Home Blog Page 2

anasuya bharadwaj: నా ఫేవరేట్ ప్లేస్ ఇదే.. రోజూ రెండు మూడు గంటలు ఇక్కడే గడుపుతా: అనసూయ – anasuya bharadwaj shows her favorite place in her house and shares some tips

0


ప్రధానాంశాలు:

  • ‘మై ఫేవరేట్ ప్లే’ వీడియోను యూట్యూబ్‌లో పెట్టిన అనసూయ
  • బాల్కనీలో చిన్న వ్యాయామశాలను ఏర్పాటుచేసుకున్న యాంకర్
  • అక్కడే రోజూ రెండు మూడు గంటలు గడుపుతానన్న నటి

అనసూయ భరద్వాజ్.. తెలుగు రాష్ట్రాల్లో ఈ పేరు తెలియని బుల్లితెర, వెండితెర ప్రేక్షకులు ఉండరు అంటే అతిశయోక్తికాదు. అంత బాగా ఆమె ప్రేక్షకులకు దగ్గరైపోయారు. ఒకవైపు టీవీలో షోలు చేస్తూ.. మరోవైపు సినిమాల్లో నటిస్తూ చాలా బిజీగా ఉన్నారు. ఒక వైపు ఫ్యామిలీని, ఇంటిని చూసుకుంటూ మరోవైపు తన ప్రొఫెషనల్ వర్క్‌కు న్యాయం చేస్తూ సమయాన్ని చాలా బాగా మ్యానేజ్ చేస్తూ జీవిస్తున్నారు అనసూయ. తాను ఎవరి సలహాలు తీసుకోనని.. తనకు నచ్చినట్టు తాను ఉంటానని ఎప్పుడూ చెప్పే అనసూయ, తాజాగా ఆమె యూట్యూబ్‌లో అప్‌లోడ్ చేసిన వీడియోలోనూ తన అభిమానులకు అదే చెప్పారు.

టీవీ, సినిమాలతో పాటు సోషల్ మీడియా ద్వారా కూడా అనసూయ అభిమానులతో ఎప్పటికప్పుడు టచ్‌లో ఉంటున్నారు. ఇన్‌స్టాగ్రామ్, యూట్యూబ్ ద్వారా ఆమె ఫ్యాన్స్‌ను పలకరిస్తూనే ఉన్నారు. ఇన్‌స్టాగ్రామ్‌లో ఫొటోషూట్‌లు అప్‌లోడ్ చేస్తూ యువతకు నయనానందాన్ని కలిగిస్తున్నారు. ఇక యూట్యూబ్ ద్వారా తన లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన వీడియోలను పంచుకుంటున్నారు. తాజాగా యూట్యూబ్‌లో అనసూయ ఒక వీడియో అప్‌లోడ్ చేశారు. ఈ వీడియో ద్వారా తన ఇంట్లో తనకు చాలా ఇష్టమైన ప్రదేశాన్ని ప్రేక్షకులకు పరిచయం చేశారు.

రవికృష్ణతో పెళ్లి.. నా ఫ్యామిలీ చాలా డిస్టర్బ్ అయ్యింది: ‘ఆమె కథ’ నటి నవ్య స్వామి ఆవేదన
అనసూయకు తన ఇంట్లో బాల్కనీ ఏరియా అంటే చాలా ఇష్టమట. ఆ బాల్కనీ ప్లేస్‌ను చాలా అందంగా అలంకరించుకున్నారు అనసూయ. ఉదయం, సాయంత్రం వ్యాయామం చేయడానికి చిన్న వ్యాయామశాలను ఏర్పాటు చేసుకున్నారు. ఒక వుడెన్ డైనింగ్ టేబుల్, సోఫా, పక్షులు, ఇంటిలోపల పెంచుకునే చిన్న చిన్న మొక్కలతో బాల్కనీ ఏరియా చాలా అందంగా ఉంది. అందుకే ఇక్కడే రోజూ ఆమె రెండు మూడు గంటలు గడుపుతారట. ఒకప్పుడు జాగింగ్ కోసం బయట పార్క్‌కు వెళ్లేదాన్ని అని.. అయితే, బయటకు వెళ్లడం వల్ల తనతో పాటు పార్క్‌లో ఉన్నవాళ్లు ఇబ్బంది పడుతున్నారని అందుకే ఇంట్లోనే వ్యాయామశాలను ఏర్పాటు చేసుకున్నానని అనసూయ వెల్లడించారు. ఇంకా అనసూయ చెప్పిన విశేషాలు ఈ వీడియోలోనే చూడొచ్చు.

