ప్రధానాంశాలు:
- మాస్ కథలతో రంగంలోకి నందమూరి బాలకృష్ణ
- BB3 తర్వాత ఆయన నటించనున్న సినిమాపై క్లారిటీ
- గోపీచంద్ మలినేనితో సినిమా కన్ఫర్మ్
బాలకృష్ణ- గోపీచంద్ మలినేని కాంబోలో సినిమా అతిత్వరలో ప్రారంభం కానుందని మైత్రిమూవీ మేకర్స్ నిర్మాతలు నవీన్, రవిశంకర్ పేర్కొన్నారు. తాజాగా రీసెంట్గా ‘ఉప్పెన’ ప్రమోషన్లో భాగంగా ఓ మీడియాకిచ్చిన ఇంటర్వ్యూలో ఈ విషయాన్ని స్పష్టం చేశారు. బాలకృష్ణ కోసం గోపీచంద్ మలినేని ఓ కథ సిద్ధం చేస్తున్నారని, బాలయ్య చేస్తున్న BB3 షూటింగ్ ఫినిష్ కాగానే తమ బ్యానర్‌పై ఈ సినిమా సెట్స్ మీదకొస్తుందని తెలిపారు. ఈ మూవీ ప్రేక్షకుల అంచనాలు రీచ్ అయ్యేలా ఉంటుందని, దీని కోసం తాము కూడా చాలా ఆతృతగా ఎదురుచూస్తున్నామని అన్నారు.
ఉగాది సందర్భంగా ఏప్రిల్ నెలలో ఈ సినిమాను అధికారికంగా ప్రకటించనున్నారని తెలుస్తోంది. ఆ వెంటనే మే నెలలో రెగ్యులర్ షూట్ ప్రారంభించనున్నారని టాక్. ఇటీవలే రవితేజ హీరోగా ‘క్రాక్’ సినిమాతో మాస్ ఆడియన్స్‌లో ఊపు తెప్పించిన గోపీచంద్ మలినేని ఈ సారి మరింత పవర్ఫుల్ స్టోరీ రెడీ చేస్తున్నారట. ప్రస్తుతం స్క్రిప్ట్ డెవెలప్ చేసే పనిలో ఉన్న ఆయన ఈ భారీ సినిమా కోసం నటీనటుల ఎంపిక ప్రక్రియ కూడా షురూ చేశారనేది ఫిలిం నగర్ టాక్. సో.. బోయపాటి, గోపీచంద్ ఇద్దరూ మాస్ ఆడియన్స్ పల్స్ బాగా తెలిసిన డైరెక్టర్లు కాబట్టి ఇక వరుస ప్రాజెక్టులతో బాలయ్య అభిమానులు ఈలలతో గోల పెట్టే రోజులే ముందున్నాయని చెప్పుకోవచ్చు.