Okey Oka Lokam Song: ‘శశి’ పాటకు సక్సెస్ సెలబ్రేషన్స్.. సినిమా ఇంకా పెద్ద హిట్ అవుతుందన్న సాయికుమార్ – aadi saikumar sashi: oke oka lokam nuvve song success celebrations

0
30


ప్రధానాంశాలు:

  • ఆది సాయికుమార్ హీరోగా వస్తోన్న ‘శశి’
  • సూపర్ హిట్ అయిన ‘ఒకే ఒక లోకం నువ్వే’ పాట
  • సిద్ శ్రీరామ్ ఖాతాలో మరో అద్భుత గీతం

ఆది సాయికుమార్ హీరోగా, సురభి హీరోయిన్‌గా శ్రీనివాస్ నాయుడు నందికట్ల దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘శశి’. శ్రీ హనుమాన్ మూవీ మేకర్స్ పతాకంపై ఆర్.పి. వర్మ, సి. రామాంజనేయులు, చింతలపూడి శ్రీనివాసరావు సంయుక్తంగా నిర్మించారు. ఇటీవల ఈ చిత్రం టీజర్‌ను మెగాస్టార్ చిరంజీవి రిలీజ్ చేశారు. ఈ టీజర్‌కు మంచి స్పందన వచ్చింది. అలాగే, ఈ చిత్రం నుంచి విడుదలైన ‘ఒకే ఒక లోకం నువ్వే’ పాట సంగీత ప్రియులను విపరీతంగా అలరిస్తోంది.

ఈ మధ్య కాలంలో సంగీత ప్రియులను విపరీతంగా ఆకట్టుకుని యూట్యూబ్‌లో మిలియన్ల కొద్దీ వ్యూస్ సాధించిన పాట ఇది. చాలా మంది ఈ పాటను కాల్ ట్యూన్‌గా ఉపయోగిస్తున్నారు. అంతలా ఈ పాట జనాల్లోకి వెళ్లిపోయింది. యూట్యూబ్ ఈ పాటకు 22 మిలియన్ పైగా వ్యూస్ వచ్చాయి. ఈ అందమైన పాటను చంద్రబోస్ రచించారు. సిద్ శ్రీరామ్ ఆలపించారు. అరుణ్ చిలువేరు సంగీతం సమకూర్చారు.

సాయితేజ్ ‘రిపబ్లిక్’ రిలీజ్ డేట్ ఫిక్స్.. బాలయ్య తరవాత వస్తోన్న సుప్రీం హీరో
ఈ పాట ఇంత అద్భుత విజయాన్ని అందుకోవడంతో సక్సెస్ సెలబ్రేషన్స్ ప్రెస్ మీట్ ఏర్పాటు చేసింది చిత్ర యూనిట్. సోమవారం హైదరాబాద్ ప్రసాద్ ల్యాబ్స్‌లో ఈ వేడుకను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో డైలాగ్ కింగ్ సాయికుమార్, హీరో ఆది సాయికుమార్, హీరోయిన్ సురభి, దర్శకుడు శ్రీనివాస్ నాయుడు నందికట్ల, సంగీత దర్శకుడు అరుణ్, కెమెరామెన్ అమర్‌నాథ్‌ బొమ్మిరెడ్డి, పాటల రచయిత చంద్రబోస్, మాటల రచయిత రవి, స్క్రీన్ ప్లే రైటర్ మణి, ఆర్ట్ డైరెక్టర్ రఘు కులకర్ణి, నిర్మాత ఆర్ పి. వర్మ, ఆదిత్య మ్యూజిక్ ప్రతినిధి నిరంజన్ తదితరులు పాల్గొన్నారు. అనంతరం ప్లాటినమ్ డిస్క్‌లను సాయికుమార్ చిత్ర యూనిట్‌కు అందించారు.