యాంకర్ అనసూయ ఫేవరేట్ ప్లేస్ ఇదే..!

Corona Vaccine: కేంద్రం గుడ్ న్యూస్: మార్చి 1 నుంచి వారందరికీ ఉచితంగా కరోనా వ్యాక్సిన్ – those age of above 60 and 45 years with comorbidities will get free covid vaccination form march 1

0


India Vaccination: దేశంలో 60 ఏళ్లు దాటిన వారందరికీ మార్చి 1 నుంచి ఉచితంగా కరోనా వ్యాక్సిన్ ఇవ్వనున్నట్లు కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. దీర్ఘకాలిక సమస్యలతో బాధపడతున్న 45 ఏళ్ల వారందరికీ కూడా ఫ్రీగా టీకా ఇవ్వనున్నట్లు ప్రకటించింది.

 

మొతెరాకు మోదీ పేరు.. ఇది సర్దార్‌జీకి అవమానం కాదా, పటేల్ ఫైర్

0



మొతెరా క్రికెట్ స్టేడియం పేరు మార్పు చర్చనీయాంశంగా మారింది. అహ్మదాబాద్‌లోని ఈ స్టేడియాన్ని ఆధునికీకరించారు. స్టేడియం కెపాసిటీని పెంచారు. 1,10,000 వీక్షకుల కెపాసిటీతో ప్రపంచంలోనే అతిపెద్ద మైదానంగా మొతెరా నిలిచింది. భారత్-ఇంగ్లండ్ మధ్య మూడో టెస్టు నేపథ్యంలో ఈ స్టేడియాన్ని రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ బుధవారం (ఫిబ్రవరి 24) ప్రారంభించారు.

మొతెరా క్రికెట్ స్టేడియాన్ని ఇప్పటివరకు స్టేడియంగా పిలిచేవారు. అయితే.. ఆధునికీకరించిన తర్వాత దీనికి నరేంద్ర మోదీ మైదానంగా పేరు పెట్టారు. కొంత మంది దీన్ని తప్పుబడుతున్నారు. ఇది సర్దార్ పటేల్‌ను అవమానించడమేనని విమర్శిస్తున్నారు. కాంగ్రెస్ నేత హార్దిక్ పటేల్ ఈ అంశంపై ఘాటు వ్యాఖ్యలు చేశారు.

‘సర్దార్ పటేల్‌పై ఈగ వాలనివ్వని బీజేపీ ఇప్పుడు సర్దార్జీని అవమానిస్తోంది. సర్దార్ పటేల్ పేరుతో ఉన్న క్రికెట్ మైదానం పేరును నరేంద్ర మోదీ మైదానంగా మార్చారు. ఇది సర్దార్ పటేల్‌కు అవమానం కాదా? సర్దార్‌జీని అగౌరవపరిచే చర్యలను గుజరాత్ ప్రజలు ఎంతమాత్రం సహించరు’ అని హార్దిక్ పటేల్ ట్వీట్ చేశారు.

తమిళనాడు: మరో అస్త్రాన్ని బయటకు తీసిన అన్నాడీఎం.. వారికి ఫ్రీ బీమాా

0



తమిళనాడు అసెంబ్లీకి ఏప్రిల్-మే నెలల్లో ఎన్నికలు జరగనుండగా.. ప్రభుత్వం ఓటాన్ అకౌంట్ బడ్జెట్‌ను మంగళవారం ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. పూర్తిగా ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని బడ్జెట్‌లో ప్రజాకర్షక పథకాలకు పెద్దపీట వేశారు. బడ్జెట్‌లో నిరుపేద కుటుంబాలకు ఉచిత బీమా కోసం రూ.5,000 కోట్ల కేటాయించినట్టు డిప్యూటీ సీఎం తెలిపారు. దీని వల్ల దారిద్ర్య రేఖకు దిగువన ఉన్న 55.7 లక్షల కుటుంబాలకు లబ్ది చేకూరనుంది. అలాగే, రైతుల రుణమాఫీ కోసం రూ.12,110.74 కోట్ల కేటాయించారు.

