Home Blog Page 3

Nani Birthday wishes: ‘తమ్ముడు’ నాని పుట్టినరోజు.. సినీ ప్రముఖుల నుంచి శుభాకాంక్షల వెల్లువ – tollywood celebs showers birthday wishes on nani

0


ప్రధానాంశాలు:

 • 37వ ఏట అడుగుపెట్టిన నాని
 • ‘టక్ జగదీష్’ టీజర్‌తో ఫ్యాన్స్‌కు పండగ తీసుకొచ్చిన నేచురల్ స్టార్
 • నానీకి సోషల్ మీడియా ద్వారా విషెస్ చెబుతోన్న సెలబ్రిటీస్

స్వయంకృషితో ఎదిగి ప్రతిభావంతుడైన నటుడిగా తెలుగు ప్రేక్షకుకుల మన్ననలు అందుకుంటోన్న నేచురల్ స్టార్ నాని 37వ ఏట అడుగుపెట్టారు. గంటా నవీన్ బాబు అలియాస్ నాని ఈరోజు (ఫిబ్రవరి 24న) తన పుట్టినరోజును జరుపుకుంటున్నారు. ఈ ప్రత్యేకమైన రోజున నాని స్నేహితులు, శ్రేయోభిలాషులు, అభిమానులు, సినీ ప్రముఖులు ఆయనకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ప్రస్తుతం ట్విట్టర్ నాని పుట్టినరోజు శుభాకాంక్షల ట్వీట్లతో నిండిపోతోంది.

చిరంజీవి సినిమాకు వెళ్లి సైకిల్ పోగొట్టుకున్న నాని.. మళ్లీ మెగాస్టార్ దగ్గరనుంచే రాబట్టి..!
చాలా మంది సెలబ్రిటీలు ట్విట్టర్ ద్వారా నానీకి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ మెసేజ్‌లు పోస్ట్ చేస్తున్నారు. కీర్తి సురేష్, నివేదా థామస్, సునీల్, ఆది పినిశెట్టి, శ్రీవిష్ణు, రీతూ వర్మ, కార్తికేయ, సత్యదేవ్, రాశీ ఖన్నా, వెన్నెల కిషోర్, తమన్, దర్శకుడు శివ నిర్వాణ, నిర్మాత సూర్యదేవర నాగవంశీ, బండ్ల గణేష్.. ఇలా చాలా మంది సెలబ్రిటీలు ట్విట్టర్ ద్వారా నానీకి పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పారు. నటుడు సునీల్ అయితే ‘తమ్ముడు నాని’ అని సంబోధించారు.

ఇదిలా ఉంటే, నాని హీరోగా నటించిన ‘టక్ జగదీష్’ సినిమా విడుదలకు సిద్ధమవుతోంది. శివ నిర్వాణ దర్శకత్వంలో రూపొందుతోన్న ఈ సినిమా ఏప్రిల్ 23న ప్రేక్షకుల ముందుకు వస్తోంది. నేడు నాని పుట్టినరోజు సందర్భంగా నిన్న ‘టక్ జగదీష్’ టీజర్‌ను విడుదల చేశారు. ఈ టీజర్ విశేషంగా ఆకట్టుకుంటోంది. అన్ని హంగులతో కూడిన పూర్తి కుటుంబ కథాచిత్రంగా ‘టక్ జగదీష్’ రూపొందిందని టీజర్ చూస్తే అర్థమవుతోంది. ముఖ్యంగా నాని చాలా అందంగా కనిపిస్తున్నారు. ఆయన సరసన రీతూ వర్మ, ఐశ్వర్య రాజేష్ హీరోయిన్లుగా నటించారు.

నాజ‌ర్, జ‌గ‌ప‌తిబాబు, రావు ర‌మేష్‌, వీకే న‌రేష్‌, డానియ‌ల్ బాలాజీ, తిరువీర్, రోహిణి, దేవ‌ద‌ర్శిని, ప్రవీణ్ ముఖ్య పాత్రలు పోషించిన ఈ చిత్రానికి తమన్ సంగీతం సమకూర్చారు. ప్రసాద్ మూరెళ్ల సినిమాటోగ్రఫీ అందించారు. మాస్టర్ వెంకట్ కంపోజ్ చేసిన ఫైట్స్ టీజర్‌లో చాలా అట్రాక్టివ్‌గా కనిపిస్తున్నాయి. ఇక వెండితెరపై బ్లాక్ బస్టరే. ఈ సినిమాను షైన్ స్క్రీన్స్ బ్యానర్‌పై సాహు గారపాటి, హరీష్ పెద్ది నిర్మిస్తున్నారు.

Reliance Zoo: అంబానీ కుమారుడి కలల ప్రాజెక్ట్.. ప్రపంచంలోనే అతిపెద్ద జూ పార్క్.. రిలయన్స్ భారీ స్కెచ్! – ril to set up world’s largest zoo in jamnagar area of gujarat

0


ప్రధానాంశాలు:

 • గుజరాత్‌లో రిలయన్స్ జూ పార్క్
 • ప్రపంచంలోనే మరెక్కడా లేని రీతిలో..
 • అంబానీ కుమారుడి కలల ప్రాజెక్ట్

ప్రపంచంలోనే అతిపెద్ద జూ పార్కును ఏర్పాటు చేసే దిశగా రిలయన్స్ ఇండస్ట్రీస్ అడుగులేస్తోంది. గుజరాత్‌లోని జామ్‌నగర్ జిల్లాలో అంబానీ ఈ జూ ప్రాజెక్టును ఏర్పాటు చేయబోతున్నారు. ‘గ్రీన్స్ జులాజికల్ రెస్క్యూ అండ్ ది రిహాబిలిటేషన్ కింగ్‌డమ్’ పేరిట సమర్పించిన డీపీఆర్‌కు సెంట్రల్ జూ అథారిటీ ఇటీవలే ఆమోద ముద్ర వేసింది. జామ్‌నగర్‌లో రిలయన్స్ రిఫైనరీకి చేరువలో ఆ సంస్థకు ఉన్న 280 ఎకరాల స్థలంలో ఈ జూను ఏర్పాటు చేయబోతున్నారు.

