ప్రధానాంశాలు:
- బోయపాటి శ్రీను- బాలకృష్ణ కాంబో
- హాట్రిక్ మూవీగా BB3
- కథను మలుపుతిప్పే కీలకపాత్రలో నారా రోహిత్
బాణం, సోలో, రౌడీ ఫెల్లో, అసుర లాంటి విభిన్నమైన చిత్రాలతో ఆకట్టుకున్న యంగ్ హీరో నారా రోహిత్ కెరీర్ ప్రస్తుతం కాస్త స్లో అయింది. దీంతో తిరిగి అతన్ని లైమ్ లైట్ లోకి తీసుకురావాలనే కోణంలో పక్కాగా ప్లాన్ చేశారట బోయపాటి, బాలకృష్ణ. ఈ మేరకు తమ కాంబోలో భారీ అంచనాల నడుమ రూపొందుతున్న BB3లో ఆయనతో ఎమ్మెల్యే రోల్ చేయిస్తున్నారనేది లేటెస్ట్ సమాచారం.
దాదాపు మూడేళ్ళుగా సినిమాలకు గ్యాప్ ఇచ్చిన నారా రోహిత్ డిఫరెంట్ గెటప్ లోకి ట్రాన్స్ఫామ్ అయ్యారు. కాస్త బరువు తగ్గి పూర్తిగా తన లుక్ మార్చేశారు. కొద్ది రోజుల క్రితం ఈ లుక్ తాలూకు ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఈ నేపథ్యంలో అల్లు అర్జున్ తాజా సినిమా ‘పుష్ప’లో కూడా నారా రోహిత్ కీలక పాత్ర పోషిస్తున్నారని తెలియడం, ఇప్పుడు బాలయ్య సినిమాలో చిత్రాన్ని మలుపుతిప్పే పాత్రలో కనిపిస్తాడని తెలుస్తుండటం.. ఆయన కెరీర్‌ని టర్నింగ్ పాయింట్ అయ్యే అవకాశం ఉందని చెప్పుకోవచ్చు.
మరోవైపు BB3 కోసం నందమూరి అభిమాన లోకం ఆతృతగా ఎదురుచూస్తోంది. వారి ఆతృతను తెర దించుతూ ఈ సినిమాను మే 28వ తేదీన రిలీజ్ చేస్తున్నట్లు ప్రకటించారు బోయపాటి శ్రీను. బాలయ్య కెరీర్లో 106వ సినిమాగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ చిత్రాన్ని ద్వారకా క్రియేషన్స్ బ్యానర్‌పై భారీ రేంజ్లో మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మిస్తున్నారు.