారు. ఏదేమైనా అదో పెద్ద సంక్లిష్టమైన విషయం’ అని అబిదా అన్నారు. ఇటీవల ఓ ప్రముఖ టీవీ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో అబిదా ఈ విషయాన్ని తెలిపారు. ఇందుకు సంబంధించిన వీడియో క్లిప్ వైరల్ అవుతోంది.
నవాజ్ షరీఫ్‌పై ఇటీవల అధికార ‘పాకిస్థాన్ తెహ్రీక్-ఇ-ఇన్సాఫ్’ పార్టీకి నేత ఫరూఖ్ అబీబ్ సంచలన ఆరోపణలు చేశారు. లాడెన్ నుంచి షరీఫ్ 10 మిలియన్ డాలర్లు తీసుకొని.. అప్పటి బెనజీర్ భుట్టో ప్రభుత్వాన్ని కూల్చేందుకు ప్రయత్నించారని చెప్పారు. విదేశీ విరాళాలకు షరీఫే శ్రీకారం చుట్టారని అన్నారు. ఈ అంశంపై అబిదా హుస్సేన్‌ను ప్రశ్నించగా పైవిధంగా స్పందించారు.
పాకిస్థాన్‌కు నవాజ్ షరీఫ్ మూడు పర్యాయాలు ప్రధానిగా వ్యవహరించారు. కశ్మీర్లో జిహాదీ కార్యక్రమాలకు ఆయన మద్దతిచ్చేవారనే ఆరోపణలు ఉన్నాయి. అందుకు కావాల్సిన నిధులను లాడెన్ నుంచే తీసుకునేవారని అప్పట్లో వార్తలు వచ్చాయి. తాజాగా అబిదా చెప్పిన విషయాలతో ఆ వార్తలు నిజమేనని స్పష్టం చేస్తున్నాయి.