ముకేశ్ అంబానీ చిన్న కుమారుడు అనంత్ అంబానీ కలల ప్రాజెక్ట్‌గా దీన్ని చెబుతున్నారు. రిలయన్స్ కార్పొరేట్ సామాజిక బాధ్యతలో భాగంగా.. వన్య ప్రాణులకు ఆవాసం కల్పించడం కోసం గుజరాత్ అటవీ శాఖకు సహకరించడం కోసం కూడా ఈ ప్రాజెక్ట్ తోడ్పడనుంది. వచ్చే రెండేళ్లలో ఈ పార్కు కార్యరూపం దాల్చే అవకాశం ఉంది.

రిలయన్స్ ఏర్పాటు చేయబోయే జూలో ప్రపంచం నలుమూలల నుంచి.. 100కిపైగా రకాల భిన్న జాతుల పక్షులు, సరీసృపాలు, జంతువులను తీసుకొచ్చి ఉంచనున్నారు. ఎలుగుబంట్లు, కొమోడో డ్రాగన్లు, తోడేళ్లు, పెలికాన్లు, అరిచే జింకలు.. తదితర జంతువులను ఈ జంతు ప్రదర్శనశాలలో ఉంచనున్నారు. చిరుతలు, జిరాఫీలు, ఏనుగులు, ఆఫ్రికా సింహాలు, నిప్పు కోడి తదితర వన్య ప్రాణులను ఈ జూలో ఉంచుతారు.

ఇప్పటికే గుజరాత్‌లోని కెవాడియాలో ప్రపంచంలోనే అతి ఎత్తయిన విగ్రహం (పటేల్ విగ్రహం) ఉంది. త్వరలోనే ప్రపంచంకెల్లా అతిపెద్ద జూ సైతం ఈ రాష్ట్రంలోనే ఏర్పాటు కానుంది. ఈ జూ కారణంగా గుజరాత్‌కు భారీగా పర్యాటకులను ఆకర్షిస్తుందని భావిస్తున్నారు.

gumla incident: ఒకే కుటుంబంలోని ఐదుగురు దారుణ హత్య.. చిన్నారిని కూడా గొడ్డలితో నరికి – five of same family brutally killed in gumla in jharkhand

0


ప్రధానాంశాలు:

 • కుటుంబంలో చెలరేగిన కలహాలకు ఐదుగురు బలి.
 • గొడ్డలితో దాడిచేసిన అత్యంత కిరాతకంగా హత్య.
 • అర్ధరాత్రి వేళ హత్యలతో ఉలిక్కిపడ్డ గ్రామస్థులు.

ఝార్ఖండ్‌లోని గుమ్లా జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. ఒకే కుటుంబంలోని ఐదుగురిని అత్యంత కిరాతకంగా హత్యచేశారు. కామ్‌దరా పోలీస్ స్టేషన్ పరిధిలోని పహర్తోలి గ్రామంలో ఈ ఘటన సంభవించింది. తండ్రి, తల్లి, కుమారుడు, కోడలు, ఓ చిన్నారిని పదునైన ఆయుధంతో పొడిచి చంపడం ఈ ప్రాంతంలో కలకలం రేగింది. మంగళవారం రాత్రి ఈ ఘోరం చోటుచేసుకోగా.. స్థానికులు బుధవారం ఉదయం గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. హత్యల గురించి సమాచారం అందుకున్న పోలీసులు అక్కడకు చేరుకుని దర్యాప్తు చేపట్టారు.

కుటుంబం వివాదాలే హత్యకు కారణమని పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. కుటుంబం ఆర్ధికంగా పలు ఇబ్బందులను ఎదుర్కొంటున్నట్టు స్థానికులు తెలిపారు. మృతులను నికుదీన్ తోప్నో (60), భార్య జోస్పినా (55), వారి కుమారుడు విన్సెంట్ (35), కోడలు సైల్వంతీ (30), వీరి ఐదేళ్ల కుమారుడు అశ్విన్‌గా గుర్తించారు. ఈ హత్యలకు గల కారణాలు తెలియాల్సి ఉంది. వీరంతా ఆత్మహత్యకు పాల్పడ్డారా? అనే కోణంలోనూ పోలీసులు అనుమానిస్తున్నారు. దర్యాప్తులో వాస్తవాలు వెలుగులోకి వస్తాయని పేర్కొన్నారు.