ఎల్‌ఐసీ, యునైటెడ్‌ ఇండియా ఇన్స్యూరెన్స్‌ సంస్థల భాగస్వామ్యంతో ‘అమ్మ ప్రమాద బీమా’ పథకం రూపొందించినట్లు డిప్యూటీ సీఎం వెల్లడించారు. దీనికి నిధులను ప్రభుత్వమే భరిస్తుందనిచ, దారిద్య్రరేఖకు దిగువన ఉన్న 55.67 లక్షల కుటుంబాలు లబ్ధి పొందుతాయని పేర్కొన్నారు. కుటుంబ యజమాని సహజ మరణం పొందితే రూ.2 లక్షలు, ప్రమాదం కారణం మరణిస్తే రూ.4 లక్షలు, ప్రమాదంలో శాశ్వత అంగవైకల్యానికి గురైతే రూ.2 లక్షలు బీమా కింద అందజేయనున్నట్టు.

ఇక, 6 నుంచి 10వ తరగతి విద్యార్థులకు కంప్యూటర్‌ సైన్స్‌ పాఠ్యాంశాన్ని ప్రవేశపెడుతున్నట్లు ప్రకటించారు. రైతుల పంట రుణాల మాఫీకి తొలి విడతగా రూ.5 వేల కోట్లు కేటాయిస్తున్నట్లు పేర్కొన్నారు. 2021 మార్చి చివరికి రాష్ట్ర ప్రభుత్వ రుణభారం రూ.5.7 లక్షల కోట్లకు పెరుగుతుందని అంచనా వేస్తున్నట్లు వివరించారు. 2021-22 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి రెవెన్యూలోటు రూ.41,417 కోట్లుగా ఉంటుందని భావిస్తున్నట్లు తెలిపారు. తమిళనాడు వృద్ధిరేటు దేశ జీడీపీ వృద్ధిలో 7.7% తగ్గినట్లు అంచనా వేసినప్పటికీ, రాష్ట్ర రుణాలు రూ. 5.7 లక్షల కోట్లగా ఉంది.

గతేడాదితో పోలిస్తే అప్పులు రూ. 85,000 కోట్ల అదనంగా పెరిగాయి. రెవెన్యూ లోటు రూ.65,944 కోట్లు ఉండగా.. వచ్చే ఏడాది ఇది రూ.41,417 కోట్లుగా ఉంటుందని అంచనా వేస్తున్నారు. అటు బడ్జెట్‌పై ప్రతిపక్ష డీఎంకే విమర్శలు గుప్పించింది. అన్నాడీఎంకే సర్కారు హయాంలో రూ.5.70లక్షల కోట్ల రుణభారం ఉందని ఆర్థిక మంత్రి నిస్సిగ్గుగా వెల్లడించారని పేర్కొంది. ఈ ప్రభుత్వానికి అధికారంలో ఉండే అర్హతలేదని చెప్పడానికి ఈ ఒక్క ఉదాహరణ చాలని వ్యాఖ్యానించింది. రాష్ట్ర యంత్రాంగాన్ని, ఆర్థిక వ్యవస్థను ఈ ప్రభుత్వం నాశనం చేసిందని ధ్వజమెత్తారు.

