Nirmala Sitharaman: ఠాగూర్ కవిత, క్రికెట్, కొటేషన్లు.. నిర్మలమ్మ బడ్జెట్ స్పీచ్ – budget 2021: tagore, thiruvalluvar poetry in nirmala sitharaman budget speech

0
28


వితలు, కొటేషన్లు, స్ఫూర్తివంతమైన వాక్యాలతో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ బడ్జెట్‌ ప్రసంగం ఆసక్తికరంగా సాగింది. సోమవారం (ఫిబ్రవరి 1) ఉదయం 11 గంటలకు లోక్ సభలో బడ్జెట్ ప్రవేశపెట్టిన నిర్మలమ్మ అనంతరం ప్రసంగం కొనసాగించారు. సందర్భానుసారంగా గురుదేవ్‌ రవీంద్రనాథ్ ఠాగూర్‌, ప్రముఖ తమిళ కవి తిరువళ్లువర్‌ వ్యాఖ్యలను ప్రస్తావించారు. ఒక సందర్భంలో ఇండియన్ క్రికెట్ గురించి కూడా ప్రస్తావించి ఆకట్టుకున్నారు. నిర్మలా సీతారామన్ మాట్లాడుతున్నంతసేపు ఎన్డీయే సభ్యులు బల్లలు చరుస్తూ హర్షం ప్రకటించడం కనిపించింది.

రవీంద్రనాథ్‌ ఠాగూర్‌ రాసిన ‘గీతాంజలి’ గ్రంథంలోని ఒక కవితను నిర్మలా సీతారామన్ తన బడ్జెట్ ప్రసంగంలో ప్రస్తావించారు. ‘విశ్వాసమనేది ఒక పక్షి లాంటిది. దీపాన్ని చూసి ఉదయమైందని భావించి కిలకిలారావాలు చేస్తుంది. భారత్‌ బ్రిటిషువారి నుంచి విముక్తి పొంది కొత్తశకాన్ని ప్రారంభించింది. స్వేచ్ఛా వాయువులతో నూతన ప్రయాణాన్ని ప్రారంభించిన భారత్‌.. ప్రజలు తనపై ఉంచి కోట్లాది ఆశలకు హామీ ఇస్తూ ప్రపంచానికి ఆశాకిరణంగా మారింది’ అని గురుదేవ్ అన్నారు.

తమిళ కవి తిరువళ్లువర్‌ ‘కురల్‌’ అనే గ్రంథంలో పరిపాలనకు సంబంధించి అనేక అంశాలను ప్రస్తావించారు. ‘పాలకుడు తన రాజ్యంలో సంపదను సృష్టించడం లేదా సమీకరించడం చేస్తుంటాడు. దీన్ని భద్రంగా కాపాడటంతో పాటు సమాజ సంక్షేమానికి వినియోగించాలి’ అని తిరువళ్లువర్ పేర్కొన్న మాటలను నిర్మలా సీతారామన్ తన ప్రసంగంలో ఉటంకించారు.

భారత్‌లో పన్నుల విధానం సమర్థంగా ఉండటంతో పాటు పారదర్శకంగా ఉండాలని నిర్మలా సీతారామన్ పేర్కొన్నారు. ఇది కనిష్ట ప్రభుత్వం – గరిష్ట పాలనలో కీలకమని చెప్పారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here