కేసు నమోదుచేసిన పోలీసులు.. నిందితులు కోసం గాలిస్తున్నారు. డాగ్ స్వ్యాడ్‌ను రంగంలోకి దింపి, ఘటనా స్థలిలో ఆధారాలను సేకరిస్తున్నారు. ఇంటిలో మృతదేహాలు ఒక్కో చోట పడి ఉండటంతో హత్యగానే భావిస్తున్నారు. మృతదేహాలను స్వాధీనం చేసుకున్న పోలీసులు.. వాటిని పోస్ట్‌మార్టం కోసం తరలించినట్టు తెలిపారు. వీరి శరీరాలపై ఉన్న గాయాలను బట్టి గొడ్డలితో దాడిచేసిన చంపిపట్టు ప్రాథమికంగా నిర్ధారించారు. పోస్ట్‌మార్టం నివేదిక వచ్చిన తర్వాత ఎలా మృతిచెందారో తెలుస్తుందని పేర్కొన్నారు.

Natural Star Nani: చిరంజీవి సినిమాకు వెళ్లి సైకిల్ పోగొట్టుకున్న నాని.. మళ్లీ మెగాస్టార్ దగ్గరనుంచే రాబట్టి..! – chiranjeevi meelo evaru koteeswarudu video clip goes viral on nani birthday

0


ప్రధానాంశాలు:

 • ‘మాస్టర్’ సినిమాకు వెళ్లి సైకిల్ పోగొట్టుకున్న నాని
 • ఈ విషయాన్ని నేరుగా చిరంజీవికే చెప్పిన నేచురల్ స్టార్
 • పోగొట్టుకున్న సైకిల్ తాను ఇప్పిస్తానని హామీ ఇచ్చిన మెగాస్టార్

చిన్న నాటి మధుర జ్ఞాపకాలు ప్రతి ఒక్కరి జీవితంలో ఉంటాయి. వీటికి సినిమా స్టార్లు అతీతమేమీ కాదు. ప్రస్తుతం సూపర్ స్టార్లుగా కొనసాగుతున్న ఎంతో మంది హీరోలు చిన్న తనంలో అల్లరి చేసిన వాళ్లే.. సినిమాలకు వెళ్లినవాళ్లే.. టిక్కెట్ల కోసం చొక్కాలు చించుకున్నవాళ్లే. ఇలాంటి వాళ్లలో నేచురల్ స్టార్ నాని ఒకరు. మెగాస్టార్ చిరంజీవి అంటే పడిచచ్చిపోయే నాని.. తన చిన్నతనంలో చిరంజీవి సినిమాకు వెళ్లి తనకు ఎంతో ఇష్టమైన సైకిల్‌ను కోల్పోయారట. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా మెగాస్టార్‌కు చెప్పారు. నాని పుట్టినరోజు సందర్భంగా ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

నేడు (ఫిబ్రవరి 24) నాని పుట్టినరోజు. ఈ సందర్భంగా ఆయన అభిమానులు, సినీ ప్రముఖులు సోషల్ మీడియా ద్వారా నానికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఈ క్రమంలో సోషల్ మీడియాలో ఒక వీడియో వైరల్ అవుతోంది. ఇది ‘మీలో ఎవరు కోటీశ్వరుడు’ క్లిప్పింగ్. ‘మీలో ఎవరు కోటీశ్వరుడు’ రియాలిటీ గేమ్ షోకి మొదట అక్కినేని నాగార్జున హోస్ట్‌గా వ్యవహరించారు. మూడు సీజన్లను నాగార్జున హోస్ట్ చేయగా.. 2017లో ప్రసారమైన నాలుగో సీజన్‌కు మెగాస్టార్ చిరంజీవి వ్యాఖ్యాతగా వ్యవహరించారు. చిరంజీవి హోస్ట్ చేసిన ఒక ఎపిసోడ్‌కి నేచురల్ స్టార్ నాని గెస్ట్‌గా విచ్చేశారు.

అతిథులు కూడా చిరంజీవి అడిగే ప్రశ్నలకు సమాధానాలు చెప్పి డబ్బులు గెలుచుకోవడం తెలిసిందే. అయితే, ‘మీలో ఎవరు కోటీశ్వరుడు’లో గెలిచిన డబ్బుతో మీరేం చేస్తారు అని నానిని చిరంజీవి అడిగారు. దీంతో తన చిన్ననాటి జ్ఞాపకాన్ని నాని గుర్తు చేసుకున్నారు. నాని కుటుంబం ఆయన చిన్నప్పుడే హైదరాబాద్‌లో స్థిరపడింది. అమీర్ పేట్ ఏరియాలో ఉండేవారు. తనకు సైకిల్ కావాలని గోల గోల చేస్తే.. హెరిక్యులస్ ఎంటీబీ సైకిల్ కొనిచ్చారట. అదే సమయంలో చిరంజీవి ‘మాస్టర్’ సినిమా విడుదల. అమీర్ పేట సత్యం థియేటర్‌లో సినిమా విడుదలవుతోంది.

మాల్దీవుల్లో భర్తతో ఎంజాయ్ చేస్తోన్న హాట్ బ్యూటీ.. బర్త్‌డే బోయ్‌తో స్వీట్ మెమొరీస్
తన ఇంటి నుంచి సత్యం థియేటర్ అర కిలోమీటర్ దూరం కావడంతో సైకిల్ వేసుకుని నాని వెళ్లారు. షోకి గంట ముందు గేట్లు ఓపెన్ చేస్తారు కాబట్టి ముందుగానే నాని వెళ్లారట. జనం విపరీతంగా ఉన్నారట.. తోపులాట జరుగుతోందట. టిక్కెట్ దొరుకుతుందో లేదో అనే టెన్షన్‌లో సైకిల్ దూరంగా పార్క్ చేసి గేటు వద్దకు పరుగులు తీశారట నాని. అయితే, ఈ కంగారులో సైకిల్‌కి తాళం వేయడం మరిచిపోయారు. మొత్తానికి తోపులాటలోనే లైన్‌లో నిలబడితే టిక్కెట్ దొరికింది. బయటికి వచ్చి చూస్తే సైకిల్ పోయింది. అయితే, మామూలుగా అయితే చాలా బాధపడేవాడినని.. కానీ ‘మాస్టర్’ టిక్కెట్ దొరికిన కిక్‌లో సైకిల్ పోయిన బాధ చిన్నదైపోయిందని నాని అన్నారు.