Nitish Kumar: నువ్వు నా ఒడిలోనే ఆడుకున్నావ్.. అసెంబ్లీలో తేజస్వీని టీజ్ చేసిన నితీశ్! – you’ve played in my lap: bihar cm nitish kumar teases tejashwi yadav in assembly

0


ప్రధానాంశాలు:

  • అసెంబ్లీలో తేజస్వీ యాదవ్‌ను టీజ్ చేసిన నితీశ్.
  • గవర్నర్ ప్రసంగంపై చర్చ వేళ ఆసక్తికర వ్యాఖ్యలు.
  • సీఎం ప్రసంగానికి పదే పదే అడ్డుతగిలిన పత్రిపక్ష నేత

బిహార్ అసెంబ్లీలో ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ ప్రసంగానికి ప్రతిపక్ష నేత తేజస్వీ యాదవ్ పదే పదే అడ్డుతగలడంపై సీఎం ఒకింత అసహానికి గురయ్యారు. ఈ సందర్భంగా తేజస్వీ యాదవ్‌పై ఆయన చలోక్తులు విసిరారు. బీహార్ శాసనసభ బడ్జెట్ సమావేశాల్లో భాగంగా గవర్నర్ ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై చర్చ జరుగుతుండగా సీఎం నితీష్ కుమార్ ప్రసంగించారు. తన 15 ఏళ్ల పాలనలో ప్రభుత్వం సాధించిన విజయాలను ఏకరవు పెడుతూ నితీష్ కుమార్ సభలో మాట్లాడుతుండగా తేజస్వీ పలుసార్లు అడ్డుకున్నారు.

దీంతో సీఎం నితీష్ కుమార్‌కు చిర్రెత్తుకొచ్చింది. ‘ముందు నేను చెప్పేది వింటే దానివల్ల మీకు ప్రయోజనం ఉంటుంది, తర్వాత మీకు నచ్చినది చెప్పండి’ అంటూ వ్యాఖ్యానించారు. ‘నేను అటల్ బిహారి వాజ్‌పేయి హయాంలో కేంద్రమంత్రిగా ఉండగా.. అప్పటికి చిన్న పిల్లాడైన ప్రతిపక్ష నేత తేజస్వీయాదవ్ నా ఒడిలో ఆడుకున్నాడు’నితీష్ అన్నారు. నితీశ్ చమత్కరంగా మాట్లాడటంతో అసెంబ్లీలో ఒక్కసారిగా నవ్వులు పూసాయి. గత ఎన్నికల్లో (2017) జేడీయూ-రాష్ట్ర జనతాదళ్ కలిసి కూటమిగా పోటీచేసి విజయం సాధించాయి. సీఎంగా నితీష్ కుమార్, డిప్యూటీ సీఎంగా తేజస్వీయాదవ్‌లు పనిచేశారు.

సీఎం ప్రసంగం ముగిసిన తర్వాత తేజస్వీ యాదవ్ మాట్లాడుతూ.. బీజేపీ-జేడీయూ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. రాష్ట్రంలో నేరాలు పెరిగిపోయాయని, వాటిని అదుపుచేయడంలో ఎన్‌డీఏ ప్రభుత్వం విఫలమయ్యిందని దుయ్యబట్టారు. బీజేపీ దయాబిక్షతోనే నితీశ్‌ సీఎంగా కొనసాగుతున్నారని విమర్శించారు. గతేడాది నవంబరులో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీయేకి మొత్తం 125 సీట్లు రాగా.. బీజేపీకి 74 స్థానాలు, జేడీయూకి 43 స్థానాలు వచ్చాయి. అయితే, సీఎం పగ్గాలు నితీశ్‌కే కాషాయదళం అప్పగించిన విషయం తెలిసిందే.

అనంత్‌నాగ్ ఎన్‌కౌంటర్: నలుగురు ఉగ్రవాదులను మట్టుబెట్టిన సైన్యం

0



జమ్మూ కశ్మీర్‌‌లో ఉగ్రవాదుల ఏరివేత చర్యలను భద్రతా బలగాలు మరింత ముమ్మరం చేశాయి. నాలుగు రోజుల వ్యవధిలోనే ఏడుగురు ముష్కరులను సైన్యం మట్టుబెట్టింది. తాజాగా, బుధవారం ఉదయం అనంత్‌నాగ్ జిల్లాల్లో సైన్యం, ఉగ్రవాదుల మధ్య ఎదురుకాల్పులు చోటుచేసుకున్నాయి. శ్రీగుఫ్వారా వద్ద జరిగిన ఎన్‌కౌంటర్‌లో నలుగురు ముష్కరులు హతమైనట్టు కశ్మీర్ జోన్ పోలీసులు తెలిపారు. షాల్గుల్ అటవీ ప్రాంతంలో ఉగ్రవాదులున్నట్టు సమాచారం అందుకున్న సైన్యం అక్కడకు చేరుకుని తనిఖీలు చేపట్టింది.

