Namita Weight Loss: ఆల్కహాల్‌కి బానిసనవ్వడం వల్లే బరువు పెరిగానన్నారు.. ఆత్మహత్య చేసుకోవాలని అనిపించింది: నమిత – people started gossiping i had succumbed to alcohol, namita about her weight gain

0
36


ప్రధానాంశాలు:

  • మానసిక ఒత్తిడికి గురయ్యానన్న నమిత
  • 97 కేజీల బరువు పెరిగానన్న మాజీ హీరోయిన్
  • డిప్రెషన్‌లో తెగ తినేదాన్ని అని చెప్పిన నమిత

నమిత.. తెలుగు ప్రేక్షకులకు పరిచయం అవసరంలేని పేరు. శ్రీను వైట్ల దర్శకత్వంలో 2002లో వచ్చిన ‘సొంతం’ సినిమాతో హీరోయిన్‌గా పరిచయం అయిన నమిత తొలి సినిమాతోనే కుర్రాళ్లను కట్టి పడేశారు. ఆ తరవాత ‘జెమిని’, ‘ఒక రాజు ఒక రాణి’, ‘ఒక రాధ ఇద్దరి కృష్ణుల పెళ్ళి’ సినిమాల్లో నటించారు. అనంతరం తమిళ సినీ ఇండస్ట్రీకి వెళ్లారు. తమిళంలో రాణించిన నమిత అడపాదడపా తెలుగు సినిమాల్లో కనిపించారు.

అయితే, కెరీర్ ఆరంభంలో సన్నగా ఉన్న నమిత.. ‘బిల్లా’ సినిమాలో బొద్దుగా కనిపించి అందరినీ ఆశ్చర్యపరిచారు. 2017లో తెలుగబ్బాయి వీరేంద్ర చౌదరిని పెళ్లాడిన నమిత.. వివాహం తరవాత బరువు తగ్గుతూ వచ్చారు. ఇప్పుడు స్లిమ్‌గా మారారు. ఇదిలా ఉంటే, పదేళ్ల క్రితం తన లుక్‌ను.. ప్రస్తుతం బరువు తగ్గాక రూపాన్ని పోలుస్తూ ఇన్‌స్టాగ్రామ్‌లో ఎమోషనల్ పోస్ట్ పెట్టారు నమిత. తీవ్ర మానసిక ఒత్తిడికి లోనైనట్టు వెల్లడించారు. ఐదున్నరేళ్లు డిప్రెషన్‌లోనే బతికానని పేర్కొన్నారు.

టాలీవుడ్ నిర్మాతలకు ఎగ్జిబిటర్స్ షాక్.. థియేటర్లు మూసేస్తాం అంటూ హెచ్చరిక
‘‘బ్లాక్ డ్రెస్‌లో ఎడమ చేతివైపు ఉన్న ఆ ఫొటో 9 నుంచి 10 ఏళ్ల క్రితం నాటిది. కుడివైపు ఉన్నది కొన్ని నిమిషాల ముందు తీసినది. మేకప్ కానీ, ఏ ఫిల్టర్ కానీ వాడలేదు.

ఈ పోస్ట్ పెట్టడానికి కారణం మానసిక ఒత్తిడి గురించి అవగాహనను వ్యాప్తి చేయడమే. ఎడమ చేతివైపు ఫొటో నేను చాలా డిప్రెషన్‌లో ఉన్నప్పటిది. కానీ, అది డిప్రెషన్ అని నాకు అప్పుడు తెలియకపోవడం బాధాకరం. నేను ఇబ్బంది పడుతున్నానని మాత్రమే నాకు తెలిసింది. రాత్రిళ్లు నిద్రపట్టేది కాదు. విపరీతంగా తినడం అలవాటైపోయింది. ప్రతిరోజూ పిజ్జా ఆర్డర్ చేసేదాన్ని. ఈ పరిణామంతో అనుకోకుండా బరువు పెరిగిపోయాను. నా బాడీ షేప్ మారిపోయింది. 97 కేజీల వరకు బరువు పెరిగాను.

దీంతో జనాలు నాపై వదంతులు మొదలుపెట్టారు. నేను ఆల్కహాల్‌కు బానిసనయ్యానని అన్నారు. కానీ, బరువు పెరగడానికి కారణం నా ఒక్కదానికే తెలుసు. పీసీఓడీ, థైరాయిడ్ కారణంగా నేను బరువు పెరిగాను. ఆత్మహత్య చేసుకోవాలని చాలా సార్లు అనిపించింది. ఎవ్వరూ నాకు మనశ్శాంతిని ఇవ్వలేకపోయారు. ఐదున్నరేళ్లు మానసిక ఒత్తిడిని అనుభవించిన తరవాత నా కృష్ణుడిని కనుక్కున్నాను. మహా మంత్రాలతో ధ్యానం చేశాను.

నేను ఏ డాక్టర్ వద్దకు వెళ్లలేదు. ఎలాంటి థెరపీ తీసుకోలేదు. నా థెరపీ మెడిటేషన్ మాత్రమే. అంతేకాదు, కృష్ణుడి ఆధ్యాత్మిక సేవలో గడపడం వల్ల కూడా నాకు మనశ్శాంతి లభించింది. మొత్తానికి నాకు శాంతి, శాశ్వతమైన ప్రేమ దక్కాయి. ఈ పోస్ట్‌లో నైతికత ఏంటంటే.. మీరు బయట వెతికేదంతా ఎప్పుడూ మీ లోపలే ఉంటుంది’’ అని నమిత తన పోస్ట్‌లో పేర్కొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here