సినిమా చూసినంతసేపు ఏమీ అనిపించలేదని.. సినిమా అయిపోతున్న సమయంలో బాధ ప్రారంభమైందని నాని అన్నారు. దీంతో చిరంజీవి నవ్వు ఆపుకోలేకపోయారు. సంవత్సరం పాటు గోల చేస్తే కొనిచ్చిన సైకిల్ అట అది. సైకిల్ పోయింది కదా ఇప్పుడు ఎలా అని ఆలోచించి.. ఇంటి దగ్గర అబద్ధం చెప్పారట. సైకిల్ ఇంట్లోనే ఉండాలి నేను తీసుకెళ్లలేదు అని కవర్ చేశారట. అయితే, ఎప్పటికైనా చిరంజీవి ముందుకు వెళ్తే ఆయన్ని సైకిల్ అడగాలని ఆరోజే డిసైడ్ అయిపోయానని నాని మెగాస్టార్‌తో చెప్పారు. ‘మీలో ఎవరు కోటీశ్వరుడు’లో డబ్బులు గెలిస్తే సైకిల్ కోసం రూ.5 వేలు తీసుకొని మిగిలినవి చారిటీకి ఇచ్చేస్తానన్నారు.

జోరుమీదున్న వరంగల్ శ్రీను.. ‘సుల్తాన్’ కూడా ఆయన చేతికే!
‘‘భలే భలే మగాడివోయ్ సినిమా ఆడియో రిలీజ్‌లో అరవింద్ గారిని అడిగాను. మాస్టర్ సినిమాకు మీరు ప్రొడ్యూసర్.. కాబట్టి నా సైకిల్ నాకు ఇవ్వండి అన్నాను. తప్పకుండా గ్యారంటీ అని ఆరోజు మైక్‌లో చెప్పేసి ఇప్పటి వరకు నాకు సైకిల్ ఇవ్వలేదు. అందుకే డైరెక్ట్‌గా నేను మిమ్మల్ని అడుగుతున్నాను’’ అని చిరంజీవితో నాని అన్నారు. అరవింద్‌ను ఒప్పించి నానికి హెరుక్యులెస్ సైకిల్ ఇప్పించే బాధ్యత నాది అని చిరంజీవి మాటిచ్చారు. ఆ మాట ప్రకారమే నాని పోగొట్టుకున్న దాని కంటే ఖరీదైన గేర్ సైకిల్‌ను నాని ఇంటికి పంపారు. ఇది మూడేళ్ల క్రితం జరిగిన విషయం. నాని పుట్టినరోజు సందర్భంగా మళ్లీ ఇప్పుడు వైరల్ అవుతోంది.

President Rule In Puducherry: పుదుచ్చేరిలో రాష్ట్రపతి పాలనకు సిఫార్సు.. కేంద్రానికి ఎల్జీ లేఖ – lieutenant governor tamilisai soundararajan has recommended president’s rule in puducherry

0


ప్రధానాంశాలు:

 • పుదుచ్చేరిలో ప్రభుత్వ ఏర్పాటుకు విపక్షాలు విముఖత.
 • రాష్ట్రపతి పాలనకు సిఫార్సు చేసిన లెఫ్టినెంట్ గవర్నర్.
 • నేడో రేపో నిర్ణయం తీసుకోనున్న కేంద్ర ప్రభుత్వం.

పుదుచ్చేరిలో రాష్ట్రపతి పాలన విధించాలని కేంద్రానికి లెఫ్టినెంట్ గవర్నర్ తమిళసై సౌందరరాజన్ బుధవారం సిఫార్సు చేశారు. రెండు రోజుల కిందట కాంగ్రెస్-డీఎంకే సంకీర్ణ ప్రభుత్వం విశ్వాస పరీక్షలో విఫలం కావడంతో ముఖ్యమంత్రి నారాయణసామి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. ప్రభుత్వ ఏర్పాటుకు విపక్షాలు ముందుకు రాకపోవడంతో రాష్ట్రపతి పాలనకు గవర్నర్ సిఫార్సు చేశారు. అటు, పుదుచ్చేరి అసెంబ్లీని రద్దుచేస్తూ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ మంగళవారం ఉత్తర్వులు జారీచేశారు.

బీజేపీ, దాని మిత్రపక్షాలు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి ముందుకు రాకపోవడంతో రాష్ట్రపతి పాలన కోరుతూ లెఫ్టినెంట్ గవర్నర్ కేంద్రానికి లేఖ రాశారు. ఈ లేఖపై కేంద్ర క్యాబినెట్ బుధవారం నిర్ణయం తీసుకోనుంది. అసెంబ్లీ ఎన్నికలకు రెండు నెలల ముందే కాంగ్రెస్ ప్రభుత్వం కూలిపోవడంతో బీజేపీ నాయకత్వంలోని విపక్షాలు కొత్తగా ప్రభుత్వం ఏర్పాటుకు విముఖత ప్రదర్శించాయి. మొత్తం 33 సభ్యులన్న పుదుచ్చేరి అసెంబ్లీలో అధికార కాంగ్రెస్-డీఎంకే కూటమికి చెందిన మంత్రులు, ఎమ్మెల్యేలు ఆరుగురు రాజీనామా చేయడంతో సభ్యుల సంఖ్య 27కి పడిపోయింది.

