Nandamuri Balakrishna: బాలయ్యతో స్క్రీన్ షేర్ చేసుకోబోతున్న పవర్ స్టార్! స్వయంగా ఆయనే కోరడంతో బోయపాటి స్కెచ్.. – puneeth rajkumar who is going to share the screen with nandamuri balakrishna

0
52


నేటితరం ప్రేక్షకులు ఒకేతెరపై ఇద్దరు స్టార్ హీరోలను చూడటం ఎంతగానో ఇష్టపడుతున్నారు. క్రమంగా మల్టీస్టారర్ సినిమాలకు పెద్దపీట వేస్తున్నారు ఆడియన్స్. దీంతో ప్రేక్షకుల అభిరుచికి తగినట్లుగా తమ తమ సినిమాల్లో ఒకే తెరపై స్టార్ హీరోలను చూపించేలా ప్లాన్ చేసుకుంటున్నారు దర్శకనిర్మాతలు. ఈ క్రమంలోనే మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను బాలయ్యతో చేస్తున్న సినిమాలో కన్నడ పవర్ స్టార్‌ని కన్ఫర్మ్ చేశారని తెలుస్తోంది.

వరస హిట్లతో సత్తా చాటుతున్న కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్‌కుమార్, నందమూరి నటసింహంతో తెర పంచుకోబోతున్నారని విశ్వసనీయ వర్గాల సమాచారం. ఇందులో ఆయన పోషించబోయేది పవర్‌ఫుల్ పోలీస్ ఆఫీసర్ రోల్ అని తెలిసింది. ఇంటర్వెల్ ముందు పునీత్ రాజ్‌కుమార్ పర్‌ఫార్‌మెన్స్ నందమూరి అభిమానులను కనువిందు చేయనుందని టాక్ నడుస్తోంది. ఈ పాత్ర పునీత్ రాజ్‌కుమార్‌తో చేయించాలని బాలయ్యనే బోయపాటికి సలహా ఇచ్చారట.

బాలకృష్ణ 106వ సినిమాగా రూపొందుతోన్న ఈ చిత్రం పక్కా మాస్‌ అండ్‌ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా ప్రేక్షకుల ముందుకు రానుంది. రాయలసీమ, వారణాసి బ్యాక్‌డ్రాప్‌లో రాబోతున్న ఈ మూవీలో బాలయ్య బాబు రెండు డిఫరెంట్ షేడ్స్‌లో కనిపించనున్నారని తెలుస్తుండటం నందమూరి అభిమానుల్లో కుతూహలం పెంచేసింది. పైగా బాలకృష్ణ- బోయపాటిది సక్సెస్‌ఫుల్ కాంబో కావడంతో ఈ సినిమాపై భారీ అంచనాలు పెట్టుకున్నారు ప్రేక్షకులు. ‌
‘రాజకీయాలు మనకొద్దు నాన్నా’.. రజినీకాంత్‌‌కు కూతుళ్ల ట్విస్ట్!
ఇకపోతే ప్రస్తుతం చిత్రంలోని కీలకమైన యాక్షన్ సన్నివేశాలను తెరకెక్కిస్తున్నారు డైరెక్టర్ బోయపాటి శ్రీను. పిడుగురాళ్లలోని ఓ గుట్టపై ఈ షూట్ పూర్తిచేయనున్నారట. ఈ భారీ సినిమాకు మిర్యాల రవీంద్రనాథ్ రెడ్డి నిర్మాతగా వ్యవహరిస్తుండగా థమన్ సంగీతం సమకూరుస్తున్నారు. ‘టార్చ్‌బేరర్’ అనే డిఫరెంట్ టైటిల్‌తో ఈ మూవీ రిలీజ్ కానుందని టాక్.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here