ఢిల్లీలో చలిని దృష్టిలో పెట్టుకొని వృద్ధులు, మహిళలు, చిన్నారులను ఇంటికి పంపించి వేయాలని రైతు సంఘాల నేతలను కోరినట్టు మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ తెలిపారు. చర్చల అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. నాలుగు పాయింట్ల అజెండాపై చర్చలు జరిపామని.. రెండింటిపై ఏకాభిప్రాయం కుదిరిందని ఆయన వెల్లడించారు.
రైతు సంఘాలు మాత్రం 3 వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని గట్టిగా పట్టుబడుతున్నాయి. అయితే.. కనీస మద్దతు ధర కొనసాగుతుందని ప్రభుత్వం చెబుతోంది. ఇందుకోసం లిఖితపూర్వక హామీ ఇచ్చేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉన్నట్టు మంత్రి తెలిపారు. రైతు సంఘాల నేతలు మాత్రం ఎంఎస్పీని చట్టంలో చేర్చాలని పట్టుబడుతున్నారు. మద్దతు ధర విషయంలో రైతుల డిమాండ్ల పరిశీలనకు కేంద్ర ప్రభుత్వం ఒక కమిటీని ఏర్పాటు చేసే యోచనలో ఉన్నట్టు తెలుస్తోంది.
Also Read:వారం పాటు రోడ్లు ఊడ్వండి.. పోలీస్ అధికారికి కోర్టు షాక్!