మంగళవారం అర్ధరాత్రి దాటిన తర్వాత ఆ ప్రాంతాన్ని చుట్టుముట్టిన సైన్యం.. ఉగ్రవాదులు బయటకు వెళ్లకుండా అన్ని మార్గాలనూ మూసివేసింది. ఈ సమయంలో తీవ్రవాదులు కాల్పులు జరపడంతో అప్రమత్తమైన సైన్యం.. ఎదురు కాల్పులు ప్రారంభించింది. ఆ ప్రాంతంలో ఎటువంటి శాంతి భద్రతల సమస్య తలెత్తకుండా అదనపు బలగాలను రప్పించారు. ముందు జాగ్రత్తగా ఇంటర్నెట్ సేవలను నిలిపివేసినట్టు తెలుస్తోంది.

ఇండియన్ ఆర్మీ రాష్ట్రీయ రైఫిల్స్, సీఆర్పీఎఫ్, కశ్మీర్ పోలీసులు సంయుక్తంగా ఈ ఆపరేషన్ చేపట్టాయి. ఆ ప్రాంతంలో ఆపరేషన్ కొనసాగుతోందని, మరింత మంది ఉగ్రవాదులున్నట్టు భావిస్తున్నామని పోలీసులు వెల్లడించారు. షాల్గుల్ అటవీ ప్రాంతాన్ని భద్రతా బలగాలు జల్లెడపడుతున్నాయని తెలిపారు. ఎన్‌కౌంటర్‌లో హతమైన ఉగ్రవాదులను గుర్తించే ప్రక్రియ సాగుతోందని అన్నారు.

ఇక, ఫిబ్రవరి 19న శ్రీనగర్‌లోని బార్గుల్లా బాగ్ వద్ద దుస్తుల్లో తుపాకులు దాచుకుని వచ్చి పోలీసులపై ఉగ్రవాదులు కాల్పులకు తెగబడి ఇద్దర్ని పొట్టనబెట్టుకున్న విషయం తెలిసిందే. అదే రోజున బుద్గామ్ వద్ద జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఓ సైనికాధికారి అమరుడయ్యారు.

Rang De Release date: రంగులద్దుకుంటున్న ‘రంగ్ దే’.. ప్రచార సంబరాలు షురూ..! – nithiin, keerthy suresh starrer rang de completes shoot all set to release on 26th march

0


ప్రధానాంశాలు:

  • నితిన్, కీర్తి సురేష్ జంటగా ‘రంగ్ దే’
  • మార్చి 26న విడుదలవుతోన్న చిత్రం
  • ‘రంగ్ దే’ ప్రచార సంబరాలు షురూ..!

యూత్ స్టార్ నితిన్, ‘మహానటి’ కీర్తి సురేష్ తొలిసారి కలిసి నటించిన చిత్రం ‘రంగ్ దే’. పీడీవీ ప్రసాద్ సమర్పణలో సితార ఎంటర్‌టైన్మెంట్స్ బ్యానర్‌పై సూర్యదేవర నాగవంశీ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ‘తొలిప్రేమ’, ‘మిస్టర్ మజ్ను’ సినిమాలతో ప్రతిభావంతుడైన దర్శకుడిగా గుర్తింపు తెచ్చుకున్న వెంకీ అట్లూరి ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. తమన్ సంగీతం సమకూరుస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ తాజాగా పూర్తయింది. గత నాలుగు రోజులుగా ఓ పాటకు సంబంధించిన దృశ్యాలను చిత్రీకరించడంతో షూటింగ్ పూర్తి చేసుకుంది ఈ చిత్రం. ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుపుకుంటోంది.