ఇద్దరు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు రాజీనామా చేసి బీజేపీలో చేరిపోయారు. దీంతో కాంగ్రెస్ మెజార్టీ 11కి పడిపోవడంతో సోమవారం నిర్వహించిన బలపరీక్షలో సీఎం ఓడిపోయారు. అనంతరం సీఎం తన పదవికి రాజీనామా చేసి, లేఖను లెఫ్టినెంట్ గవర్నర్ తమిళసై సౌందరరాజన్‌‌కు అందజేశారు. అయితే, విపక్షాలతో కలిసి ప్రభుత్వాన్ని కూల్చడానికి కేంద్రం కుట్రలు పన్నిందని దుయ్యబట్టారు. మాజీ లెఫ్టినెంట్ గవర్నర్ కిరణ్ బేడీ, కేంద్ర ప్రభుత్వం, విపక్షాలు కలిసి ప్రభుత్వాన్ని కూల్చడానికి శతవిధాల ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాయని అన్నారు.

delhi covid restrictions: ఆ ఐదు రాష్ట్రాల వారికి కోవిడ్ నెగటివ్ సర్టిఫికెట్ తప్పనిసరి.. ఢిల్లీ సంచలన నిర్ణయం! – delhi to make negative covid report must for arrivals from 5 states: sources

0


దేశంలో మరోసారి కోవిడ్-19 కేసులు పెరగడంతో ఆందోళన వ్యక్తమవుతోంది. ముఖ్యంగా మహారాష్ట్ర, కేరళ, చత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్, పంజాబ్‌లో మహమ్మారి విజృంభిస్తోంది. ఈ నేపథ్యంలో ఢిల్లీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ ఐదు రాష్ట్రాల నుంచి ఢిల్లీకి వచ్చే వ్యక్తులు తప్పనిసరిగా కోవిడ్-19 నెగెటివ్ సర్టిఫికెట్ కలిగి ఉండాలనే నిబంధన తీసుకొచ్చింది. శుక్రవారం (ఫిబ్రవరి 26) నుంచి ఈ ఉత్తర్వులు అమలవుతాయని స్పష్టం చేసింది. ఆ రాష్ట్రాల నుంచి ఢిల్లీకి వస్తే తప్పనిసరిగా ఆర్టీ-పీసీఆర్ పరీక్షలను చేయించుకుని, నెగెటివ్ సర్టిఫికెట్ తప్పనిసరిని తెలిపింది.

ఈ నిబంధనలు ఫిబ్రవరి 26 నుంచి మార్చి 15 వరకు అమల్లో ఉంటాయని తెలిపింది. అయితే, దీనిపై ఇంకా అధికారిక ఉత్తర్వులు వెలువడాల్సి ఉంది. బుధవారం సాయంత్రంలోగా ఈ ఉత్తర్వులను వెలువరించనున్నారు. మహారాష్ట్ర, కేరళ, చత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్, పంజాబ్‌‌లో గత వారం రోజుల నుంచి పాజిటివ్ కేసులు 86 శాతం మేర పెరగడంతోనే ఢిల్లీ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్టు విశ్వసనీయ వర్గాలు పేర్కొన్నాయి.

ఇక, మహారాష్ట్ర, కేరళ రాష్ట్రాల్లో రెండు రకాల కొత్త కరోనా వేరియంట్లను గుర్తించినట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రకటించింది. N440K, E484K అనే రెండు రకాల వేరియంట్లను గుర్తించినట్లు మంగళవారం తెలిపింది. ఈ కొత్త వైరస్ వేరియంట్లను మహారాష్ట్రలో గుర్తించినట్లు నీతి ఆయోగ్ సభ్యుడు డాక్టర్ వీకే పాల్ తెలిపారు. మహారాష్ట్రతో పాటు కేరళ, తెలంగాణ రాష్ట్రాల్లోనూ ఇదే రకం వైరస్ వేరియంట్లను గుర్తించినట్లు ఆయన వెల్లడించారు.

దేశంలో గుర్తించిన కొత్త రకం కరోనా వైరస్ వేరియంట్స్, వాటి ప్రమాద తీవ్రత గురించి అధికారులతో ప్రధాని మోదీ సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో కేంద్ర ఆరోగ్య శాఖ కార్యదర్శి రాజేశ్ భూషణ్ సహా పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు. దేశంలో 187 యూకే రకం కరోనా వైరస్ కేసులు, 6 సౌతాఫ్రికా స్ట్రెయిన్ కేసులతో పాటు బ్రెజిల్ రకానికి చెందిన ఒక కేసును గుర్తించినట్లు నీతి ఆయోగ్ సభ్యుడు డాక్టర్ వీకే పాల్ తెలిపారు

Bipasha Basu: మాల్దీవుల్లో భర్తతో ఎంజాయ్ చేస్తోన్న హాట్ బ్యూటీ.. బర్త్‌డే బోయ్‌తో స్వీట్ మెమొరీస్ – bipasha basu celebrates hubby karan singh grover birthday in maldives