Oke Oka Lokam Nuvve Song Success Celebrations

‘శశి’ టీమ్‌తో సాయికుమార్

ఈ సందర్భంగా సాయికుమార్ మాట్లాడుతూ.. ‘‘నిర్మాత వర్మ నాకు ఎప్పటినుండో మంచి ఫ్రెండ్. బేసిగ్గా అతను డిస్ట్రిబ్యూటర్. మంచి కథతో ఈ చిత్రాన్ని చాలా రిచ్‌గా నిర్మించారు. రీసెంట్‌గా నేను ‘పోలీస్ స్టోరీ’ 25 ఇయర్స్ సెలెబ్రేషన్స్‌కి వెళ్ళినప్పుడు అక్కడ ‘ఒకే ఒక లోకం నువ్వే’ పాటని కన్నడలో తర్జుమా చేసి బాగా ఎంజాయ్ చేస్తూ వింటున్నారు. అలాగే తమిళనాడులో కూడా రెస్పాన్స్ చాలా బాగుంది. తప్పకుండా ‘శశి’ పాట లాగే పెద్ద హిట్ అవుతుంది అని అందరూ ఫోన్స్ చేసి చెపుతున్నారు. అరుణ్ ఎక్స్‌లెంట్ మ్యూజిక్ ఇచ్చాడు. చంద్రబోస్ సూపర్బ్ లిరిక్స్ రాశారు. ఆది కెరీర్ బెస్ట్ సాంగ్ ఇది. 22 మిలియన్స్ పైగా రీచ్ అయింది. నేను చాలా ఎగ్జైట్‌గా వున్నాను. పాట కన్నా ‘శశి’ పెద్ద హిట్ అవుతుందని చాలా కాన్ఫిడెంట్‌గా ఉన్నాం’’ అని అన్నారు.

‘చక్ర’ విడుదల తేదీ ఖరారు.. నాలుగు భాషల్లో విశాల్ సినిమా
పాటల రచయిత చంద్రబోస్ మాట్లాడుతూ.. ‘‘2020లో కరోనా ముందు ‘నీలి నీలి ఆకాశం’ పాట రాగజ్యోతిలా నాకు కొత్త వెలుగునిచ్చింది. 2021లో ‘ఒకే ఒక లోకం నువ్వే’ పాట అందరి మనసుల్ని గెలిచి రంజింపచేస్తుంది. అరుణ్ కొత్త మ్యూజిక్ డైరెక్టర్ అయినా మంచి బాణీలు సమకూర్చారు. సిద్, అమృత గాత్రంతో ఈ పాట కొన్ని లక్షల మందికి రీచ్ అయింది. ఈ అవకాశం ఇచ్చిన దర్శక నిర్మాతలకు నా థాంక్స్. ఆదికి ఫస్ట్ టైం పాట రాశాను. అతనికి ఈ సినిమా పెద్ద సక్సెస్ అవ్వాలి’’ అని అన్నారు.

హీరో ఆది సాయికుమార్ మాట్లాడుతూ.. ‘‘ఒకే ఒక పాటని చాలా మంది రింగ్ టోన్‌గా పెట్టుకున్నారు. ఈ విషయం నేను ప్రత్యక్షంగా చూశాను. సాంగ్ చాలా పెద్ద హిట్ అయి 22 మిలియన్స్ వ్యూస్ రావడం సప్రయిజ్‌గా ఉంది. ఇంతలా ఆదరించి పెద్ద హిట్ చేసిన ప్రేక్షకులకు థాంక్స్. అరుణ్ బ్యూటిఫుల్ మ్యూజిక్ ఇచ్చాడు. చంద్రబోస్ గారు ఫస్ట్ టైమ్ నాకు పాట రాశారు. గొప్పగా ఆలపించిన సిద్ శ్రీరామ్‌కి స్పెషల్ థాంక్స్. మా నిర్మాతలు చాలా ప్యాషన్‌తో ఈ చిత్రాన్ని నిర్మించారు. మార్చ్ 19న ‘శశి’ మూవీ రిలీజ్ అవుతుంది. ఈ చిత్రంలో యాక్షన్ చాలా కొత్తగా ఉంటుంది. రియల్ సతీష్ నేచురల్‌గా రాగా ఉండేలా డిఫరెంట్‌గా డిజైన్ చేశారు. సురభి అందంతో పాటు మంచి టాలెంటెడ్ యాక్ట్రెస్. అమర్ ప్రతి ఫ్రేమ్ అందంగా తీర్చిదిద్దారు. చిరంజీవి గారు టీజర్ రిలీజ్ చేసి.. ‘విజువల్స్ బ్యూటిఫుల్‌గా ఉన్నాయి’ అని బ్లెస్ చేశారు. ఆయనకి నా స్పెషల్ థాంక్స్’’ అని అన్నారు.

ఆది ‘శశి’: ఒకే ఒక లోకం నువ్వే పాట.. సిద్ శ్రీరామ్ మరో అద్భుతం

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here