nizamabad woman murder: అర్ధనగ్నంగా మహిళ శవం.. అత్యాచారం చేసి.. నిజామాబాద్‌లో ఘోరం – woman raped, murdered brutally in nizamabad

0
58


దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన హైదరాబాద్‌ దిశ ఘటన, ఆసిఫాబాద్ సమత హత్య కేసు మరువక ముందే తెలంగాణలో మరో ఘోరం వెలుగుచూసింది. మహిళను అత్యాచారం చేసి కిరాతకంగా చంపేసిన అమానుష ఘటన నిజామాబాద్‌ జిల్లాలో చోటుచేసుకుంది. వర్ని మండలం బడా పహాడ్ అటవీ ప్రాంతంలో ఈ దారుణం జరిగింది. అటవీ ప్రాంతంలోని నీటిమడుగులో అర్థనగ్నంగా పడి ఉన్న మహిళ మృతదేహం తీవ్ర కలకలం రేపింది. మహిళను గుర్తుతెలియని దుండగులు అమానుషంగా అత్యాచారం చేసి అంతమొందించారు. ఆమె ఆనవాళ్లు తెలియకుండా ఉండేందుకు ముఖాన్ని కాల్చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. డాగ్‌స్క్వాడ్, క్లూస్ టీంను రప్పించి ఆధారాలు సేకరించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Also Read: అన్న కళ్లెదుటే చెల్లెలి చేయిపట్టుకుని.. గుంటూరులో ఘోరం

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here