0


ప్రధానాంశాలు:

 • మాల్దీవుల్లో భర్త బర్త్‌డేను సెలబ్రేట్ చేస్తున్న బిపాసా బసు
 • సోషల్ మీడియాలో ఫొటోలు షేర్ చేసిన హీరోయిన్
 • ఐదేళ్ల క్రితం ఒక్కటైన బిపాస, కరణ్ సింగ్

బాలీవుడ్ హాట్ బ్యూటీ బిపాసా బసు ప్రస్తుతం భర్త కరణ్ సింగ్ గ్రోవర్‌తో కలిసి మాల్దీవుల్లో విహరిస్తున్నారు. భర్త పుట్టినరోజు (ఫిబ్రవరి 23)ను మాల్దీవుల్లో సెలబ్రేట్ చేసిన బిపాసా బసు.. అక్కడ తీసుకున్న రొమాంటిక్ ఫొటోలను ఇన్‌స్టాగ్రామ్ ద్వారా అభిమానులతో పంచుకుంటున్నారు. ఈ ఫొటోల్లో బిపాసా బసు సూపర్ హాట్‌గా కనిపిస్తున్నారు. ఒక ఏడాదిలో తనకు ఎంతో ఇష్టమైన రెండో రోజు తన భర్త పుట్టినరోజు అని బిపాసా బసు పేర్కొన్నారు.

బిపాసా బసు, కరణ్ సింగ్ తొలిసారి 2014లో ‘ఎలోన్’ సినిమాలో నటించారు. అప్పుడే వారు ప్రేమలో పడ్డారని అంటుంటారు. రెండేళ్ల పాటు సహజీవనం చేసిన బిపాస, కరణ్.. 2016 ఏప్రిల్ 30న పెళ్లి బంధంతో ఒక్కటయ్యారు. బాలీవుడ్ అతిరథ మహారథుల ఆధ్వర్యంలో బిపాస, కరణ్ వివాహం అంగరంగ వైభవంగా జరిగింది. సల్మాన్ ఖాన్, షారుఖ్ ఖాన్, డినో మోరియా, బచ్చన్ ఫ్యామిలీ, సంజయ్ దత్, సోనమ్ కపూర్, రణ్‌బీర్ కపూర్, ప్రీతి జింటా, సుష్మితా సేన్, బాబీ డియోల్, రితేష్ దేశ్‌ముఖ్ తదితరులు బిపాస, కరణ్ వెడ్డింగ్ రిసెప్షన్‌లో పాల్గొన్నారు.

ప్రియాంక చోప్రా గర్భవతి.. ఆ డ్రెస్ వేసుకుని బేబీ బంప్‌ను దాచేసిందా!!
2001లో వచ్చిన బాలీవుడ్ మూవీ ‘అజ్నబీ’తో వెండితెరకు పరిచయమైన బిపాసా బసు.. తొలి సినిమాతో ఫిల్మ్ ఫేర్ అవార్డ్ సొంతం చేసుకున్నారు. 2002లో మహేష్ బాబు ‘టక్కర దొంగ’లో నటించారు. తెలుగులో ఆమె ఏకైక సినిమా ఇది. ఆ తరవాత హిందీలో బాగా బిజీ అయిపోయారు బిపాస. తమిళ్‌లో విజయ్ సరసన ఒక సినిమాలో నటించారు. హిందీతో పాటు ఒక ఇంగ్లిష్, ఒక బెంగాలీ సినిమాలోనూ బిపాస నటించారు. బిపాస ఆఖరి సినిమా ‘ఎలోన్’.

bomb attack in bengal: బెంగాల్: టీఎంసీ నేతలపై బాంబుదాడి.. ఒకరు మృతి, ఇద్దరి పరిస్థితి విషమం – tmc worker killed, 2 injured in bomb attack in medinipur in west bengal

0


ప్రధానాంశాలు:

 • పశ్చిమ్ బెంగాల్‌లో టీఎంసీ కార్యకర్తలపై బాంబు దాడి.
 • మంగళవారం రాాత్రి దాడికి తెగబడిన దుండగులు.
 • దాడి వెనుక బీజేపీ హస్తం ఉందని టీఎంసీ నేతల ఆరోపణ.

పశ్చిమ్ బెంగాల్‌లో తృణమూల్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలపై మంగళవారం రాత్రి బాంబు దాడి జరిగింది. మేదినీపూర్ జిల్లాలో జరిగిన ఈ దాడిలో ఓ టీఎంసీ కార్యకర్త మృతిచెందగా.. మరో ఇద్దరు గాయపడ్డారు. టీఎంసీ కార్యకర్తలపై దుండగులు బాంబులు విసిరి, తుపాకులతో కాల్పులకు పాల్పడ్డారు. నారాయణ్‌గఢ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని అభిరామ్‌పూర్ గ్రామం వద్ద కల్వర్ట్‌పై టీఎంసీ కార్యకర్తలు కూర్చుని ఉండగా.. ద్విచక్రవాహనంపై వచ్చిన ముగ్గురు వారిపై బాంబులు విసిరారు. రాత్రి 9 గంటల ప్రాంతంలో ఈ ఘటన చోటుచేసుకుంది.

ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన టీఎంసీ కార్యకర్త షౌభిక్ దౌలై మృతిచెందారు. మరో ఇద్దరికి తీవ్ర గాయాలైనట్టు పోలీసులు తెలిపారు. కల్వర్ట్‌పై కూర్చుని ఉండగా దుండగులు బాంబు విసిరారని, అక్కడ నుంచి బాధితులు పారిపోతుండగా తుపాకితో కాల్పులు జరిపిపట్టు పేర్కొన్నారు. వా ఘటనలో గాయపడిన ముగ్గురినీ చికిత్స కోసం ఆస్పత్రికి తరలించగా.. అప్పటికే దౌలై మృతిచెందినట్టు వైద్యులు ధ్రువీకరించారు. మిగతా ఇద్దరి పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన చికిత్స కోసం మేదినీపూర్ మెడికల్ కాలేజ్ ఆస్పత్రికి తరలించినట్టు తెలిపారు.

ఈ ఘటన వెనుక బీజేపీ హస్తం ఉందని టీఎంసీ నేతలు ఆరోపిస్తున్నారు. అయితే, దీనిని బీజేపీ నేతలు ఖండించారు. టీఎంసీలో అంతర్గపోరుకు ఇది నిదర్శనమని, ఈ దాడితో తమకు ఎటువంటి సంబంధం లేదని మేదినీపూర్ జిల్లా బీజేపీ అధ్యక్షుడు సమిత్ దాస్ వ్యాఖ్యానించారు. మరోవైపు, ఈ ఘటనతో అభిరామ్‌పూర్ ప్రాంతంలో ఉద్రిక్తతలు నెలకున్నాయి. ఎటువంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా భారీగా పోలీసులను మోహరించారు. ఘటనపై కేసు నమోదుచేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. నిందితుల కోసం గాలిస్తున్నారు.

Warangal Srinu: జోరుమీదున్న వరంగల్ శ్రీను.. ‘సుల్తాన్’ కూడా ఆయన చేతికే! – warangal srinu aquires karthi sulthan telugu theatrical rights

0


ప్రధానాంశాలు:

 • ‘క్రాక్’ సినిమాను డిస్ట్రిబ్యూట్ చేసిన వరంగల్ శ్రీను
 • దిల్ రాజుపై సంచలన వ్యాఖ్యలు చేసిన శ్రీను
 • వరుసగా సినిమాలు కొనుగోలు చేస్తూ జోరుమీదున్న డిస్ట్రిబ్యూటర్

ప్రముఖ నిర్మాత, డిస్ట్రిబ్యూటర్ దిల్ రాజు ఆయన తమ్ముడు శిరీష్‌పై సంచలన వ్యాఖ్యలు చేయడం ద్వారా ఓవర్‌నైట్ పాపులారిటీ సంపాదించారు నైజాం డిస్ట్రిబ్యూటర్ వరంగల్ శ్రీను. నైజాం ఏరియాలో దిల్ రాజు, శిరీష్ నియంతల్లా వ్యవహరిస్తున్నారని.. థియేటర్లన్నీ వారి కనుసన్నల్లో నడుస్తున్నాయని తీవ్ర ఆరోపణలు చేశారు. వరంగల్ శ్రీను చేసిన వ్యాఖ్యలు ఇండస్ట్రీలో పెద్ద సంచలనమే సృష్టించాయి. అయితే, దిల్ రాజుపై వరంగల్ శ్రీను ఫైర్ అయినప్పటి నుంచీ ఆయన వరుస పెట్టి సినిమాలను కొనుగోలు చేస్తుండటం విశేషం.

‘క్రాక్’ను నైజాంలో విడుదల చేసి బ్లాక్ బస్టర్ అందుకున్న వరంగల్ శ్రీను.. ఆ తరవాత ‘నాంది’, ‘విశాల్ చక్ర’ సినిమాలను విడుదల చేసి హిట్ కొట్టారు. ప్రస్తుతం ఆయన చేతిలో చాలా సినిమాలే ఉన్నాయి. నితిన్ ‘చెక్’ సినిమా నైజాం రైట్స్‌ను వరంగల్ శ్రీను కొనుగోలు చేశారు. ఈ సినిమా ఈనెల 26న విడుదలవుతోంది. అలాగే ‘విరాటపర్వం’, ‘టక్ జగదీష్’, ‘పుష్ప’ నైజాం ఏరియా డిస్ట్రిబ్యూషన్ హక్కులను వరంగల్ శ్రీను సొంతం చేసుకున్నట్టు సమాచారం.

‘అక్షర’ మెగా ఫ్యాన్స్ తీసిన సినిమా.. సపోర్ట్ చేయడం నా బాధ్యత: సాయి ధరమ్ తేజ్
అంతేకాకుండా, చిరంజీవి ‘ఆచార్య’ సినిమా నైజాం హక్కులను కూడా ఆయనే కొనుగోలు చేసినట్టు ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి. దీనిక కోసం ఆయన భారీగానే వెచ్చించినట్టు తెలుస్తోంది. అంతేకాదు, మైత్రీ మూవీ మేకర్స్ నుంచి రాబోయే చిత్రాలన్నింటినీ నైజాంలో వరంగల్ శ్రీనే కొనుగోలు చేస్తున్నారని టాక్. ఇదిలా ఉంటే, తాజాగా వరంగల్ శ్రీను ఖాతాలో మరో సినిమా వచ్చి చేరింది. తమిళ స్టార్ కార్తి హీరోగా నటించిన తాజా చిత్రం ‘సుల్తాన్’. తెలుగులోనూ అదే పేరుతో విడుదలవుతోంది. ఈ సినిమా తెలుగు థియేట్రికల్ రైట్స్‌ను వరంగల్ శ్రీను కొనుగోలు చేశారు. ఏపీ, తెలంగాణలో ఆయన విడుదల చేస్తున్నారు.

