మహారాష్ట్ర, కేరళ రాష్ట్రాల్లో కరోనా కేసులు అనూహ్యంగా పెరుగుతున్న వేళ ఆందోళనకర వార్త వచ్చింది. భారత్లో రెండు రకాల కొత్త కరోనా వేరియంట్లను గుర్తించినట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రకటించింది. N440K, E484K అనే రెండు రకాల వేరియంట్లను గుర్తించినట్లు మంగళవారం (ఫిబ్రవరి 23) తెలిపింది. ఈ కొత్త వైరస్ మహారాష్ట్ర, కేరళతో పాటు తెలంగాణ రాష్ట్రంలో గుర్తించినట్లు నీతి ఆయోగ్ సభ్యుడు డాక్టర్ వీకే పాల్ తెలిపారు.
దేశంలో 187 యూకే రకం కరోనా వైరస్ కేసులు, 6 సౌతాఫ్రికా స్ట్రెయిన్ కేసులతో పాటు బ్రెజిల్ రకానికి చెందిన ఒక కేసును గుర్తించినట్లు నీతి ఆయోగ్ సభ్యుడు డాక్టర్ వీకే పాల్ తెలిపారు.