Niharika Konidela: పెళ్లి వేడుకలో నాకిష్టమైంది ఇదే.. సీక్రెట్ బయటపెడుతూ మురిసిపోయిన నిహారిక – niharika shared her favourite pic in the marraige event

0
36


గుంటూరుకు చెందిన జొన్నలగడ్డ చైతన్యతో మెగా బ్రదర్ నాగబాబు కుమార్తె నిహారిక వివాహం డిసెంబర్ 9వ తేదీన అంగరంగ వైభవంగా జరిగిన సంగతి తెలిసిందే. కేవలం కుటుంబ సభ్యులు, అత్యంత సన్నిహితుల సమక్షంలో రాజస్థాన్ లోని ఉదయ్‌పూర్‌లో ఆమె పెళ్లి వేడుక జరిగింది. ఆ తర్వాత హైదరాబాద్‌లో రిసెప్షన్ నిర్వహించారు. కన్నుల పండగగా జరిగిన ఈ మొత్తం వేడుకలో చిరంజీవి సహా మెగా ఫ్యామిలీ అంతా ఒక్కటై తెగ సందడి చేయడంతో ఇందుకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఈ నేపథ్యంలో తాజాగా తనకిష్టమైన పిక్ ఇదే అంటూ ఇన్స్‌స్టాగ్రామ్‌లో ఓ పోస్ట్ పెట్టింది నిహారిక.

ఎప్పుడైతే నిహారిక తనకు కాబోయే వాడిని పరిచయం చేసిందో అప్పటి నుంచి సామాజిక మాధ్యమాల్లో నిహారిక ఫొటోలు హల్చల్ చేస్తున్నాయి. మెహెందీ ఫంక్షన్, ప్రీ వెడ్డింగ్ మొదలుకొని పెళ్లి ఫొటోలు మొత్తం మెగా అభిమానులను ఎంతో ఆకర్షించాయి. అయితే వీటన్నింటిలో తనకు మంగళ స్నానం చేయిస్తోన్న ఎంతో నచ్చిందంటూ తాజాగా నిహారిక పోస్ట్ పెట్టింది. ‘ఐ లవ్ దిస్ పిక్’ అని మురిసిపోతూ ఆ ఫోటోను అభిమానులతో పంచుకుంది. ఇది చూసిన నెటిజన్స్ ‘మీ టేస్ట్ సూపర్ మేడం’ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
ర‌వితేజ‌ ‘క్రాక్’ ట్రైల‌ర్: ముహూర్తం ఖరారు.. ఫ్యాన్స్‌కు అదిరిపోయే ట్రీట్
ఇకపోతే ఇటీవలే క్రిస్మస్ సంబరాలు చేసుకున్న కొత్త దంప‌తులు చైనిహారిక ప్రస్తుతం హ‌నీమూన్ ట్రిప్ ఎంజాయ్ చేస్తున్నారు. మాల్దీవుల్లోని అందమైన లొకేషన్స్ విజిట్ చేస్తూ హాయిగా విహరిస్తున్నారు. మరో వారం రోజుల పాటు ఈ భూత‌ల స్వ‌ర్గంలో ఏకాంతంగా గ‌డిపిన త‌ర్వాత తిరిగి హైద‌రాబాద్‌ చేరుకోనుంది ఈ జోడీ. ఇదిలా ఉంటే నిహారిక భర్త చైతన్య కూడా హీరోగా సినిమాల్లోకి ఎంట్రీ ఇవ్వనున్నట్లు వస్తున్న వార్తలు మెగా అభిమానుల్లో జోష్ నింపాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here