‘తమ్ముడు’ నాని పుట్టినరోజు.. సినీ ప్రముఖుల నుంచి శుభాకాంక్షల వెల్లువ
షూటింగ్ పూర్తిచేసుకున్న విషయాన్ని చిత్ర నిర్మాణ సంస్థ సోషల్ మీడియా ద్వారా వెల్లడించింది. చిత్ర నిర్మాత సూర్యదేవర నాగవంశీ మాట్లాడుతూ ఈ ఏడాది మార్చి 26 నుంచి థియేటర్లలో ‘రంగ్ దే’ సంబరాలు షురూ అవుతాయని తెలిపారు. సకుటుంబ సమేతంగా చూడతగ్గ చిత్రంగా దర్శకుడు వెంకీ అట్లూరి ‘రంగ్ దే’ను తీర్చిదిద్దారని తెలిపారు. నితిన్, కీర్తి సురేష్ జంట వెండితెరపై కనువిందు చేయనుందన్నారు. ఇటీవల ‘రంగ్ దే’ సినిమా నుంచి విడుదలైన వీడియో, అలాగే ఒక పాటకు విశేష స్పందన వచ్చిన విషయం తెలిసిందే.
‘రంగ్ దే’కు ప్రముఖ సినిమాటోగ్రాఫర్ పి.సి.శ్రీరామ్ కెమెరా స్కిల్స్ మరో ప్రత్యేక ఆకర్షణ కానున్నాయి. అలాగే దేవిశ్రీ ప్రసాద్ సంగీతం మరో ఆకర్షణ. ఈ చిత్రంలో తారాగణం కూడా భారీగానే ఉంది. సీనియర్ నటుడు నరేష్, వినీత్, రోహిణి, కౌసల్య, బ్రహ్మాజీ, వెన్నెల కిషోర్, సత్యం రాజేష్, అభినవ్ గోమటం, సుహాస్, గాయత్రి రఘురామ్ తదితరులు నటించారు. కాగా, షూటింగ్ పూర్తిచేసుకున్న సందర్భంగా కీర్తి సురేష్ ట్వీట్ చేశారు. ‘రంగ్ దే’ టీమ్‌ను తాను చాలా మిస్ అవుతున్నానని పేర్కొన్నారు. ఒక జిఫ్ ఇమేజ్‌ను కూడా షేర్ చేశారు.

life lost due to covid: కరోనా ప్రభావం.. ప్రపంచం ఎన్ని కోట్ల జీవితకాలాన్ని నష్టపోయిందో తెలుసా? – over 20 million years of life lost worldwide due to coronavirus: says study

0


ప్రధానాంశాలు:

  • కోవిడ్-19 వ్యాప్తితో తల్లకిందులైన పరిస్థితులు.
  • ప్రపంచ జీవితకాలంపై తీవ్ర ప్రభావం చూపిన కరోనా.
  • కరోనా కారణంగా ప్రాణాలు కోల్పోయిన 25 లక్షల మంది.

కరోనా వైరస్ మహమ్మారి కారణంగా ఇప్పటి వరకు ప్రపంచ వ్యాప్తంగా 25 లక్షల మందికిపైగా ప్రాణాలు కోల్పోయారు. కోవిడ్ మరణాలతో కలిగే నష్టాన్ని అంచనా వేయడానికి చేపట్టిన అధ్యయనంలో విస్మయానికి గురిచేసే విషయాలు వెల్లడయ్యాయి. కోవిడ్ మహమ్మారి 25 లక్షల మందిని బలితీసుకోగా.. తత్ఫలితంగా సుమారు 2 కోట్ల ఏళ్ల జీవితకాలాన్ని ప్రపంచం నష్టపోయిందని అధ్యయనం పేర్కొంది. భారత్‌ సహా 81 దేశాలకు చెందిన కరోనా మరణాల సమాచారాన్ని విశ్లేషించిన అనంతరం అంతర్జాతీయ యూనివర్సిటీలు, పరిశోధన సంస్థలకు చెందిన పరిశోధకులు ఈ విషయాన్ని వెల్లడించారు.