రూ.7.30 కోట్లకు ‘సుల్తాన్’ థియేట్రికల్ రైట్స్‌ను వరంగల్ శ్రీను కొనుగోలు చేసినట్టు సమాచారం. దీనిపై జీఎస్టీ అదనం. ‘సుల్తాన్’ టీజర్ విడుదలైనప్పటి నుంచీ ఈ సినిమాపై అంచనాలు పెరిగాయి. అంతేకాకుండా రష్మిక మందన ఈ సినిమాలో హీరోయిన్ కావడం మరో ఆకర్షణ. ఆమె నటించిన తొలి తమిళ చిత్రమిది. బక్కియరాజ్ కన్నన్ దర్శకత్వం వహించిన ఈ సినిమాను డ్రీమ్ వారియర్ పిక్చర్స్ సంస్థ నిర్మిస్తోంది. ఏప్రిల్ 2న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వస్తోంది.

Your Honour: ఇది అమెరికా సుప్రీంకోర్టు కాదు.. యువర్ హానర్ అని సంబోధించవద్దు: లా స్టూడెంట్‌కు సీజేఐ సూచన! – not us supreme court: apex court judges on being called your honour

0


ప్రధానాంశాలు:

 • జడ్జిలను యువర్ హానర్ అని సంబోధించిన లా స్టూడెంట్.
 • ఇది అమెరికా సుప్రీంకోర్టు కాదంటూ ధర్మాసనం అభ్యంతరం.
 • కేవలం మెజిస్టీరియల్ కోర్టులోనే ఈ పదం వాడాలని సూచన.

ఓ కేసులో హాజరైన లా స్టూడెంట్ న్యాయమూర్తులను‘యువర్ హానర్’ అని సంబోధించడం పట్ల సర్వోన్నత న్యాయస్థానం అభ్యంతరం వ్యక్తం చేసింది. ఇది అమెరికా సుప్రీంకోర్టు కానందున న్యాయమూర్తులను ‘యువర్ హానర్’అని సంబోధించవద్దని సీజేఐ జస్టిస్ ఎస్‌ఏ బాబ్డే ధర్మాసనం సూచించింది. ‘మీరు మమ్మల్ని ‘యువర్ హానర్’ అని పిలవడం, యూఎస్ సుప్రీంకోర్టును దృష్టిలో ఉంచుకున్నట్లు కనిపిస్తుంది’ అని జస్టిస్ట్ ఎస్ఏ బాబ్డే, జస్టిస్ ఎస్ఏ బొపన్న, జస్టిస్ వీ రామసుబ్రమణియన్‌ల ధర్మాసనం వ్యాఖ్యానించింది.

ధర్మాసనం హెచ్చరికలతో తక్షణమే సదరు లా స్టూడెంట్ క్షమాపణ చెప్పాడు. తర్వాత ‘యువర్ లార్డ్‌షిప్’ అంటూ సంబోధించాడు. దీనిపై స్పందించిన ధర్మాసనం.. ఏది ఏమైనా కానీ, తగని పదాలను ఉపయోగించరాదని చీఫ్ జస్టిస్ సూచించారు. యుఎస్ సుప్రీంకోర్టు, ఇక్కడి మెజిస్టీరియల్ కోర్టులో న్యాయమూర్తులను ‘యువర్ హానర్’అని సంబోధించవచ్చు కానీ భారత సుప్రీంకోర్టులో కాదని ధర్మాసనం పేర్కొంది.

వ్యక్తిగతంగా హాజరైన లా స్టూడెంట్‌ను మీ కేసు ఏమిటని ధర్మాసనం ప్రశ్నించగా.. క్రిమినల్ అధికార పరిధిలోని న్యాయవ్యవస్థ మౌలిక సదుపాయాలను బలోపేతం చేయాలని ఈ సందర్భంగా అతడు విజ్ఞప్తి చేశాడు. దీనిపై స్పందించిన ధర్మాసనం.. ఇప్పటికే ఈ అంశం సుప్రీంకోర్టు వద్ద పెండింగ్‌లో ఉందని తెలుసా? అని ప్రశ్నించింది. న్యాయవ్యవస్థ మౌలిక సదుపాయాలను దశలవారీగా బలోపేతం చేయడానికి సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసిందని పేర్కొంది.

మీరు ఈ అంశంపై కోర్టుకు వచ్చే ముందు ఎటువంటి హోమ్ వర్క్ చేయలేదని తెలుస్తోందని లా స్టూడెంట్‌ను ఉద్దేశించి వ్యాఖ్యలు చేసింది. మాలిక్ మజార్ సుల్తాన్, యూపీఎస్సీ కేసులో న్యాయవ్యవస్థ మౌలిక సదుపాయాల బలోపేతం కోసం కేంద్రం, వివిధ రాష్ట్ర ప్రభుత్వాలు, హైకోర్టులకు ఆదేశాలు జారీచేశామని, ఇది ప్రస్తుతం పెండింగ్‌లో ఉందని పేర్కొంది. తర్వాత కేసును నాలుగు వారాలు వాయిదా వేసిన న్యాయస్థానం.. వచ్చే విచారణ సమయానికి పూర్తిస్థాయి సంసిద్ధంగా రావాలని సూచించింది.