ప్రధానాంశాలు:
- అగ్రరాజ్యంలో మరోసారి పడగవిప్పి గన్ కల్చర్.
- ముక్కుపచ్చలారని చిన్నారులను బలితీసుకున్న ఆగంతకుడు.
- ఇంట్లోవారిపై కాల్పులు జరిపిన యువకుడు.
నిందితుడు, మృతులు ఒకే ఇంట్లోనే ఉంటున్నారని, వారి మధ్య ఉన్న సంబంధం ఏంటనేది స్పష్టంగా తెలియదని పేర్కొన్నారు. తెల్లవారుజామున 1.30 గంట ప్రాంతంలో కాల్పుల ఘటన గురించి తమకు సమాచారం అందినట్టు వివరించారు. ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు.. నిందితుడిని ఎన్కౌంటర్కు ప్రయత్నించగా తప్పించుకున్నాడని, తర్వాత అతడిని అదుపులోకి తీసుకున్నామని అన్నారు. విచారణకు నిందితుడు సహకరించడంలేదని తెలిపారు.
ఘటనా స్థలిలో నలుగురు చిన్నారులు, వ్యక్తి చనిపోయారని.. తీవ్రంగా గాయపడిన మరో చిన్నారి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందింది. ఈ ఘటనలో గాయపడిన ఓ మహిళ ప్రస్తుతం తుస్లా ఆస్పత్రిలో చికిత్స పొందుతుందని, ఆమె పరిస్థితి నిలకడగా ఉందన్నారు. ఇదిలా ఉండగా, నిందితుడు ప్రిడ్జోన్ గతంలో ఓ మహిళపై దాడికి పాల్పడినట్టు పోలీసులు తెలిపారు. ఈ నేరాన్ని అంగీకరించిన అతడిని మూడేళ్లు పరిశీలనలో ఉంచాలని న్యాయస్థానం ఆదేశించింది. అంతేకాదు మానసిక అనారోగ్యంతో బాధపడుతున్నాడా? అనేది నిపుణులు ద్వారా గుర్తించాలని సూచించింది.
క్రీక్ ఎలిమెంటరీ పాఠశాలలో చదువుతున్న ఇద్దరు పిల్లలు చనిపోయారని, ఓ విద్యార్ధి గాయపడ్డారని ముస్కోగీ పబ్లిక్ స్కూల్స్ మంగళవారం విడుదల చేసిన ప్రకటనలో తెలిపారు.