Nithiin 30: జోరుమీదున్న నితిన్.. ఆరంభంలోనే హవా! మరో సినిమా రిలీజ్ డేట్ అనౌన్స్ – nithiin- merlapaka gandhi combo movie release date fix

0
25


ప్రధానాంశాలు:

  • బాలీవుడ్ హిట్ మూవీ ‘అందాదున్’ తెలుగు రీమేక్
  • మేర్లపాక గాంధీ దర్శకత్వంలో నితిన్ హీరోగా మూవీ
  • రిలీజ్ డేట్ ఫిక్స్ చేసిన చిత్రయూనిట్

యంగ్ హీరో నితిన్ సూపర్ ఫామ్‌లో ఉన్నారు. వరుస సినిమాలు చేసుకుంటూ హవా కొనసాగిస్తున్నారు. రీసెంట్‌గా పెళ్లి చేసుకున్న ఆయన ఏ మాత్రం గ్యాప్ తీసుకోకుండా తాను కమిటైన సినిమా షూటింగ్స్ ఫినిష్ చేస్తున్నారు. ఇప్పటికే చంద్రశేఖర్ యేలేటి దర్శకత్వంలో ‘చెక్’ సినిమా షూటింగ్ కంప్లీట్ చేసి ఫిబ్రవరి 26న ప్రేక్షకుల ముందుకొచ్చేందుకు రెడీ అయిన నితిన్.. ఆ వెంటనే తమ మరో సినిమా ‘రంగ్ దే’ లైన్‌లో పెట్టారు. మార్చి 26న ఈ మూవీ రిలీజ్ కానుంది. ఈ నేపథ్యంలో తాజాగా నితిన్ మరో సినిమా రిలీజ్ డేట్ అనౌన్స్ కావడం ఆయన అభిమానుల్లో ఉత్సాహం నింపుతోంది.

మేర్లపాక గాంధీ దర్శకత్వంలో నితిన్ ఓ సినిమా చేస్తున్నారు. అయితే ఆ సినిమా గురించి పెద్దగా వార్తలు రాకున్నా ఏకంగా సినిమా రిలీజ్ డేట్ అనౌన్స్ కావడం ఆసక్తికరంగా మారింది. బాలీవుడ్ హిట్ సినిమా ‘అందాదున్’ రీమేక్‌గా ఈ సినిమా రూపొందిస్తున్నారు. గత కొన్ని నెలలుగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాకు టైటిల్ ఫిక్స్ చేయకుండానే రిలీజ్ డేట్ ప్రకటించారు మేకర్స్. జూన్ 11వ తేదీన ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్ ఉంటుందని తెలుపుతూ కొత్త పోస్టర్ విడుదల చేశారు.
అల్లరి నరేష్ నాంది ట్విట్టర్ రివ్యూ.. ఫస్టాఫ్, సెకండాఫ్ రిపోర్ట్
ఈ సినిమాను నితిన్ సొంత బ్యానర్ అయిన శ్రేష్ఠ మూవీస్ బ్యానర్‌పై ఆయన తండ్రి సుధాకర్ రెడ్డి, సోదరి నిఖితారెడ్డి నిర్మిస్తుండటం విశేషం. నితిన్ కెరీర్‌లో 30వ సినిమాగా రాబోతున్న ఈ చిత్రంలో తమన్నా, నభా నటేష్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. మహతి స్వర సాగర్ సంగీతం అందిస్తున్నారు.రిలీజ్ డేట్ ప్రకటించిన ఈ సినిమాకి ఏ టైటిల్ పెడతారు? అనే కుతూహలాన్ని ప్రేక్షకుల్లో పెంచేసింది చిత్రయూనిట్. ఏదిఏమైనా ఈ ఏడాది ఆరంభంలోనే నితిన్ వరుస సినిమాలు వస్తుండటం ఆయన అభిమానులను హుషారెత్తిస్తోంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here