officer drinks sanitizer: వాటర్ బాటిల్ అనుకొని శానిటైజర్ తాగిన అధికారి.. సమావేశంలో షాక్! – brihanmumbai municipal corporation assistant commissioner mistakenly drinks sanitizer instead of water

0
19


ది ముంబై నగరానికి సంబంధించిన ఉన్నతస్థాయి సమావేశం. అధికారులు, ప్రజా ప్రతినిధులు హాజరయ్యారు. అందులోనూ 2021-22 సంవత్సరానికి విద్యా శాఖ బడ్జెట్‌ను సమర్పిస్తున్నారు. అలాంటి సమావేశంలో ఓ ఉన్నతాధికారి కాస్త ఆందోళనకు గురైనట్లున్నారు. మంచినీళ్లు అనుకొని తన ముందున్న శానిటైజర్ బాటిల్ ఓపెన్ చేసి నోట్లో పోసుకున్నారు. పక్కనే ఉన్న సిబ్బంది అప్రమత్తం చేయడంతో ప్రమాదం తప్పింది. అప్పటికీ ఓ చుక్క శానిటైజర్ గొంతులోకి జారినట్లు కనిపిస్తోంది. బృహన్ ముంబై మహానగర పాలక సంస్థ (BMC) సమావేశంలో ఈ ఘటన చోటు చేసుకుంది.

ఆ అధికారి బీఎంసీ అసిస్టెంట్‌ కమిషనర్‌ రమేష్‌ పవార్‌. విద్యా శాఖ బడ్జెట్‌ను ప్రవేశపెట్టింది ఆయనే. బహుశా ఆ హడావుడిలో కాస్త టెన్షన్‌కు గురై ఉంటారు. వాటర్‌ బాటిల్‌ అనుకుని శానిటైజర్‌ను చేతిలోకి తీసుకున్నారు. ఇందుకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.

Sanitizer

శానిటైజర్

ఈ ఘటన జరిగిన సమయంలో బీఎంసీ విద్యా కమిటీ చీఫ్‌ సంధ్య.. పవార్ పక్క సీట్లోనే ఉన్నారు. ఆ పరిణామానికి ఆమె నివ్వెరపోయారు. వెంటనే తేరుకున్న పవార్‌ అవి మంచినీళ్లు కాదని గ్రహించి శానిటైజర్‌ బాటిల్‌ను పక్కనపెట్టారు.

కరోనా మహమ్మారి పుణ్యమా అని ముఖానికి మాస్కులు, భౌతిక దూరంతో పాటు పరిశుభ్రత కోసం శానిటైజర్లు తప్పనిసరి అయ్యాయి. ఈ నేపథ్యంలో ఏ శుభకార్యానికీ, కార్యక్రమాలకు వెళ్లినా.. శానిటైజర్లను అందుబాటులో ఉంచుతున్నారు. వాటర్ బాటిళ్లతో పాటు టేబుళ్లపై వాటిని కూడా పెడుతున్నారు. అటూ ఇటూ అయితే.. పరిస్థితి గందరగోళమే. కాబట్టి జాగ్రత్త..!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here