అధ్యయన ఫలితాలను ‘సైంటిఫిక్ రిపోర్ట్స్’ జర్నల్‌లో ప్రచురించారు. కరోనా కారణంగా ప్రాణాలు కోల్పోయిన వ్యక్తి సరాసరి ఆయుష్షును లెక్కించిన పరిశోధకులు.. వారి కారణంగా 2,05,07,518 సంవత్సరాల జీవితకాలాన్ని కోల్పోయినట్టు అంచనా వేశారు. వ్యక్తిగతంగా సగటున 16 ఏళ్ల జీవితకాలం కోల్పోయినట్టు పేర్కొన్నారు. సాధారణ ఫ్లూ, హృద్రోగ వ్యాధుల వల్ల కలిగే ఇయర్స్ ఆఫ్ లైఫ్ లాస్ట్ (వైఎల్ఎల్) కంటే ఈ నష్టం 25 నుంచి 50 శాతం ఎక్కువని తేల్చారు. జీవిత కాలం కోల్పోయిన రేటు ఒక వ్యక్తి మరణించే వయసు, వారి ఆయుర్దాయం మధ్య వ్యత్యాసం.

సీజనల్ ఫ్లూ కారణంగా కోల్పోయిన జీవితకాలం రేటు కంటే కరోనా కారణంగా 2-9 రెట్లు ఎక్కువ కోల్పోయినట్టు అధ్యయనం పేర్కొంది. మరణాల సంఖ్య పరంగానే కాదు, కోల్పోయిన జీవితాల పరంగా కూడా కోవిడ్ మరణాల ప్రభావం ఎక్కువని మా ఫలితాలు ధ్రువీకరిస్తున్నాయి అని అధ్యయనవేత్తలు పేర్కొన్నారు. జీవితకాలం కోల్పోయినవారిలో 55 నుంచి 75 ఏళ్లవారు 44.9 శాతం, 55 ఏళ్లలోపు 30.2 శాతం, 75 ఏళ్లు దాటినవారు 25 శాతం ఉన్నట్టు అధ్యయనం తెలిపింది.

ఈ అధ్యయనంలో ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీ, అమెరికాలోని విస్కాన్‌సిన్-మాడిసన్ యూనివర్సిటీ, జర్మనీకి చెందిన మాక్స్‌ప్లాంక్ ఇనిస్టిట్యూట్ వంటి అంతర్జాతీయ యూనివర్సిటీల పరిశోధకులు పాల్గొన్నారు. కాగా, కరోనా మరణాలు సంభవిస్తున్న దేశాల్లో 44 శాతం పురుషుల జీవన కాలం నష్టమే ఎక్కువగా ఉన్నట్టు గుర్తించారు. అధ్యయనం నిర్వహించిన 35 దేశాలలో కనీసం తొమ్మిది నెలలకు సంబంధించిన సమాచార ఉంది.

ఈ సందర్భాలలో మహమ్మారి పూర్తి ప్రభావాలను లేదా కనీసం దాని మొదటి వేవ్‌ను సూచిస్తుంది. ఇతర దేశాలలో ఈ గణాంకాలు మరింత పెరుగుతున్నాయి. ‘ఈ ఫలితాలు కరోనా వైరస్ వ్యాప్తి కొనసాగుతున్న పరిస్థితికి అర్థం పడుతున్నాయి… ఈ అధ్యయనం 2021 జనవరి 6 నాటికి కోల్పోయిన జీవితాలపై కోవిడ్ -19 ప్రభావాన్ని తెలియజేస్తుంది’ అని అధ్యయనకర్తలు వ్యాఖ్యానించారు.

