
విశ్వక్సేన్కు, దర్శకుడికి స్క్రిప్ట్ అందజేస్తున్న దిల్ రాజు
కాగా, ముహూర్తపు సన్నివేశానికి హిట్ చిత్రాల నిర్మాత దిల్ రాజు క్లాప్ కొట్టగా, ప్రముఖ నిర్మాత బీవీఎస్ఎన్ ప్రసాద్ కెమెరా స్విచ్ ఆన్ చేశారు. యంగ్ డైరెక్టర్ తరుణ్ భాస్కర్ ముహూర్తపు సన్నివేశానికి గౌరవ దర్శకత్వం వహించారు. దర్శకుడు అశ్వత్ మారిముత్తుకి దిల్ రాజు స్క్రిప్ట్‌ను అందించారు. ఫిబ్రవరి మూడో వారం నుండి సినిమా రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం అవుతుంది.
బెస్ట్ డైలాగ్ రైటర్‌గా నేషనల్ అవార్డ్‌ను అందుకున్న డైరెక్టర్ తరుణ్ భాస్కర్ ఈ చిత్రానికి మాటలను అందించారు. గ్యారీ బీహెచ్ ఎడిటర్‌గా వర్క్ చేస్తున్నారు. త్వరలోనే హీరోయిన్ సహా ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలను ప్రకటిస్తామని చిత్ర యూనిట్ తెలియజేసింది.