Nani Birthday wishes: ‘తమ్ముడు’ నాని పుట్టినరోజు.. సినీ ప్రముఖుల నుంచి శుభాకాంక్షల వెల్లువ – tollywood celebs showers birthday wishes on nani

0


ప్రధానాంశాలు:

  • 37వ ఏట అడుగుపెట్టిన నాని
  • ‘టక్ జగదీష్’ టీజర్‌తో ఫ్యాన్స్‌కు పండగ తీసుకొచ్చిన నేచురల్ స్టార్
  • నానీకి సోషల్ మీడియా ద్వారా విషెస్ చెబుతోన్న సెలబ్రిటీస్

స్వయంకృషితో ఎదిగి ప్రతిభావంతుడైన నటుడిగా తెలుగు ప్రేక్షకుకుల మన్ననలు అందుకుంటోన్న నేచురల్ స్టార్ నాని 37వ ఏట అడుగుపెట్టారు. గంటా నవీన్ బాబు అలియాస్ నాని ఈరోజు (ఫిబ్రవరి 24న) తన పుట్టినరోజును జరుపుకుంటున్నారు. ఈ ప్రత్యేకమైన రోజున నాని స్నేహితులు, శ్రేయోభిలాషులు, అభిమానులు, సినీ ప్రముఖులు ఆయనకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ప్రస్తుతం ట్విట్టర్ నాని పుట్టినరోజు శుభాకాంక్షల ట్వీట్లతో నిండిపోతోంది.

చిరంజీవి సినిమాకు వెళ్లి సైకిల్ పోగొట్టుకున్న నాని.. మళ్లీ మెగాస్టార్ దగ్గరనుంచే రాబట్టి..!
చాలా మంది సెలబ్రిటీలు ట్విట్టర్ ద్వారా నానీకి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ మెసేజ్‌లు పోస్ట్ చేస్తున్నారు. కీర్తి సురేష్, నివేదా థామస్, సునీల్, ఆది పినిశెట్టి, శ్రీవిష్ణు, రీతూ వర్మ, కార్తికేయ, సత్యదేవ్, రాశీ ఖన్నా, వెన్నెల కిషోర్, తమన్, దర్శకుడు శివ నిర్వాణ, నిర్మాత సూర్యదేవర నాగవంశీ, బండ్ల గణేష్.. ఇలా చాలా మంది సెలబ్రిటీలు ట్విట్టర్ ద్వారా నానీకి పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పారు. నటుడు సునీల్ అయితే ‘తమ్ముడు నాని’ అని సంబోధించారు.

ఇదిలా ఉంటే, నాని హీరోగా నటించిన ‘టక్ జగదీష్’ సినిమా విడుదలకు సిద్ధమవుతోంది. శివ నిర్వాణ దర్శకత్వంలో రూపొందుతోన్న ఈ సినిమా ఏప్రిల్ 23న ప్రేక్షకుల ముందుకు వస్తోంది. నేడు నాని పుట్టినరోజు సందర్భంగా నిన్న ‘టక్ జగదీష్’ టీజర్‌ను విడుదల చేశారు. ఈ టీజర్ విశేషంగా ఆకట్టుకుంటోంది. అన్ని హంగులతో కూడిన పూర్తి కుటుంబ కథాచిత్రంగా ‘టక్ జగదీష్’ రూపొందిందని టీజర్ చూస్తే అర్థమవుతోంది. ముఖ్యంగా నాని చాలా అందంగా కనిపిస్తున్నారు. ఆయన సరసన రీతూ వర్మ, ఐశ్వర్య రాజేష్ హీరోయిన్లుగా నటించారు.

నాజ‌ర్, జ‌గ‌ప‌తిబాబు, రావు ర‌మేష్‌, వీకే న‌రేష్‌, డానియ‌ల్ బాలాజీ, తిరువీర్, రోహిణి, దేవ‌ద‌ర్శిని, ప్రవీణ్ ముఖ్య పాత్రలు పోషించిన ఈ చిత్రానికి తమన్ సంగీతం సమకూర్చారు. ప్రసాద్ మూరెళ్ల సినిమాటోగ్రఫీ అందించారు. మాస్టర్ వెంకట్ కంపోజ్ చేసిన ఫైట్స్ టీజర్‌లో చాలా అట్రాక్టివ్‌గా కనిపిస్తున్నాయి. ఇక వెండితెరపై బ్లాక్ బస్టరే. ఈ సినిమాను షైన్ స్క్రీన్స్ బ్యానర్‌పై సాహు గారపాటి, హరీష్ పెద్ది నిర్మిస్తున్నారు.